కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 8/15 పేజీ 32
  • ప్రత్యేక భావంగల వ్రాతలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రత్యేక భావంగల వ్రాతలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 8/15 పేజీ 32

ప్రత్యేక భావంగల వ్రాతలు

“యెహోవా సె టిబె క్యూస్‌టోస్‌”

తూర్పు స్విట్జర్లాండ్‌ నందలి కెలరినాలోని 17వ శతాబ్దపు యింటి ముందు గోడపై రాయబడివున్న ఈ మాటల భావం, “యెహోవా నీ రక్షకుడు” అని. ఈ పర్వత ప్రాంతంలో, శతాబ్దాల పూర్వపు ఇళ్లూ చర్చీలు, ప్రీస్టుల ఇళ్లపై దేవుని పేరు చెక్కబడి లేక పెయింట్‌తో రాయబడి ఉండడం అసాధారణం కాదు. యెహోవా అనే పేరు ఎలా అంత ప్రఖ్యాతి గాంచింది?

సా.శ.పూ. 15లో పురాతన రిహాటియా (ఆగ్నేయ జర్మనీ, ఆస్ట్రేలియా, ఉత్తర స్విట్జర్లాండ్‌ భాగాలన్ని కలిసినది) రోమా ఆధిపత్యం క్రింద ఉన్న ప్రాంతంగా తయారైంది. అక్కడి నివాసులు లాటిన్‌పై ఆధారపడిన రొమాన్ల్‌ భాషను మాట్లాడేవారు. అనేక మాండలికాలుగా తయారైన ఆ భాష, స్విట్జర్లాండ్‌ మరియు ఉత్తర ఇటలీలకు చెందిన ఆల్‌పైన్‌ లోయల్లో యింకా ఉపయోగంలో ఉంది.

కాలక్రమంలో, బైబిలులో కొన్ని భాగాలు రొమాన్ల్‌ భాషలోకి అనువదించబడ్డాయి. బిబ్లియా పిట్స్‌నా అని పిలువబడే ఓ సంచికలో కీర్తన, క్రైస్తవ గ్రీకు లేఖనాలు ఉన్నాయి. పదహారువందల అరవై ఆరులో ప్రచురించబడిన ఈ బైబిలు నందు, కీర్తనలన్నింటిలో యెహోవా అనే పేరు అనేక మార్లు కనిపించింది. ఇళ్లలో చదవబడేది ప్రాముఖ్యంగా బైబిలే గనుక, బిబ్లియా పిట్స్‌నా పాఠకులు సృష్టికర్త పేరును బాగా తెలుసుకున్నారు.

అయితే, తర్వాతి తరాలవారు బైబిలు విషయాలపై ఆసక్తిని కోల్పోయారు. అనేకులు, “యెహోవా” అనే పదం అంటే ఏమిటో తెలుసుకోవడానికి శ్రద్ధ చూపలేదు, యిక మతనాయకులు కూడా దాన్ని వివరించే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. కనుక ఈ వ్రాతలు, గడిచిన శతాబ్దపు అలంకార విషయాలుగా మాత్రమే మిగిలిపోయాయి.

ఇటీవలి దశాబ్దాల్లో గణనీయమైన గొప్ప మార్పులతో కూడిన విద్యాబోధనా పని జరుగుతోంది. స్విట్జర్లాండ్‌ లోతట్టు ప్రదేశాల నుండి యెహోవాసాక్షులు వచ్చి, ఈ అందమైన లోయల్లో తమ సెలవులను గడిపి, అక్కడి నివాసులకు యెహోవా అనే పేరుగల దేవున్ని గూర్చి నేర్పించే ప్రత్యేక ప్రయత్నాన్ని చేశారు. భూమి యెడల, మానవుని యెడల సృష్టికర్త యొక్క అద్భుతమైన సంకల్పాలను గూర్చి ప్రజలకు చెప్పడంలో ఎక్కువ సమయం గడిపేందుకు కొందరు సాక్షులు అక్కడే నివసించారు. కనుక, ఈ ప్రజలు నిజమైన దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొంటుండగా ఈ ప్రాచీన రొమాన్ల్‌ వ్రాతలు తమకు మరింత ప్రాముఖ్యమౌతున్నాయి.

[32వ పేజీలోని చిత్రాలు]

యెహోవా పొర్‌ట్యో మెయా: యెహోవా నీవే నా భాగము—కీర్తన 119:57 చూడండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి