కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/1 పేజీ 32
  • “బలమైన పట్టణము కంటే ఎక్కువ”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “బలమైన పట్టణము కంటే ఎక్కువ”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/1 పేజీ 32

“బలమైన పట్టణము కంటే ఎక్కువ”

“ఇటీవలి లెక్కల ప్రకారం, దాదాపు అమెరికా పిల్లల్లో 40 శాతం మంది 18 సంవత్సరాలు నిండకముందే తమ తలిదండ్రుల వివాహాలు విచ్ఛిన్నం కావడాన్ని చూస్తారు.” (సైన్స్‌, జూన్‌ 7, 1991) ఎంత భయంగొల్పే లెక్కలు! ఎందుకిలా జరుగుతుంది?

ఫామిలి అండ్‌ ప్రోబేట్‌ కోర్టు న్యాయాధిపతియైన ఎడ్వర్డ్‌ ఎమ్‌. గిన్స్‌బర్గ్‌, ది బోస్ట్‌న్‌ గ్లోబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఉద్దేశాన్ని తెలిపాడు. ఆయనిలా అన్నాడు: “మన మొక స్వార్థపూరిత సమాజం. ‘నాకు’ కావాలి అని మనం కోరుతాం, ‘ఇప్పుడు ఇందులో నాకేముంది?’ అని మనం అడుగుతాం, మనకు తక్షణానందం కావాలి.”

అలాంటి పరిపక్వత చెందని, స్వార్థం వివాహంలో కోపతాపాలకు దారి తీస్తుంది. చివరికి జంటలు విడాకుల కోర్టులకు చేరినప్పుడు భర్తకు, భార్యకు ఘనత కావాలి అని జడ్జి గిన్స్‌బర్గ్‌ చెబుతున్నాడు. తనదే సరియైందని, తన భాగస్వామి తప్పని ఎవరైనా వారికి చెప్పాలని కోరుకుంటారు. “మీరు పోరాటం గెలిచారు” అని ఎవరైనా వారికి చెప్పాలని కోరుకుంటారు.

ఆయన మాటలు మనకు యీ ప్రేరేపిత సామెతను గుర్తు చేస్తాయి: “ఒకనిచేత అన్యాయము నొందిన సహోదరుడు బలమైన పట్టణము కంటే గట్టివాడు.” (సామెతలు 18:19, NW) అవును, ఒక వివాహంలో కలహం చెలరేగినప్పుడు, కలహిస్తున్నవారు కారణరహితంగాను, కఠినంగాను ఉండవచ్చు. తరచూ, వారు ముట్టడి క్రిందనున్న “ఒక బలమైన పట్టణం”లా సమ్మతించుటకు మొండిగా నిరాకరిస్తారు.

విషయాలు ఇలా ఉండవలసిందేనా? కాదు, దీనికి మరో మార్గముంది. “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” అనే అపొస్తలుడైన పౌలు మాటలను ఇద్దరూ మొదటి నుండి లక్ష్యపెడితే, వివాహాలు పటిష్ఠంగా, స్థిరంగా ఉంటాయి. (ఎఫెసీయులు 4:32) అలాంటి లక్షణాలను పెంపొందించుకొనుట అంత సులభమా? ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు. కాని విడాకులైతే ఎంత సులభం? విచ్ఛిన్నమైన వివాహం యొక్క మానసిక, ఆర్థిక భారాలు ఎంత బాధాకరమైనవి? తమ తలిదండ్రుల విడాకుల గుర్తులను తమ తరువాతి జీవితంలోకి తీసుకువెళ్లే పిల్లల మాటేమిటి?

“ఒక బలమైన పట్టణం”లా ఒకరితో ఒకరు ఒద్దిక కలిగి ఇద్దరూ కలిసి తమ వివాహాన్ని కాపాడుకొనుటకు ప్రయత్నించడం ఎంతో మంచిది. పౌలు క్రైస్తవులకిచ్చిన సలహా ప్రాముఖ్యంగా వివాహిత జంటలకు వర్తిస్తుంది: “వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:14.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి