అబ్రాహాము—యిక్కడ సమాధి చేయబడ్డాడు, అయినా జీవించేవున్నాడా?
సంవత్సరాలుగా, యూదులూ ముస్లిమ్లూ క్రైస్తవులూ ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు.
మీరు యెరూషలేముకు దక్షిణాన ప్రాచీన పట్టణమైన హెబ్రోనులో దాన్ని సందర్శించగలరు. ఈ కట్టడం, హారెమ్ ఎల్ కాలెల్ అని, పూర్వీకుల సమాధి అని రెండు పేర్లతో పిలువబడుతోంది. అవును, యిది ప్రాచీన వ్యక్తులైన అబ్రాహాము, ఇస్సాకూ, యాకోబు, అలాగే వారివారి భార్యలైన శారా, రిబ్కా, లేయాల సమాధి స్థలమని విశ్వవ్యాప్తంగా అంగీకరించబడుతోంది.
తన ప్రియమైన భార్యయైన శారా మరణించినప్పుడు అబ్రాహాము ఓ గుహను హెబ్రోన్ వద్ద మచాపిలాలో కొంత భూమిని కొన్నాడన్న విషయాన్ని బైబిలు నుండి మీరు జ్ఞాపకం చేసుకోండి. (ఆదికాండము 23:2-20) తర్వాత, అబ్రాహాము కూడా యిక్కడే సమాధి చేయబడ్డాడు, అలాగే కుటుంబ సభ్యుల్లో యితరులు కూడా అంతే. శతాబ్దాల తర్వాత, పారంపర్య సమాధి స్థలం చుట్టూ హేరోద్ ది గ్రేట్ ఓ అందమైన భవనాన్ని నిర్మించాడు, కాలం గడిచే కొలది విజేతలైనవారు తమ తమ మత నమ్మకాల ఆధారంగా దాన్ని మార్చి విస్తరింపజేసుకున్నారు.
దానిలోకి ప్రవేశించినప్పుడు, మీకు ఆరు గోరీలు కనబడతాయి. (జ్ఞాపకార్థ కట్టడాలు లేక ఖాళీ సమాధులు) అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కొరకు అని నివిష్టం కనపరుస్తుంది. దాని దగ్గర గచ్చులోకి కొన్ని రంధ్రాలున్నాయి, అవి కింద ఉన్నవాటికి మెట్లుగా ఉపయోగించబడతాయి. అనేక పురాతన ఎముకలను కల్గివుండిన గదులను పరిశోధకులు కనుగొన్నారు.
అబ్రాహాము విషయమేమిటి? ఈ నిర్మాణం క్రింద ఉన్న గుహలో ఆయన సమాధి చేయబడి ఉన్నట్లయితే ఆయన ఎప్పుడో చనిపోయి ఉండాలి, అవునంటారా? దీన్ని అనేక సందర్శకులు ఒప్పుకుంటారు. అయినప్పటికీ అబ్రాహాముకంటే ఒక గొప్ప ప్రవక్త ఒక భావంలో అబ్రాహాము యింకా జీవిస్తున్నాడని చెప్పాడు? అది ఏ భావంలో? మరి మీ విశ్వాసంపై యిది ఎలాంటి ప్రభావాన్ని కల్గివుంటుంది?
“మరణించిన మీ ప్రియమైనవారు—వారెక్కడున్నారు?” అనే శీర్షికను దయచేసి చదవండి. (3వ పేజీ) అబ్రాహాము జీవించి ఉన్నాడన్న విషయాన్ని గూర్చి ఒక గొప్ప ప్రవక్త అన్నవాటిని అది వివరిస్తుంది, ఆ సమాచారం మీకూ మీ కుటుంబానికీ ఎంతో విలువ గలది కావచ్చును.