కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 7/15 పేజీలు 2-3
  • లోకాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోకాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • రండి, “మనం ఎవరికి విధేయత చూపించాలి?” అనే బహిరంగ ప్రసంగాన్ని వినండి
    తేజరిల్లు!—2005
  • ఇంట్లో రూల్స్‌ అవసరమా?
    యువత అడిగే ప్రశ్నలు
  • విధేయత బాల్యంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 7/15 పేజీలు 2-3

లోకాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడా?

అది ఆదివారం ఉదయం. అనేకమంది ప్రజలు మంచందిగి, బట్టలు వేసుకొని, టిఫిన్‌ తిని గబగబా చర్చికి వెళతారు. అక్కడ వాళ్లు దేవుడు అసాధారణ అధికారంతో భూమిపై సర్వోన్నతంగా పరిపాలించడాన్ని గూర్చిన ప్రసంగం విన్నారు. ప్రజలయెడల ఆయనకెంతో శ్రద్ధ ఉందని వాళ్లకు తెల్పబడింది. యేసుక్రీస్తు కూడ ప్రస్తావనకు వచ్చాడు. ఆయన రాజులకు రాజని విధేయతతో ప్రతిమోకాలు ఆయనయెదుట వంగునని చెప్పడమూ వాళ్లక్కడ విన్నారు.

చర్చినుండి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత, ఆ ప్రజలు దూరదర్శిని పెట్టుకుని వార్తలు చూశారు. ఇప్పుడు వాళ్లు కరువు, నేరం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దారిద్ర్యంవంటి వాటినిగూర్చి వింటారు. ఆలాగే వాళ్లు రోగం మరణాలకు సంబంధించిన హృదయవిదారకమైన దృశ్యాలు చూస్తారు.

చర్చిలో విన్నవాటిని గూర్చి, అక్కడెన్నడూ వివరించబడనివాటిని గూర్చి వాళ్లు ప్రత్యేకంగా ఆలోచించడం ఆరంభిస్తారు. దేవుడు ప్రేమగలవాడూ సర్వశక్తిమంతుడూ అయినట్లయితే, భయంకరమైనవి ఎందుకు సంభవిస్తాయి? మరి యేసుక్రీస్తు విషయమేమి? స్పష్టముగా, ఆయనకు విధేయతచూపుతూ వంగని మోకాళ్లెన్నో ఉన్నాయి.

[3వ పేజీలోని చిత్రం]

లోకాన్ని దేవుడే పరిపాలిస్తుంటే, బాధ సంక్షోభం ఎందుకున్నాయి?

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Cover: NASA photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి