జ్ఞాపకముంచుకోవల్సిన రాత్రి
ఓ స్మరణీయ రోజున 3,500 సంవత్సరాల కంటే పూర్వం ఐగుప్తునందు చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల చేత యెహోవా గొర్రెపిల్లను చంపించి దాని రక్తాన్ని తమ ద్వారబంధపు పైకమ్మిపై, నిలువు కమ్మలపై చిలకరింపజేయించాడు. ఆ రోజు రాత్రే దేవుని దూత ఈ గుర్తులున్న యిళ్ల మీదుగా వెళ్లాడు గానీ ఐగుప్తుయుల ఇళ్లలోని మొదటి కుమారులను చంపాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు. అప్పటినుండి, ప్రతి సంవత్సరమూ ఆ సంఘటన జరిగిన నాడు యూదులు పస్కాను ఆచరించేవారు.
యేసుక్రీస్తు తన అపొస్తలులతో పస్కా పండుగను ఆచరించిన వెంటనే, తన బలి మరణాన్ని జ్ఞాపకం చేసే ఓ భోజనాన్ని ఏర్పాటు చేశాడు. కొన్ని పులియని రొట్టెలను తన నమ్మకమైన అపొస్తలులకు అందించి యిలా అన్నాడు: “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము.” పిమ్మట, ఆయన ఒక గిన్నెలో ద్రాక్షారసాన్ని అందించి యిలా అన్నాడు: “ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” యేసు యింకా యిలా అన్నాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి.” (మత్తయి 26:26-28; లూకా 22:19, 20) కాబట్టి యేసు తన అనుచరులను తన మరణదిన ఆచరణను చేయమని ఆజ్ఞాపించాడు.
యేసు మరణ జ్ఞాపకార్థ దినాన్ని మీరు తమతో కలిసి ఆచరించడానికి యెహోవాసాక్షులు మిమ్మల్ని ఎంతో ఆప్యాయతతో ఆహ్వానిస్తున్నారు. మీ యింటికి దగ్గరలోనున్న రాజ్యమందిరంలో మీరు హాజరుకావచ్చు. సమయాన్ని స్థలాన్ని కచ్చితంగా తెలుసుకోవడానికి మీ ప్రాంతంలోని సాక్షులను సంప్రదించండి. ఈ ఆచరణ 1994లో మార్చి 26, శనివారం జరుగుతుంది, రొట్టెద్రాక్షారసం సూర్యాస్తమయం తర్వాతే అందించబడతాయి.