చిన్నవే కానీ శక్తివంతమైనవి
కెనడా దేశీయుడైన రాబర్ట్ అనే ఒక యౌవనుడు, తాను జీవించి ఉండడంలో ఉద్దేశమేమిటి అనే ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ ఐరోపా అంతా తిరిగాడు. భవిష్యత్తు విషయంలో తనకు నిరాశా భావమును మిగిల్చిన ఎన్నో విషయాలను ఆయన చూశాడు.
స్పెయిన్ నందలి సెవిలెలో ఒక కేఫ్‌లో రాబర్ట్ కూర్చున్నపుడు యెహోవాసాక్షులు ప్రచురించిన ఒక కరపత్రం చేతికి అందించబడింది. మొదట, రాబర్ట్‌కు అపనమ్మకం కలిగింది. “అయినా, నేను దాన్ని చదివాను” అని అయన చెప్పాడు. “నేను దాన్ని వివరించలేను గానీ, ఏదో వెలిగినట్లు నాకు తోచింది. నా ప్రయాణ సమయాల్లో నేను అనేక రకాలైన మానవ కృంగుదలలను వైఫల్యాలనూ చూశాను, అంతేకాకుండ విషయాలను మార్చలేని నా అసమర్థతవల్ల నేను కలతచెందాను. ఆ కరపత్రం చదివిన తర్వాత, నేను యిలా ఆలోచించాను, ‘ఈ “నూతన లోకం” అసలు ఉంటుందా?’ తర్వాత, ‘బహుశ అది ఉండవచ్చునేమో’ అని అనుకున్నాను.”
పునరుద్ధరించబడిన నిరీక్షణతో తాను యింటికి తిరిగి వచ్చిన తర్వాత, ఎవరో ఒకరు తనను సందర్శించి, బైబిలును అర్థం చేసుకునేందుకు సహాయపడమని కోరుతూ రాబర్ట్ కెనడానందలి యెహోవాసాక్షుల కార్యాలయానికి రాశాడు.
నిస్సందేహంగా, నోటి మాట ఎంతో విలువగలది. అయినప్పటికీ, ముద్రించబడిన సమాచారానికి గల శక్తిని ఎన్నడు తక్కువ అంచనా వేయవద్దు. అవి ఎంత చిన్నవైనప్పటికీ, బైబిలు ఆధారిత ప్రచురణలకు అంగీకరింపజేసే అపారమైన శక్తి ఉంది. భవిష్యత్తు విషయంలో నిశ్చయమైన నిరీక్షణనిస్తూ అవి మనస్సునూ హృదయాన్నీ తాకుతాయి.—హెబ్రీయులు 4:12.