కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/1 పేజీ 32
  • పది సంవత్సరాలుగా ఏకకాలంలో!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పది సంవత్సరాలుగా ఏకకాలంలో!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/1 పేజీ 32

పది సంవత్సరాలుగా ఏకకాలంలో!

ది వాచ్‌టవర్‌ యొక్క స్పానిష్‌ సంచిక ఆంగ్ల పత్రికతోపాటు ఏకకాలంలో ప్రచురింపబడడం ప్రారంభమైనప్పుడు పదేళ్ల క్రితం ఆమె ఎలా భావించిందని అడిగినప్పుడు, ఒక ప్రియమైన స్పానిష్‌ సహోదరి ఇలా ప్రత్యుత్తరమిచ్చింది: ‘మేము అది ఒక ఆశీర్వాదమని భావిస్తాము, ఎందుకంటే మేమిప్పుడు అదే, మీరనేటట్టు ఆంగ్లంతో సమానంగా కలిసి నడుస్తున్నాము. ఆంగ్లం అని నేనన్నప్పుడు, నేను ఎప్పుడు సంస్థ గురించి అనుకుంటాను. సంస్థను మేమెప్పుడు “అమ్మ” అని వ్యవహరిస్తాము. మేము చాలా సన్నిహితంగా, దగ్గరగా భావిస్తాము. అది అందంగా ఉంటుంది. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది!’

అనేకమంది ఆంగ్లేతర పాఠకుల భావాలను ఈ విశ్వాసం గల సహోదరి తెలియజేసింది. గత సంవత్సరాలలో, శీర్షికలు ఆంగ్లంలో ప్రచురింపబడిన దాదాపు ఆరు నెలల తరువాత ది వాచ్‌టవర్‌ యొక్క స్పానిష్‌ సంచికలో ప్రచురింపబడేవి. ఇతర భాషలు కూడా అలాంటి ఆలస్యాన్నే ఎదుర్కోవలసి వచ్చేది. కాబట్టి ఒకే సమాచారాన్ని, ఒకే సమయంలో, అనేక భాషలలో ప్రచురించాలనే గాఢమైన కోరిక ఉండినది.

కాబట్టి ఏప్రిల్‌ 1, 1984 సంచిక మొదలుకొని, ఆంగ్ల సంచికతో ఏకకాలంలో వెలువడటంలో స్పానిష్‌ సంచిక మొదటిది. త్వరలోనే ఇతర భాషలు కూడా అలాగే చేశాయి. మరి 1985 ఆరంభానికి, 23 భాషలలో సంచికలు ఏకకాలంలో ప్రచురించడం ప్రారంభమైంది. అనువాదకులను కనుగొని, తర్ఫీదిచ్చినప్పుడు, ఆంగ్లంతోపాటు మరిన్ని భాషల సంచికలు మొదలయ్యాయి.

కావలికోట యొక్క ఈ సంచిక, ఏకకాలంలో ప్రచురింపబడుతున్న దాని పదియవ సంవత్సరంగా గుర్తించబడింది. కావలికోట ఇప్పుడు 116 భాషలలో ప్రచురింపబడుతున్నది, వాటిలో 85 భాషలు ఏకకాలంలో ప్రచురింపబడుతున్నాయి. అంటే కావలికోట యొక్క మొత్తం సగటు ఉత్పత్తి 1,61,00,000లో 99.3 శాతం ఒకే కవరు డిజైను, ఒకే శీర్షికలతో వెలువడుతున్నాయి. వారపు కావలికోట పఠనానికి హాజరౌతున్నవారిలో, 95 శాతం కంటే ఎక్కువమంది ఒకే సమయంలో ఒకే శీర్షికను పరిశీలిస్తారు.

కావలికోట యొక్క సహపత్రికయైన తేజరిల్లు! దాని 74 భాషల్లోని 37 భాషల్లో ఏకకాలంలో ప్రచురింపబడుతుంది. వార్షిక పుస్తకమగు ఇయర్‌ బుక్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్నెసస్‌ 18 భాషల్లో ప్రచురింపబడుతుంది. దేవుని ప్రజలు “యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను” ఐక్యమగుటకు అలాంటి ఏకకాలంలో వెలువడే ప్రచురణలు దోహదపడతాయి.—1 కొరింథీయులు 1:10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి