కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 7/15 పేజీ 31
  • పాఠకుల నుండి ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల నుండి ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • మరియ దగ్గరకు వచ్చిన గబ్రియేలు
    నా బైబిలు పుస్తకం
  • పుట్టకముందే యేసు ఘనత పొందాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • ఆయన జన్మించక పూర్వమే ఘనపరచబడెను
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • ఒక దూత మరియను దర్శించడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 7/15 పేజీ 31

పాఠకుల నుండి ప్రశ్నలు

యేసు తల్లియైన మరియ తన బంధువగు ఎలీసబెతును సందర్శించ వెళ్లునప్పటికే గర్భవతిగా ఉండెనా?

అవును, నిదర్శనాధారంగా ఆమె గర్భవతిగా ఉండెను.

లూకా 1వ అధ్యాయంలో మొదట మనం యాజకుడగు జెకర్యా భార్యయైన ఎలీసబెతు గర్భవతిగా ఉండుటను గూర్చి చదువుతాము, ఆమె (బాప్తిస్మమిచ్చు) యోహానుకు జన్మనిచ్చింది. ఎలీసబెతుకు “ఆరవ నెలలో గబ్రియేలను దూత” మరియను సందర్శించి, ఆమె గర్భం ధరించి “సర్వోన్నతుని కుమారుడనబడు” బాలుని కనునని తెలిపాడు. (లూకా 1:26, 30-33) అయితే మరియ ఎప్పుడు గర్భం ధరించింది?

అప్పుడు మరియ గర్భవతిగానున్న తన బంధువగు ఎలీసబెతును చూడడానికి యూదయకు ప్రయాణమై వెళ్లెనని లూకా వృత్తాంతం వివరిస్తున్నది. ఆ ఇద్దరు స్త్రీలు కలుసుకున్నప్పుడు, ఎలీసబెతు గర్భంలోని బిడ్డ (యోహాను) గంతులు వేశాడు. ‘మరియ గర్భఫలాన్ని’ సూచిస్తూ ఎలీసబెతు మరియను “నా ప్రభువు తల్లి” అని పిలిచింది. (లూకా 1:39-44) కాబట్టి అప్పటికే మరియ కడుపులో బిడ్డపడ్డాడని, ఆమె ఎలీసబెతును సందర్శించ వెళ్లునప్పటికే ఆమె గర్భవతియని న్యాయసమ్మతముగా చెప్పవచ్చును.

లూకా 1:56లో ఇలా చదువబడుతుంది: “అంతట మరియ, యించుమించు మూడునెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగివెళ్లెను.” ఈ వచనము క్యాలెండరులో కచ్చితముగా అది ఏ దినమో తెలియజేయుట లేదు. అది “యించుమించు మూడునెలలు” అని చెబుతున్నది, దీనిప్రకారం ఎలీసబెతు అప్పటికి తొమ్మిదినెలల గర్భవతిగా ఉంటుంది.

ఎలీసబెతు గర్భవతిగానున్న చివరినెలల్లో ఆమెకు సహాయం చేసిన తర్వాత, మరియ నజరేతులోగల తన ఇంటికి తిరిగివచ్చింది. ఎలీసబెతు (యోహానుకు) జన్మనిచ్చిన తర్వాత, కొందరు బంధువులతో సహా ఆమెను చూడడానికి చాలామంది వస్తారని మరియ గ్రహించింది. అక్కడే మరో అవివాహిత యువతి గర్భవతిగా ఉండుట వెటకారంగా లేదా కలవరపాటుగా ఉండగలదు. నజరేతుకు వెళ్లేటప్పటికి మరియ ఎన్నినెలల గర్భవతిగా ఉండెను? ఆమె ఎలీసబెతు దగ్గర “యించుమించు మూడునెలలు” ఉంది గనుక, నజరేతుకు తిరిగివచ్చినప్పుడు ఆమెకు గర్భం మూడునెలలు నిండటం లేదా నాల్గవనెల ఆరంభమై ఉండవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి