బంగారు పండ్ల వంటివి
ఏపిల్ పండ్లు—అవి కంటికీ నోటికి ఎంత యింపుగా ఉంటాయో! “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది” అని అన్నప్పుడు, బైబిలు ఈ రుచికరమైన పండును ఆలోచింపజేసే ఉపమానంగా ఉపయోగిస్తోంది. (సామెతలు 25:11) ఈ వాక్య భావం ఏమిటి?
“చిత్రమైన వెండి పళ్లెములలో ఉంచబడిన బంగారు పండ్లు” అంటే బహుశా చక్కగా మలచబడిన వెండి పళ్లెంలో బంగారు పండులాంటి చిత్రీకరించే పనిని అది సూచించవచ్చు. ఈ అధ్యాయమందలి ముందున్న వచనాలు రాజును సమీపించడాన్ని గూర్చి చెబుతున్నాయి గనుక, బహుశా ఈ వచనం రాజులకు యిచ్చే బహుమతులు—వెండి పళ్లెంలో ఉంచబడిన పండు ఆకారంలోని బంగారు ఆభరణాలు కావచ్చు. (సామెతలు 25:6, 7) అది నిజంగానే, ఆకర్షణీయమైన అందము!
అలాగే వ్రాతపూర్వకంగా కాని, లేక మాటద్వారా గానీ సరైన, గౌరవనీయ, సమయోచిత మాటల్లో కూడా అటువంటి అందం ఉంటుంది. అవి అనేక విధాల్లో సంతోషదాయకం, ప్రోత్సాహకరం, ప్రయోజనకరం. ప్రత్యేకంగా, బైబిలులోని దైవ ప్రేరేపిత మాటలు చిత్రమైన “వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్ల” అంతటి అందమైనవి.
సామెతలు 25:11 నందు రాజైన సొలొమోను వివేకయుక్తమైన మాటల్లో వివరించబడినట్లుగా, ఆయన “యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.” (ప్రసంగి 12:10; సామెతలు 25:1) శతాబ్దాల తర్వాత, క్రైస్తవ అపొస్తలుడైన పౌలు, “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము” అని రాశాడు. (2 తిమోతి 3:16) అవును, చక్కటి చిత్రకారుని అధిగమించే జ్ఞానముతోకూడిన మనోహరమైన సత్యాలు, ఉపయుక్త సలహాలు, ప్రవచనాలు, మాటలు, బైబిలులో ఉన్నాయి. అంతేకాకుండ, దేవుని వాక్యమైన బైబిలునుండి జ్ఞానాన్ని పొందేవారెవరైనా, విలువ కట్టలేని సంపాద్యాన్ని పొందుతారు, అంతేకాకుండా నిత్యజీవపు నిరీక్షణను కల్గివుండగలరు.—సామెతలు 4:7-9; యోహాను 17:3.