కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/1 పేజీలు 5-7
  • విజ్ఞానశాస్త్రం మతం మరియు సత్యాన్వేషణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విజ్ఞానశాస్త్రం మతం మరియు సత్యాన్వేషణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మతం సృష్టికి చెడ్డ పేరును తెస్తుంది
  • అధికార దుర్వినియోగం
  • నిజమైన మతం యొక్క విజయోత్సాహం
  • పరిణామ సిద్ధాంత ఫలితాలు
    తేజరిల్లు!—1995
  • పరిణామం మరియు మీరు
    తేజరిల్లు!—1995
  • లోకాన్ని కుదిపివేస్తున్న పుస్తకం
    తేజరిల్లు!—1995
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/1 పేజీలు 5-7

విజ్ఞానశాస్త్రం మతం మరియు సత్యాన్వేషణ

“అబద్ధ మతాలనేకం వ్యాప్తిచెందాయన్న వాస్తవం, . . . నాపై కొంత ప్రభావాన్ని కల్గివుంది.”—చార్లెస్‌ డార్విన్‌

పందొమ్మిదవ శతాబ్దం తొలి భాగంలో, విజ్ఞానమూ మతమూ ఓ అనుకూలమైన సంబంధాన్ని అనుభవించాయి. “రచయితలు, వైజ్ఞానిక రచనల్లో సహితం దేవున్ని గూర్చి స్పష్టంగా సహజంగా యథార్థమైన రీతిలో ఏ అరమరికలు లేకుండా రాసేవారు.”

డార్విన్‌ యొక్క ఆరిజిన్‌ ఆఫ్‌ స్పిషీస్‌ దాన్ని మార్చివేయడానికి దోహదపడింది. మతాన్ని, దేవున్ని పూర్తిగా అలక్ష్యం చేసేందుకు విజ్ఞానము, పరిణామము ఓ అనుసంధానంగా తయారయ్యాయి. “పరిణామ సంబంధ ఆలోచనా పద్ధతిలో, అటు దైవిక సృష్టికర్త అవసరంలేదు ఇటు సమంజసం కూడా కాదు,” అని సర్‌ జులియన్‌ చెప్పారు.

నేడు పరిణామ సిద్ధాంతం, విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యమైన పునాదిగా ఉందని చెప్పబడుతోంది. ఈ సంబంధానికి గల ముఖ్య కారణాన్ని భౌతిక శాస్త్రవేత్తయైన ఫ్రెడ్‌ హోలి యిలా గుర్తించాడు: “ఛాందస్స వైజ్ఞానికులు, సత్యంవైపుకు కాకుండా మతపర విపరీత దృక్పథాలకు మరలకుండా నివారించడంలో మరింత శ్రద్ధను కల్గివున్నారు.” ఏ విపరీత దృక్పథాలు, విజ్ఞాన శాస్త్రానికి మతం అంటే అంత అయిష్టత కలుగజేశాయి?

మతం సృష్టికి చెడ్డ పేరును తెస్తుంది

బైబిలును ఘనపర్చాలన్న ప్రయత్నంలో “సృష్టిని గూర్చి వాదించేవారు”—ముఖ్యంగా ఫండమెంటల్‌ ప్రొటెస్టెంట్లతో చేరినవారు, భూమికి విశ్వానికి 10,000 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉందని నొక్కిచెప్పారు. ఈ విపరీత దృక్పథం, భౌగోళిక, ఖగోళ, భౌతిక శాస్త్రవేత్తల పరిహాసాన్ని పొందింది, ఎందుకంటే అది వారు కనుగొన్నదానికి విరుద్ధంగా ఉంది.

అయితే బైబిలు నిజంగా ఏం చెబుతోంది? “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆదికాండము 1:1) దానికి పట్టిన సమయం నిర్దిష్టంగా తెలుపబడలేదు. సృష్టిలోని “మొదటి దినము”ను గూర్చి ఆదికాండము 1:3-5 వచ్చేంత వరకూ ప్రస్తావించబడనేలేదు. “భూమ్యాకాశములు,” మొదటి “దినము” ప్రారంభమైనప్పటికే ఉన్నాయి. కనుక, శాస్త్రజ్ఞులు చెబుతున్నట్లుగా, భూమ్యాకాశాలు లక్షలాది సంవత్సరాల వయస్సును కలిగివున్నాయా? అయ్యుండవచ్చు. దానికి పట్టిన సమయాన్ని బైబిలు నిర్దిష్టంగా యింత అని చెప్పడం లేదు.

