“దైవ భయము” జిల్లా సమావేశానికి హాజరు కండి!
యెహోవాసాక్షుల 1994 “దైవ భయము” జిల్లా సమావేశానికి హాజరు కావడానికి మీరు అప్పుడే పథకం వేసుకున్నారా? మూడు రోజులూ హాజరు కావడం వల్ల మీరు తప్పకుండా ప్రయోజనం పొందుతారు! కేవలం భారతదేశంలోనే 16 సమావేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయి, కాబట్టి మీరు నివసించే స్థలానికి సమీపంలో ఒక సమావేశం జరుగవచ్చు.
అయితే ఒక విధమైన భయం మీ ధైర్యాన్ని తగ్గించి, మీ నిరీక్షణను పాడుచేయగలదు, శుక్రవారం ఉదయపు ముఖ్యాంశ ప్రసంగం దైవ భయాన్ని నిర్వచించి, దాని అనేక ప్రయోజనాలను వివరిస్తుంది. వాస్తవానికి, సమావేశ కార్యక్రమమంతా ఈ ప్రయోజనాలను ఉన్నతపరుస్తుంది.
దైవ భయం వివాహ మరియు కుటుంబ జీవితాన్ని ఎలా బలపర్చగలదో, అలాగే యౌవనులు తాము దేవునికి చూపే యథార్థతలో నిలకడగా ఉండడానికి అది వారికి ఎలా సహాయం చేయగలదో శుక్రవారం మధ్యాహ్నం మీరు వింటారు. “దుఃఖపడువారికి ఓదార్పు” అనే హృదయాన్ని ఉత్తేజపర్చే ప్రసంగంతో మధ్యాహ్న కార్యక్రమం ముగుస్తుంది. తమ ప్రియమైన వారిని మరణమందు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి ఆ ప్రసంగంలో ఇవ్వబడే ఆచరణాత్మక సమాచారాన్ని మీరు మెచ్చుకుంటారు.
సంఘము, మన పరిచర్య వంటి విషయాల్లో మనం యెహోవా నడిపింపును హత్తుకొని ఉండడాన్ని దైవ భయం ఎలా బలపర్చగలదో శనివారపు కార్యక్రమం చూపిస్తుంది. “దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును ప్రతిదినం చదవండి” అనే ప్రసంగంలో, బైబిలు చదవడం, పఠించడం కొరకు ఆచరణాత్మక సూచనలను హాజరైనవారు పొందుతారు. “భీతిగొల్పే యెహోవా దినం సమీపంలో ఉంది” అనే ఆసక్తిని రేకెత్తించే మూలాంశం గల ప్రసంగంతో శనివారపు కార్యక్రమం ముగుస్తుంది.
“నీతిమంతుల పునరుత్థానం ఉంటుంది” అనే ప్రసంగం ఆదివారపు కార్యక్రమంలో ఒక భాగము. తర్వాత ఉండే, “మహా శ్రమల నుండి సజీవంగా రక్షించబడుట” అనే ప్రసంగంలో, అసలు ఎన్నటికీ చనిపోని వారిని గూర్చి యేసు చేసిన అద్భుతమైన వాగ్దానం యొక్క వివరణ అందజేయబడుతుంది.—యోహాను 11:26.
మీరు ఎదుర్కొనే ఎంపికలు అనే పేరుగల, ఆలోచన రేకెత్తించే 40 నిమిషాల నాటకంతో ఆదివారపు ఉదయం కార్యక్రమం ముగుస్తుంది. ప్రేక్షకులు యెహోషువ కాలంనాటికి తీసుకువెళ్లబడతారు, యెహోవాను సేవించాలనే అతని గట్టి నిర్ణయాన్ని అందులో చూస్తారు. ఏలియా కాలంనాటి అగ్ని పరీక్షను కూడా వారు చూస్తారు, హాజరైనవారు నేడు దైవ భయాన్ని చూపించడానికి వారికి సహాయం చేసే పాఠాలను ఈ రెండు సంఘటనల నుండి పొందవచ్చు. “సత్య దేవునికి ఇప్పుడు ఎందుకు భయపడాలి” అనే బహిరంగ ప్రసంగం మధ్యాహ్నం జరిగే సమావేశ కార్యక్రమ ప్రధానాంశంగా ఉంటుంది.
హాజరు కావడానికి ఇప్పుడే పథకం వేసుకోండి. మీ ఇంటికి సమీపంలో జరిగే సమావేశ స్థలం కొరకు, యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరాన్ని సంప్రదించండి లేక ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
T. Rosenthal/SUPERSTOCK