‘ఆహా, ప్రతి ఒక్కరు వారిలా ఉంటే ఎంత బాగుండును!’
ఇవి లక్షేంబర్గ్ వార్తా పత్రికైన లెట్సబ్యూర్జర్ జర్నల్ యొక్క ప్రత్యేక శీర్షికా రచయిత మాటలు. ఆయన ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారు?
యాభైయవ ఆస్చ్విట్జ్ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన పోలండుకు వెళ్లారు, మరి ఎంతో బాధలననుభవించిన గుంపును గూర్చి అక్కడ ప్రస్తావించబడనేలేదని పేర్కొన్నారు. ఆయన ఫిబ్రవరి 2, 1995 నాటి తన కాలమ్లో ఆ ప్రత్యేక శీర్షికా రచయిత ఈ గుంపును యెహోవాసాక్షులుగా గుర్తించి ఇలా వ్రాశారు: “అటు తీవ్రమైన కారాగార శిక్ష గానీ నిర్బంధ శిబిరాలు గానీ ఇటు స్టార్వేషన్ బ్లాక్లు గానీ గిల్లొటిన్ లేక గొడ్డలి గానీ దారుణంగా చనిపోయే అపాయం గానీ వారు తమ విశ్వాసాన్ని త్యజించేలా చేయలేదు.” ఆయన ఇంకా ఇలా చెప్పారు: “క్రూరులైన ఎస్.ఎస్ గార్డులు సహితం యెహోవాసాక్షులు ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొనడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.”
యెహోవాసాక్షులు మరణించాలని ఇష్టపడలేదు. అయితే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే, క్రైస్తవ సూత్రాలతో రాజీపడేకన్నా మరణించడమే మంచిదని వారిలో వేలమంది భావించారు. అలాంటి విశ్వాసం, ఈ నాజీ పరిపాలనలోని భయంకరమైన దినాల్లో వారిని పూర్తి భిన్నంగా గుర్తించేట్లు చేసింది.
ప్రత్యేక శీర్షికా రచయిత ఈ నిర్ధారణకొచ్చాడు: “ఆహా, ప్రజలందరూ యెహోవాసాక్షుల్లా ఉంటే ఎంత బాగుండును!” అలా ఉండివుంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగివుండేది కాదు.