కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 3/15 పేజీలు 3-4
  • మీ ప్రార్థనలను మీరెలా మెరుగుపర్చుకోగలరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ ప్రార్థనలను మీరెలా మెరుగుపర్చుకోగలరు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు శ్రద్ధగా చదివి మీ ప్రార్థనలను మెరుగుపర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 3/15 పేజీలు 3-4

మీ ప్రార్థనలను మీరెలా మెరుగుపర్చుకోగలరు?

యెహోవా దేవుని ప్రేమపూర్వక ఏర్పాట్లలో ప్రార్థన సాటిలేనిది. వ్యతిరేకులు మీ బైబిలును స్వాధీనం చేసుకోవచ్చు లేక తోటి ఆరాధికులతో సమకూడకుండా మిమ్మల్ని ఆటంకపర్చవచ్చు, అయినా ప్రార్థించకుండ మిమ్మల్ని ఎవ్వరూ నివారించలేరు. ప్రార్థనా విలువ ఎనలేనిది. కాబట్టి, ఈ ఆధిక్యతను విలువైందిగా ఎంచి మరియు దానినుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడం మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రాముఖ్యం. మీ ప్రార్థనలను మీరు మెరుగుపర్చుకోడానికి మీకు ఏది సహాయపడగలదు?

బైబిలు ఓ ప్రార్థనా పుస్తకం కాదు. అయినప్పటికీ, మానవజాతి యొక్క గొప్ప ప్రార్థనా పాఠ్యపుస్తకంగా అది వర్ణించబడగల్గవచ్చు. ఒక్క హెబ్రీ లేఖనాల్లోనే 150 ప్రార్థనలున్నాయి. కొన్ని చిన్నవి మరికొన్ని పెద్దవి. అవి రాజులు లేక బంధీలు, బహిరంగంగానైనా, ఏకాంతంగానైనా విజయోత్సాహాలయందైనా లేక శ్రమలయందైనా చేసిన ప్రార్థనలే. కీర్తన 65:2 నందు దావీదు పాడినట్లుగా, ‘ప్రార్థన ఆలకించువాడైన’ యెహోవావైపు “సర్వశరీరులు” మరలుతారు. విస్తృతంగా ఎంపిక చేయబడిన అలాంటి ప్రార్థనలను నమోదు చేసేందుకు దేవుడు బైబిలు రచయితలను ఎందుకు ప్రేరేపించాడు?

ఆ ప్రశ్నకు జవాబు కొరకు, 2 తిమోతి 3:16ను పరిశీలించండి. అది ఇలా చెబుతుంది: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము . . . ప్రయోజనకరమై యున్నది.” ఆ విధంగా, లేఖనాధారిత ప్రవచనాలు, సూత్రాలు, చరిత్రల వలెనే మనలను నడిపేందుకు బైబిలు ప్రార్థనలు రాయబడ్డాయి. ఈ ప్రార్థనలు మనకు ప్రయోజనకరంగా ఎలా ఉండగలవు?

లేఖనాధార ప్రార్థనలను సన్నిహితంగా పరిశీలించడం ద్వారా, మన పరిస్థితులకు పోలిన పరిస్థితుల్లోనే చెప్పినవాటిని మనం గుర్తించగలం. దాని ఉద్దేశం, సందర్భాన్నిబట్టి ప్రార్థనలు ఎలా మారుతాయన్న దాన్ని మనం నేర్చుకోగలము. అంతేకాకుండ, కీర్తించడాన్ని గూర్చి మరియు కృతజ్ఞతాస్తుతులను గూర్చిన క్రొత్త మాటలను మనం అన్వేషిస్తాము, మన విన్నపాలకు మరియు యాచనలకు తాజా పదజాలాన్ని కనుగొంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే, బైబిలునందలి ప్రార్థనలు, మన స్వంత ప్రార్థనలను మెరుగుపర్చుకునేందుకు సహాయపడగలవు.

యేసు తల్లియైన మరియ, బైబిలులో రాయబడిన ఒక ప్రార్థనలో ఉపయోగించిన మాటల నుండి ప్రయోజనం పొందిన వ్యక్తి అని స్పష్టమైంది. దైవ సహాయం వల్ల మరియ ఎలీసబెతులిద్దరూ గర్భవతులైన తర్వాత ఆమె తన బంధువైన ఎలీసబెతును సందర్శించింది. మరియు ఆశ్చర్యకరంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది మరియు ఆమె చెప్పిన మాటల్లో కొన్ని హెబ్రీ లేఖనాలందలి ఒక ప్రార్థనలోని మాటలకు పోలివున్నాయి. ప్రవక్తయైన సమూయేలు తల్లియైన హన్నా చేసిన ప్రార్థన మరియకు బాగా పరిచయమున్నట్లు అనిపిస్తుంది. వెయ్యి కన్నా ఎక్కువ సంవత్సరాలకు పూర్వం, హన్నా కూడా దేవుని సహాయంతో ఒక కుమారుని గర్భము దాల్చింది. అది మరియ భావాలను ప్రతిబింబిస్తుంది కనుక ఆమె ఈ ప్రార్థనను ధ్యానించివుండవచ్చునా?—1 సమూయేలు 2:1-10; లూకా 1:46-55.

మీ విషయమేమిటి? మీ పరిస్థితులకు సరిపోలిన పరిస్థితులలో పలికిన బైబిలు ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోగలరా? అలాంటి ప్రార్థనలను కనుగొనడం, చదవడం, ధ్యానించడం దేవునితో మీకు గల పరస్పరసంభాషణను మీరు మెరుగుపర్చుకునేందుకు సహాయపడతాయి. తర్వాతి శీర్షికలో, పరిశుద్ధ లేఖనాలలోని మూడు ప్రార్థనలను మీరు పరిశీలించాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. వాటిని విభిన్న సందర్భాల్లో చేయడం జరిగింది, బహుశ మీ పరిస్థితికి అవి సరిపోలినవి కావచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి