“వెక్కిరించే ముందు మనం ఎక్కువ చదువుదాము”
మీరు చదువుతున్న పత్రికయైన కావలికోట గురించి న్యూజీలాండ్ నుండి ఒక వ్యక్తి అలా అన్నాడు. యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో వివరించబడిన దేవుని మహిమాన్విత రథాన్ని గూర్చిన శీర్షికను గురించి, ఆ వ్యక్తి ఇలా వ్రాశాడు:
“ఈ నాలుగు జీవులు, లేక కెరూబులలో ప్రతి దానికి, నాలుగు రెక్కలు, నాలుగు ముఖాలు ఉన్నాయి. వారికి యెహోవా న్యాయాన్ని సూచించే సింహం ముఖము; దేవుని శక్తిని సూచించే ఎద్దు ముఖము; ఆయన జ్ఞానాన్ని సూచించే పక్షిరాజు ముఖము; యెహోవా ప్రేమను సూచించే మానవ ముఖము ఉన్నాయి.
“దీన్ని మళ్లీ, మళ్లీ చదివిన తరువాత, నా హృదయంలో ప్రేమపూర్వక భావం కలిగింది. నాకు ఆనంద బాష్పాలు రాలాయి. నేను వెంటనే ఇలా తలంచాను, ‘యెహోవా, నీవు ఎంత అందంగా, మనోహరంగా ఉండవచ్చు!’ నేను లోక సంబంధిగా వున్నప్పుడు ఎన్నో సంవత్సరాల వరకు ఎంతో వెక్కిరించిన ఈ యెహోవా దేవుని యెడల నాకు కలుగుతున్న ఈ క్రొత్త భావనలకు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. నేను యెహోవాసాక్షులకు ‘కృతజ్ఞతలు’ తెలియజేస్తున్నాను, నాలాంటి అనేకులకు నేనిలా చెబుతాను: ‘వెక్కిరించే ముందు మనం ఎక్కువ చదువుదాము.’”