జన్మదిన వేడుకలు మరణకరమైన పరిణామాన్ని మిగిల్చాయి
నేడు అనేకమంది ప్రజలు, జన్మదిన వేడుకలను హానికరముకాని ఆచారంగా దృష్టిస్తారు. కాని బైబిలు ఈ సాంప్రదాయాన్ని ఆచరింపదగినదానిగా చిత్రీకరించలేదు. ఒక విషయం ఏమిటంటే, దేవుని నమ్మకమైన సేవకులెవ్వరు కూడా జన్మదినాలను జరుపుకొన్నట్లుగా లేఖనాల్లో ఏ రుజువూ లేదు.
దేవుని శత్రు పాలకులను గూర్చిన రెండు జన్మదినాలను మాత్రము బైబిలు ప్రస్తావించింది. ప్రతివేడుకలో మరణశిక్ష ఇమిడి ఉంది, అది రాజును ప్రీతిపర్చని వాని మరణమైవుండి, అతిధులను తృప్తిపర్చింది. మొదటి సందర్భంలో, ఐగుప్తు రాజైన ఫరో, భక్షకారుల అధిపతిని ఉరితీయించాడు. (ఆదికాండము 40:2, 3, 20, 22) తన సేవకునిపై ఆగ్రహించినందున విందు సమయంలో ఐగుప్తు పాలకుడు అలా చేశాడు. రెండవ సందర్భంలో, గలిలయకు అవినీతి పరిపాలకుడైన హేరొదు, వేడుకలో నాట్యంచేసి తనను ప్రీతిపర్చిన యౌవనురాలికి కానుకగా బాప్తిస్మమిచ్చు యోహాను తల నరికించాడు. ఎంతటి జుగుప్సాకరమైన దృశ్యాలు!—మత్తయి 14:6-11.
అయినప్పటికిని బైబిలు ఎంతో అసాధారణమైన ఈ రెండు జన్మదినాలను గూర్చి చెప్పలేదా? కానేకాదు. పురాతన యూదా చరిత్రకారుడైన జోసిఫస్ ఈ సంఘటనలు అసమానమైనవి కావు అని తెలియజేస్తున్నాడు. జన్మదిన సమయాల్లో వినోదం కొరకు వధించే ఆచారానికి సంబంధించిన ఇతర సందర్భాలను ఆయన నమోదు చేశాడు.
ఉదాహరణకు, సా.శ. 70లో యోరూషలేము నాశనమైన తరువాత, అంటే 10,00,000 మంది యూదులు మరణించగా, తప్పించబడిన 97,000 మంది బంధీలుగా కొనిపోయిన తర్వాత యిలాంటి సంఘటనలు కొన్ని సంభవించాయి. రోముకు వెళ్లేదారిలో, రోమా సైన్యాధిపతియైన టైటస్ సమీపంలో ఉన్న కైసరియా ఓడరేవుకు యూదా బంధీలను తీసుకొనివెళ్లాడు.
జోసిఫస్ ఇంకా వ్రాస్తూ: “టైటస్ కైసరియాలో ఉన్నప్పుడే, ఆయన తన సహోదరుడైన డొమిషియన్ జన్మదినాన్ని గొప్ప వైభవంతో జరుపుకుంటూ, మృగాలు, మంటలతో కూడిన ఆటల్లో 2,500 మందికిపైగా ఖైదీలను మరణానికి అప్పగించాడు. ఆ తరువాత తన తండ్రి జన్మదిన వేడుకలో జరిగిన బారీ ప్రదర్శన యందు అనేక మంది ఖైదీలను చంపిన ఫోనీపియా నందలి బీరిటస్ [బేరూట్] అనే రోమా వలస ప్రాంతానికి ఆయన వెళ్లాడు.—పాల్ ఎల్. మేయర్ తర్జుమా చేసిన ది జూయిష్ వార్, VII, 37,లో జోసిఫస్: ది ఎసెన్షియల్ రైటింగ్స్.
ది ఇంపీరియల్ బైబిల్-డిక్షనరీ, “ఆ తరువాతి కాలంలో ఉన్న హెబ్రీయులు జన్మదిన వేడుకలనేవి విగ్రహారాధనలో ఒక భాగంగా దృష్టించారు. వారు గమనించిన సాధారణ ఆచారాలు నేటి కాలంతో సంబంధం కల్గివున్న దృష్ట్యా మరింత రూఢీపర్చబడింది,” అని వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యపడనక్కరలేదు.
బైబిలునందు ప్రతికూలంగా చిత్రీకరించిన ఆచారంలో, అంతేకాక రోమన్లు అంత అసహ్యంగా జరుపుకునే వాటిల్లో భాగం వహించాలని భావించి మొదటి శతాబ్దంలోని నమ్మకమైన క్రైస్తవులు ఉండరు. నేడు కూడా జన్మదినాలను గూర్చి బైబిలునందు వ్రాయబడిన వృత్తాంతాలు తమ ఉపదేశము కొరకేనని యథార్థవంతులైన క్రైస్తవులు గుర్తిస్తారు. (రోమీయులు 15:4) ఇటువంటి ఆచరణలు ఒక వ్యక్తికి అయుక్తమైన ప్రాముఖ్యతను యిస్తున్నందున జన్మదిన వేడుకలను వారు జరుపుకోరు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా బైబిలునందు జన్మదినాలను గూర్చి ఇవ్వబడిన ప్రతికూల ప్రస్తావనలను యెహోవా సేవకులు జ్ఞానయుక్తముగా పరిగణలోకి తీసుకుంటారు.
[25వ పేజీలోని చిత్రం]
సిసీరియా వద్దనున్న రంగము