మతం యొక్క మరో విపరీత దృక్పథమేంటంటే, ఆరు సృష్టి ‘దినాల’కు కొందరు చెప్పే భావం తీరు. కొందరు ఫండమెంటలిస్టుల, భూ సృష్టిని 144 గంటలకు పరిమితం చేస్తూ ఈ దినాలు అక్షరార్థమైనవని నొక్కి చెబుతారు. ఇది శాస్త్రజ్ఞుల్లో సందేహాన్ని రేకెత్తిస్తుంది, ఎందుకంటే యిది, స్పష్టమైన విజ్ఞాన శాస్త్ర పరిశీలనలకు విరుద్ధంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

అయినప్పటికీ, విజ్ఞాన శాస్త్రంతో అనంగీకారమైనది, ఫండమెంటలిస్టుల బైబిలు వివరణేగానీ—బైబిలు యిచ్చే వివరణ కాదు. ప్రతి సృష్టి “దినం” 24 గంటలు మాత్రమే అని బైబిలు చెప్పడం లేదు; వాస్తవానికి, బైబిలు చెబుతున్న ‘దినము’ల్లో ఉన్నది 24 గంటలు మాత్రమే కాదని చూపుతూ “దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు” ఈ ‘దినము’లన్నీ యిమిడి ఉన్నాయి. (ఆదికాండము 2:4) వీటిలో కొన్ని వేవేలకొలది సంవత్సరాలు ఉండివుండవచ్చు.a

కాబట్టి, సృష్టి అనే ఆలోచనకు, సృష్టి వాదులూ ఫండమెంటలిస్టులూ చెడ్డ పేరును తెచ్చారు. విశ్వం యొక్క వయస్సు, సృష్టి ‘దినము’ల నిడివిని గూర్చిన విషయాల్లో వారి బోధలు అటు సహేతుకమైన విజ్ఞానంతోగానీ యిటు బైబిలుతోగానీ అనుగుణతను కలిగిలేవు. అయినప్పటికీ, వైజ్ఞానికులకు మతం అంటే అప్రీతి కలిగించిన యితర విపరీత దృక్పథాలు ఉన్నాయి.

అధికార దుర్వినియోగం

చరిత్రంతటిలోనూ అధిక అన్యాయానికి మతమే కారణమైంది. ఉదాహరణకు, మధ్య యుగాల్లో ఐరోపా నిరంకుశ పాలనకు చర్చి యిచ్చే మద్దతును సర్దిచెప్పుకోడానికి సృష్టి సిద్ధాంతం, వక్రీకరించబడింది. దానికి ఏ భావం చెప్పారంటే, ధనికుడైనా పేదవాడైనా మానవులు తమ తమ స్థాయిల్లో దైవిక ప్రకటన ప్రకారం ఉంచబడ్డారు. ది ఇంటెలిజెంట్‌ యూనివర్స్‌ యిలా వివరించింది: “ధనికుల చిన్న పిల్లలకు, కుటుంబ ఆస్తిలో కొంతభాగం లేక అసలు ఏమీ దక్కకపోవడం ‘దేవుని ఏర్పాటు’ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ‘దేవుడు అతన్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో’ సంతృప్తి చెందమని కాయకష్టం చేసుకునే వారికి చెప్పబడుతుంది.”

మరి అనేకులు “గతంలోని మత విపరీత దృక్పథానికి” తిరిగి వెళతారనే భయాన్ని కల్గివుండడంలో ఆశ్చర్యం లేదు! మతం, మానవుల ఆత్మీయ అవసరతను తీర్చే బదులు, తరచూ స్వలాభంకొరకు ఉపయోగించబడేది. (యెహెజ్కేలు 34:2) ఇండియా టుడే అనే పత్రికలో ఓ సంపాదకీయం యిలా వ్యాఖ్యానించింది: “యుగయుగాలుగా అది పొందిన పేరునుబట్టి చూస్తే, మతం ఎలాంటి విశ్వాసాన్నైన యింకా పొందుతుండడం ఆశ్చర్యజనకం. . . . సర్వోన్నతుడైన సృష్టికర్త పేరట, . . . మానవులు తమ తోటి మానవుల యెడల అతి దుష్టమైన దుర్మార్గాన్ని జరిగించారు.”

డార్విన్‌ ఆలోచనలపై భయంకరమైన చరిత్రగల అబద్ధ మత ప్రభావం తగినంత ఉంది. “క్రైస్తవ మతమనేది దైవిక ప్రకటన అనే నమ్మకాన్ని నేను క్రమేపీ కోల్పోయాను” అని ఆయన రాశాడు. “మహాగ్నిలా అనేక అబద్ధ మతాలు ప్రబలిపోయాయన్న వాస్తవం, నన్ను కొంత ప్రభావితం చేసింది.”

నిజమైన మతం యొక్క విజయోత్సాహం

మత వేషధారణ ఈ లోకానికి కొత్తేమీ కాదు. తన రోజుల్లో ఉన్న అధికారాసక్తి గల మత నాయకులతో యేసు యిలా అన్నాడు: “మీరు బయటకు మంచి మనుష్యుల్లా కనిపిస్తారు—అయితే లోపలంతా వేషధారణ, దుష్టత్వంతో నిండిన వారిగా ఉన్నారు.”—మత్తయి 23:28, ఫిలిప్స్‌.

అయినప్పటికీ, యథార్థమైన క్రైస్తవత్వం, ‘లోకంతో సంబంధము లేనిది.’ (యోహాను 17:16) దాన్ని అనుసరించేవారు నీచమైన మతంలో, రాజకీయంలో భాగం వహించరు; లేక సృష్టికర్త లేడనే తత్వాల వల్ల వారు తప్పుదోవ పట్టరు. “ఈ లోకజ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే” అని అపొస్తలుడైన పౌలు రాశాడు.—1 కొరింథీయులు 3:19.

అయినా, దాని భావం నిజమైన క్రైస్తవులు విజ్ఞానపరంగా అజ్ఞానులని కాదు. దీనికి భిన్నంగా, నిజమైన మతాన్ని అనుసరించేవారికి విజ్ఞానంలో ఆసక్తి ఉంటుంది. “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను?” అని ప్రాచీన కాలపు యెషయా ప్రవక్తకు చెప్పబడింది. (యెషయా 40:26) అదే విధంగా, యోబు, సృష్టికర్తను బాగా తెలుసుకోడానికిగాను, ప్రకృతి, విశ్వంలోని అద్భుత విషయాలను పరిశీలించడానికి ఆహ్వానించబడ్డాడు.—యోబు 38-41 అధ్యాయాలు.

అవును, సృష్టికర్తను నమ్మేవారు సృష్టిని గౌరవప్రదమైన భయాభిమానాలతో దృష్టిస్తారు. (కీర్తన 139:14) అంతేకాకుండ, వారు భవిష్యత్తును గూర్చిన అద్భుతమైన నిరీక్షణ విషయంలో సృష్టికర్తయైన యెహోవా దేవుడు చెప్పేవాటిని నమ్ముతారు. (ప్రకటన 21:1-4) బైబిలు పఠనం ద్వారా లక్షలాది మంది ప్రజలు, మనిషి ఉద్భవము గానీ వాని భవిష్యత్తు గానీ ఏదో నియంత్రణలేని ఆకస్మిక పరిణామంపై ఆధారపడదని నేర్చుకుంటున్నారు. బదులుగా, మనిషిని సృష్టించడంలో యెహోవాకు ఓ సంకల్పం ఉంది, మరి విధేయులైన మానవజాతియంతటి ఆశీర్వాదానికై ఆ సంకల్పం నెరవేరుతుంది. ఈ విషయాన్ని మీకై మీరే పరిశీలించేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

[అధస్సూచీలు]

a అవేక్‌! నవంబరు 8, 1982 6-9 పేజీలు, వాచ్‌టవర్‌ సొసైటి వారు ప్రచురించిన ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌ సంపుటి 1, 545 పేజీ చూడండి. సృష్టి వాదాన్ని, విజ్ఞాన శాస్త్రంతో బైబిలుతో విభేదాలను గూర్చి అధికంగా తెలుసుకోడానికి అవేక్‌! మార్చి 8, 1983వ సంచిక 12-15 పేజీలు, మార్చి 22, 1983వ సంచిక 12-15 పేజీలు చూడండి.

[6వ పేజీలోని బాక్సు]

రుజువులు తెలియనివారా?

“యెహోవాసాక్షులు కూడా జీవశాస్త్రాన్ని బాగానే నేర్చుకున్నారు,” అని 1971లో వెలువడిన డార్విన్‌ రిడ్‌—ఏన్‌ అప్పీల్‌ టు రీజన్‌ అనే పుస్తకంలో లాయరు నార్మన్‌ మాక్‌బెత్‌ రాశారు. పరిణామ విషయంపై అవేక్‌! పత్రికను చదివిన తర్వాత మాక్‌బెత్‌ యిలా పేర్కొన్నారు: “డార్విన్‌ సిద్ధాంతాలపై అంత జ్ఞానయుక్త వ్యాఖ్యానాలు అందులో ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను.” ఆ అంశంపై జరిపిన విస్తృతమైన పరిశోధన వివేకవంతమైన అధికారిక వాక్యాలను గమనించి ఆ రచయిత యీ నిర్ధారణకొచ్చారు: “‘. . . దాన్ని [పరిణామాన్ని] నమ్మని ఏ వ్యక్తి అయినా వైజ్ఞానిక రుజువులు స్పష్టంగా తెలియనివాడే’ అని సింప్సన్‌ అనడం యిక ఎంత మాత్రమూ సరికాదు.”

[7వ పేజీలోని చిత్రం]

మానవజాతి భవిష్యత్తు నియంత్రణలేని ఆకస్మిక సంభవానికి విడిచిపెట్టబడలేదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి