కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 10/1 పేజీలు 3-4
  • బైబిలు—దాని నిజమైన విలువేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు—దాని నిజమైన విలువేమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రతి లేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరమై ఉన్నది
    మన రాజ్య పరిచర్య—1995
  • బైబిలు—దేవుడు ఇచ్చిన గ్రంథం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • బైబిలు​—⁠దేవుడు ఇచ్చిన పుస్తకం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 10/1 పేజీలు 3-4

బైబిలు—దాని నిజమైన విలువేమిటి?

“బైబిలు అగోచరమైనది, అది అర్థం చేసుకోడానికి వ్రాయబడినది కాదు” అని ఒక గృహస్థుడు అన్నాడు. మరొకరు యిలా అన్నారు: “బైబిలు ప్రాముఖ్యమైన పుస్తకమని నాకు తెలుసు, కాని దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. అది అర్థం చేసుకోడానికి కష్టమైంది.”

ది టోరన్‌టో స్టార్‌ యిలా తెలియజేసింది: “అనేకమంది క్రైస్తవులకు . . . బైబిలు గురించి చాలా తక్కువ తెలుసు.” ఒక కాథోలిక్‌ స్త్రీ యిలా వ్యాఖ్యానించింది: “బైబిలును కలిగివుండడం నాకు మంచిగా అనిపిస్తుంది. అది అంతర్గత శాంతిని తెస్తుంది.” ఒక జాలరి యిలా అన్నాడు: “కల్లోలితమైన, తుపాను చెలరేగుతున్న సముద్రంవంటి జీవితంలో నుండి ఒకడిని సురక్షితమైన స్థలానికి నడిపించే ఒక దిక్సూచి వలె బైబిలు పనిచేస్తుంది.” మునుపు హిందువు అయిన ఒక వ్యక్తి మాటల్లో చెప్పాలంటే, “బైబిలు దేవుని వాక్యము, అది మానవజాతికి ఒక బహుమానము, ఆత్మీయ రుగ్మతలకు వైద్యం వంటిది.”

బైబిలు యొక్క నిజమైన విలువను గూర్చి వివిధమైన అభిప్రాయాలు అనేకం ఉన్నాయి. అయితే, దాని నిజమైన విలువేమిటి?

బైబిలు అత్యంత ప్రాముఖ్యమైన, అతి విస్తృతంగా పంచిపెట్టబడిన పుస్తకము. మానవుడు అనుభవించిన లేక యింకా ఎదుర్కొనబోయే అత్యంత కలవరపెట్టే సమస్యలకు జవాబులు దాని పుటల్లో ఉన్నాయి. దాని ఉపదేశం యొక్క ఆచరణాత్మకత సాటిలేనిది. అది తెలియజేసే నైతిక ప్రమాణాలు అసమానమైనవి. దాని సందేశం శక్తివంతమైనది, ప్రయోజనకరమైనది. అనుపమానమైన విలువగల ఈ పుస్తకం మన బీరువా నుండి బయటికి తీసి శ్రద్ధాసక్తులతో సూక్ష్మ పరిశోధన చేయదగినది.

బైబిలు పూర్తిగా కచ్చితమైనది, నమ్మదగినది, ప్రామాణికమైనది అనే గట్టి నమ్మకంతో మనం దాన్ని తెరువవచ్చును. దానిలో వ్రాయబడివున్న చారిత్రాత్మకమైన సంఘటనలు లౌకిక చరిత్రచే రూఢిపర్చబడ్డాయి. పదేపదే, బైబిలు వాస్తవమైనదని, సత్యమైనదని పురావస్తుశాస్త్ర ఆధారాలు బలపరుస్తున్నాయి. దాదాపు 40 మంది బైబిలు రచయితల నిష్కాపట్యం వారిని నిజాయితీ మరియు యథార్థతగల వారని తెలియజేస్తున్నది. బైబిలు యొక్క అంతర్గత అనుగుణ్యత అది మానవ మూలం నుండి వచ్చింది కాదని సూచిస్తుంది. దానిలో వ్రాయబడిన సంఘటనలు వాస్తవమైనవి. అది మాట్లాడే ప్రజలు వాస్తవమైనవారు. అది సూచించే స్థలాలు, ప్రదేశాలు వాస్తవమైనవి. అంతేగాక, యెహోవా దేవుడు బైబిలు రచయిత అని నిర్వివాదంగా గుర్తించే విశేషమైన ప్రవచనాలు బైబిలు నందున్నాయి.—2 పేతురు 1:21.

మన గొప్ప ఉపదేశకుడు తన చిత్తం మరియు సంకల్పాలను గూర్చిన జ్ఞానం కావాలనుకునేవారికి అది అందుబాటులో ఉండేలా చేశాడు. వాస్తవానికి, మనుష్యులందరు తన వాక్యాన్ని చదివి “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలనేది తన చిత్తమని స్పష్టమైన భాషలో మనకు యెహోవా తెలియజేస్తున్నాడు. (1 తిమోతి 2:3, 4; సామెతలు 1:5, 20-33) మనం మన జీవితాలతో చేయగల అత్యంత ప్రాముఖ్యమైన పనులలో యిది ఒకటి. ఈ సవాలును ఎదుర్కొనవలసిన బాధ్యత మనపై ఉంది. తొలి క్రైస్తవులు దీన్ని అర్థంచేసుకున్నారు. వారిలో ఒకరు యిలా చెప్పడానికి పురికొల్పబడ్డారు: “మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, . . . ప్రార్థించుచున్నాను.”—ఫిలిప్పీయులు 1:9, 10; కొలొస్సయులు 1:9, 10.

బైబిలు మానవ కుటుంబానికి తన చిత్తాన్ని, సంకల్పాన్ని తెలియజేయడానికి సృష్టికర్త యొక్క ప్రముఖ మూలమైయున్నది, ఆ సంకల్పంలో మనం వ్యక్తిగతంగా ఎలా సరిపోతామో యిది వివరిస్తుంది. దానిలో పూర్వం జరిగిన సంఘటనలు వ్రాయబడివున్నాయి, భవిష్యత్తును గూర్చి అది ఒక స్పష్టమైన అవగాహన నిస్తుంది. బైబిలు సరైన సిద్ధాంతాన్ని యిచ్చి, మనం ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయాన్ని మనకు స్పష్టపరుస్తుంది. (అపొస్తలుల కార్యములు 17:11; 2 తిమోతి 3:16, 17) మనిషి జీవించవలసిన ప్రవర్తనకు సంబంధించిన సూత్రాలను అది అందజేస్తుంది, అది మానవులను సఫలత, ఆనందం వైపుకు నడిపిస్తుంది. (మత్తయి, 5 నుండి 7 అధ్యాయాలు) మానవజాతంతటికి దేవుని రాజ్యమే ఏకైక నిరీక్షణ అని అది నొక్కి తెలియజేసి, ఆయన నామాన్ని పరిశుద్ధపర్చి, ఆయన సర్వాధిపత్యాన్ని మహిమపర్చడంలో ఆయన ప్రభుత్వం ఎలా ఒక ఉపకరణంగా ఉందో చూపిస్తుంది. మన జీవదాతయైన యెహోవాతో సన్నిహితమైన, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగివుండడానికి మనం తీసుకోవలసిన చర్యను బైబిలు వివరిస్తుంది.

అంతేగాక, మానవులు ఎన్నడూ పొందనంత అత్యంత గొప్ప బహుమానమైన—పరిపూర్ణ మానవులుగా పరదైసు భూమిపై నిరంతర జీవితాన్ని పొందడానికి నడిపించే పుస్తకంగా బైబిలు అద్వితీయమైనది. (రోమీయులు 6:23) యెహోవా యొక్క అద్వితీయ కుమారుడు మనకిలా చెబుతున్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) నిజంగా, అలాంటి అత్యంత విలువైన పుస్తకం నిత్యజీవమనే బహుమానాన్ని పొందడానికి మనం ఏం చేయాలనేది నేర్చుకోవడానికి మనల్ని పురికొల్పాలి. తరువాతి శీర్షిక చూపునట్లుగా, బైబిలు అర్థం చేసుకోడానికి వ్రాయబడిన పుస్తకము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి