మృతులను గూర్చిన భయం వ్యాప్తిచెంది ఉంది
సూర్యాస్తమయమై చాలా సమయం గడిచింది. మీరు యిష్టపడే దానికంటే కొంచెం ఆలస్యంగానే మీరు యింటికి వెళ్తున్నారు. మీరు నడుస్తూ ఆ ప్రాంతంలోని శ్మశానాన్ని దాటుతుంటే మీ గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. నిశ్శబ్ద నిశీద రాత్రి అతి చిన్న శబ్దాన్ని కూడా మీకు వినిపింపజేస్తుంది. అకస్మాత్తుగా దూరంనుండి తీక్షణమైన, భయపెట్టే శబ్దం మీకు వినిపిస్తుంది. రక్షణకొరకు మీరు యింటికి బయల్దేరుతుండగా—మీ నాడి కూడా మరింత వేగంగా కొట్టుకుంటుంది—మీరు మీ నడక వేగం పెంచుతారు.
మీరు శ్మశానంలో లేక దానికి దగ్గర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కంగారుపడ్డారా? అలా అయితే, మీరు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైయున్న మతపరమైన నమ్మకం చేత ప్రభావితమయ్యారన్నమాట—అదేమంటే మృతుల ఆత్మలు (స్పిరిట్స్) జీవించివున్న వారికి సహాయం లేక హాని చేయగలవు.
మృతులకు జీవించివున్న వారి సహాయం అవసరమని లేక వాటిని శాంతపర్చకపోతే జీవించి ఉన్నవారికి హాని కల్గిస్తాయనే నమ్మకం ఫలితంగా అనేక మూఢాచారాలు వృద్ధిచెందాయి. ఉదాహరణకు, కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో అనేకమందికి, ఒక వ్యక్తి దుర్ఘటనవల్ల మరణించిన స్థలంలో సిలువ ఉండే ఒక చిన్న యిల్లునుకట్టే ఆచారం ఉంది. మరణించిన వ్యక్తి ఆత్మ (సోల్) లేక ప్రాణం (స్పిరిట్) పట్ల శ్రద్ధ చూపడానికి లేక సహాయం చేయడానికి ప్రజలు అక్కడ కొవ్వొత్తులు వెలిగించి, పువ్వులు పెడతారు. కొన్ని సందర్భాల్లో, ప్రార్థనలకు “అద్భుతమైన” జవాబులను గూర్చిన వదంతులు వ్యాపించడంతో, మరణించిన వ్యక్తి ఆత్మ (సోల్) లేక ప్రాణం (స్పిరిట్) కొరకున్న చిన్న యిల్లైన అనిమిటా వద్దకు ప్రజలు తరచుగా రావడం ప్రారంభిస్తారు. ఒకవేళ మరణించిన వ్యక్తి, తాము ఏదైనా సాధించడం లేక పొందడం—బహుశా అద్భుతమైన స్వస్థత—కొరకు తమకు సహాయం చేస్తే, తమ కృతజ్ఞతను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చూపుతామని వాళ్లక్కడ మండాస్, లేక వాగ్దానాలు చేస్తారు. మరోవైపు, అక్కడున్న వారిని భయపెడుతూ, ఒక వ్యక్తి ఆత్మ (సోల్) రాత్రివేళ చీకటిలో కన్పించిందని వదంతి బయల్దేరుతుంది. అటువంటి ఆత్మలు పెనండోలని, గడిచిన సంఘటనలనుబట్టి జీవించి ఉన్నవారిని వేధిస్తున్నాయని సామాన్యంగా చెప్పబడుతుంది.
అనేక దేశాల్లో, మృతుల “ఆత్మలను” శాంతపర్చడానికి ప్రజలు ఎంతో ప్రయాసపడతారు. ఘనమైన విందులు చేయబడతాయి, బలులు అర్పించబడతాయి, ఓదార్పుకరమైన మాటలు పలుకబడతాయి—యిదంతా కూడా మరణించిన వ్యక్తి ఆత్మనుండి వచ్చే ప్రతీకారాన్ని తప్పించుకునే ప్రయత్నమే. ఆత్మను ప్రసన్నపర్చడం, మిగిలివున్న వారికి ప్రతిఫలాలను, ఆశీర్వాదాలను తెస్తుందని భావించబడుతుంది.
“ఏ సంఘటన కూడా ‘సాధారణంగా లేక సహజంగా’ సంభవించదని అనేకమంది విశ్వసిస్తారని,” ఆఫ్రికానుండి వచ్చిన ఒక నివేదిక చెబుతోంది. “ఏ సంఘటనయినా—అది వ్యాధి, విపత్తు, నిస్సంతత్వం, ఆర్థిక యిబ్బంది, అధిక వర్షపాతం లేక ఎండలు, ప్రమాదాలు, కుటుంబ అనైక్యత, మరణం వంటిదైనప్పటికీ—మానవాతీత శక్తులుగల, అదృశ్య ఆత్మలవల్లనే అది సంభవిస్తుందని భావించబడుతుంది.” మరొక నివేదిక యిలా చెబుతుంది: “తమ పూర్వీకుల ఆత్మలు పరలోకంలో స్థానాన్ని కల్గి ఉన్నాయని, భూమిపైనున్న తమ బంధువులను ఎప్పుడూ గమనిస్తుంటాయని ప్రజలు విశ్వసిస్తారు. పూర్వికులు ప్రకృతిబాహ్యమైన శక్తులను కలిగి ఉన్నారని, మృతులను బంధువులు గౌరవించడం లేక ఉపేక్షించడంపై ఆధారపడి, వాళ్లు ఆ శక్తులను భూమిపైనున్న తమ బంధువులను ఆశీర్వదించి, రక్షించడానికి లేక వాళ్లను శిక్షించడానికి ఉపయోగించగలరని విశ్వసించబడుతోంది.”
కాని అలాంటివి దేవుని వాక్యంతో పొందిక కలిగివున్నాయా? మీ అభిప్రాయం ఏమిటి?
[4వ పేజీలోని చిత్రం]
చిలీలోని ఒక “అనిమిటా”