అవి మీకు మేలు చేయగలవా?
కుటుంబాలను దృఢపర్చటానికి, వ్యక్తిగత యథార్థతను కాపాడుకోవటానికి బైబిలు ఇచ్చే సూచనలు మనస్సుకు తెచ్చుటకు రూపొందించబడిన, మీ చేతుల్లో ఉన్న ఈ పత్రిక ప్రోత్సాహానికి మూలం అని చెప్పతగినది. ఈనాటి కష్టభరితమైన కాలాలు బైబిలులో ముందే చెప్పబడ్డాయని అది చూపిస్తుంది, దానికి పరిష్కారమైన దేవుని రాజ్య ప్రభుత్వాన్ని అది ఉన్నత పరుస్తుంది. మీరు కావలికోట, దాని సహ పత్రికయైన తేజరిల్లు! నుండి మేలు పొందగలరా?
ఫిలిప్సైన్స్ నుండి విల్మే అనే స్త్రీ ఇలా వ్రాసింది: “మీ ప్రచురణను వివరించటానికి ఏదైనా పదముందంటే అది ‘అద్భుతం’ అని చెప్పవచ్చు. మనీలా నుండి బస్సులో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నేను మొదటిసారి మీ తేజరిల్లు! మరియు కావలికోట పత్రికలను చూసి, చదివాను. నేను సాధారణంగా ప్రయాణం చేసేటప్పుడు వార్తాపత్రికలను వెంట ఉంచుకుంటాను, కాని ఈసారి నాతో పాటు ఏమీ తీసుకువెళ్లలేదు.
“ప్రయాణంలో నా ప్రక్కన మీ పత్రికలున్న మధ్య వయస్సు వ్యక్తి కూర్చున్నాడు. ఆయన తేజరిల్లు! చదివిన తరువాత మరో పత్రికను, కావలికోటను బయటికి తీసాడు. నేను తేజరిల్లు!ను అడిగి తీసుకునే అవకాశాన్ని జారవిడుచుకోలేదు. నిజం చెప్పాలంటే, నేను ఆ పత్రికలను చదవటం ద్వారా నిజంగా ఆనందించాను. ఎందుకంటే శీర్షకలన్నీ ఆసక్తికరంగా, సమయోచితంగా, క్షేమాభివృద్ధికరంగా ఉన్నాయి.”
ఆ స్త్రీ ఇలా ముగించింది: “నేను కూడా మీ పత్రికలు పొందాలనుకుంటున్నాను. నేను వాటినెలా పొందవచ్చో దయచేసి తెలియజేయండి.” ఫిలిప్సైన్స్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఈ స్త్రీని తమ తపాలా లిస్టులో జతచేయటానికి సంతోషించింది. మీరు కూడా కావలికోట మరియు తేజరిల్లు! కాపీలను పొందాలనుకుంటే, ఒక్కొక్కదానికి సంవత్సర చందాగా రూ. 60.00 పంపుతూ ఈ క్రింద ఇవ్వబడిన చిరునామాకు దయచేసి వ్రాయండి.