కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/1 పేజీ 31
  • “దేవుడు పక్షపాతి కాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుడు పక్షపాతి కాడు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • గాఢంగా ప్రేమింపబడే భార్య
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి
    అనుభవాలు
  • ప్రేమ కుటుంబములను ఐక్యపరచును
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/1 పేజీ 31

రాజ్య ప్రచారకుల నివేదిక

“దేవుడు పక్షపాతి కాడు”

పందొమ్మిది వందల సంవత్సరాల క్రితం, ప్రేరేపించబడిన అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “దేవుడు పక్షపాతి కాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువారిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) యెహోవాసాక్షులలో అన్ని జాతి, మతాల నుండి వచ్చిన ప్రజలను కనుగొనవచ్చు. వారు నీతిని కోరుకుంటారు, దేవునికి భయపడతారు. యెహోవా వారినందరిని నూతన లోక సమాజంలోకి ఆహ్వానిస్తున్నాడు, ఉదాహరణకు చాద్‌లోవున్న ఒక స్త్రీని కూడా ఆయన అలాగే ఆహ్వానించాడు.

ఈ స్త్రీ తన మతంతో సంతృప్తి చెందలేదు. యెహోవాసాక్షులచే ప్రచురించబడిన యువర్‌ యూత్‌—గెటింగ్‌ ది బెస్ట్‌ అవుట్‌ ఆఫ్‌ ఇట్‌, అనే పుస్తకాన్ని అనేక సంవత్సరాల క్రితం ఆమె తీసుకుంది, ఆ పుస్తకంలో ఉన్న చక్కని సలహాను ఆమె మెచ్చుకుంది. బైబిలు పఠనం ప్రారంభమైంది, ఆమె ఎప్పుడూ పఠనానికి సిద్ధంగా ఉండేది. అయితే, రాజ్య మందిరంలో కూటాలకు హాజరుకమ్మని ఆహ్వానించినప్పుడు మాత్రం ఆమె ప్రతిస్పందించలేదు. ఎందుకు? పఠనం చేయటాన్ని ఆమె భర్త వ్యతిరేకించలేదు గాని, రాజ్య మందిరంలో కూటాలకు వెళ్లటానికి మాత్రం ఆయన అనుమతివ్వలేదు.

భార్య ప్రాంతీయ సమావేశానికి రావాలని ఇష్టపడినప్పుడు, పఠనం చేస్తున్న సాక్షి ఆమె భర్తకు అక్కడ ఇవ్వబోయే సలహాను ఉన్నతపర్చే కార్యక్రమాన్ని చూపించింది. “కేవలం ఒక్కసారి” మాత్రం వెళ్లటానికి అతడు భార్యను అనుమతించాడు. ఆమె దానికి హాజరై ఆ కార్యక్రమాన్ని ఎంతగానో ఆనందించింది. ఆమె తాను ఏం నేర్చుకుందో భర్తకు వివరించిన తరువాత, ఇతర కూటాలకు హాజరవ్వటాన్ని అతడు వ్యతిరేకించలేదు. ఒకరి యెడల ఒకరికి ఉన్న గాఢమైన శ్రద్ధగల వేరువేరు జాతుల నుండి వచ్చిన ప్రజలతో సంఘం చేరివుందన్న వాస్తవం ఆమెను బాగా ప్రభావితం చేసింది. తరువాత ఆమె జిల్లా సమావేశానికి హాజరై, తన పిల్లలు ఇతర దేశాల నుండి వచ్చిన సాక్షుల ఒడిలో కూర్చోవటం చూసి ఆమె ఎంతో సంభ్రపడింది. సాక్షులు పిల్లలతో ఆహారాన్ని పంచుకుని తమ కుటుంబంలా చూసుకున్నారు. ఇది ఆమెకు ఓ పెద్ద మలుపు.

కాని వ్యతిరేకత మొదలైంది. సహజంగా పిరికిదైనప్పటికీ, కూటాల్లో వ్యాఖ్యానించడం, బంధువులు, పొరుగువారి నుండి వచ్చే ప్రతికూల వ్యాఖ్యలను తట్టుకుని నిలబడటం ప్రారంభించింది. ఆమె తన భర్తతో చాలా సంవత్సరాలు కలిసి జీవించినప్పటికీ, వారిది కేవలం సాంప్రదాయబద్ధంగా ఏకీభవించబడిన వివాహం మాత్రమే. చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలనే విషయాన్ని ఆమె ఎలా మొదలుపెట్టనైయుంది? హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థించిన తరువాత, ఆమె తన భర్తతో మాట్లాడింది, ఆయన దాని సాధ్యతను పరిశీలిస్తాను అన్నాడు. చివరికి, ఆయన అలాగే చేశాడు, ఆ జంట చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు.

వారితోపాటు నివసిస్తున్న వదిన అనేక సమస్యలు వచ్చేలా చేసింది, కాని భర్త భార్యకు అనుకూలంగా నిలబడ్డాడు. అప్పుడు భర్త యొక్క తండ్రి చూడటానికి వచ్చాడు. ఆమె తన మతం మార్చుకుంది కాబట్టి, భార్యకు విడాకులిచ్చేయమని తండ్రి అతనికి ఆజ్ఞాపించాడు. “ఇంకా మంచి భార్య” కొరకు నేను కన్యాశుల్కం ఇస్తానని తండ్రి కుమారునికి చెప్పాడు. కుమారుడు ఇలా జవాబిచ్చాడు: “నేను అలా చేయను. ఆమె మంచి భార్య. ఒకవేళ ఆమే వెళ్లిపోతానంటే అది వేరే విషయం, కాని నేను మాత్రం ఆమెను వెళ్లమని చెప్పను.” భార్య తన మామతో ఎంతో మర్యాదగా ప్రవర్తించింది, ఆయన తన ప్రవర్తన గురించి సిగ్గుపడ్డాడు. అయినా, ఆయన తన స్వగ్రామానికి తిరిగివెళ్లి, ఈసారి చివరి హెచ్చరిక ఇస్తూ తన కుమారునికి ఉత్తరం వ్రాశాడు. ఒకవేళ తన కుమారుడు తన భార్యను పంపేయడానికి నిరాకరిస్తే, అతడింక తన కుమారుడు కాదని చెప్పాడు. మళ్లీ కుమారుడు తన భార్య పక్షానే నిలబడ్డాడు. తన భర్త అలాంటి కచ్చితమైన స్థానం వహించడం చూసి భార్య ఎంతగా ఆనందించి ఉంటుందో ఊహించండి.

ఇప్పుడు వారి ఇద్దరు చిన్న కుమారులు తల్లితోపాటు రాజ్య మందిరానికి వెళ్లటానికి ఇష్టపడతారు. ప్రసంగాలిచ్చే సహోదరులందరూ టైలు కట్టుకోవడం చూసి వారు తమకు కూడా టైలు కావాలని తండ్రిని అడిగారు. ఈనాడు ఈ స్త్రీ బాప్తిస్మం పొందిన సహోదరి.

చాద్‌లో యెహోవా రాజ్య సువార్తను ప్రకటిస్తూ, నిజంగా “దేవుడు పక్షపాతి కాడని” గుణగ్రహిస్తున్న 345 మంది సంతోషభరితులైన సాక్షులలో ఆమె ఒకరు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి