కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 12/1 పేజీ 32
  • దేవుని పేరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని పేరు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 12/1 పేజీ 32

దేవుని పేరు

“యెహోవా ఇంటిని నిర్మించకపోతే, నిర్మాణకుని ప్రయాసమంతా వ్యర్థమే.” లాటిన్‌ శిలాశాసనంపై అలా ఉంది. ఈ వాక్యాలు బైబిలులోని కీర్తన 127:1పై ఆధారపడినవే, మరి వాటిలో గొప్ప సత్యం ఉంది: యెహోవా ఆశీర్వాదము లేని ఏ ప్రయాసమైనా తుదకు వ్యర్థమే.

పదిహేడు వందల ఎనభైనాటి ఈ శిలాశాసనం శ్రీలంక నందలి కొలంబోలో ఒక భవనంపై కనబడుతుంది. అది గమనార్హమే, ఎందుకంటే దానిపైన యెహోవా అని దేవుని పేరు ఉంది. (ఫోటో చూడండి.) తొలి శతాబ్దాల్లో ఆ పేరు ఎంతో విరివిగా ఉపయోగించబడేది. అది తరచూ భవనాలపై, చర్చీలపై, చివరికి నాణాలపైకూడా రాయబడేది. మిషనరీలు బైబిలును దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పుడు దేవుని నామాన్ని వాడేవారు. నిస్సందేహంగా అది నిజమేనని శ్రీలంకలోని ఈ శాసనమే చూపుతోంది.

ఇప్పుడు విషయాలు ఎంతగా మారిపోయాయి! క్రైస్తవులమని చెప్పుకునే వారిలో కొందరు మాత్రమే దేవుని నామాన్ని పట్టించుకుంటారు. యెహోవాసాక్షులు దాన్ని నొక్కి తెల్పుతున్నందుకు, కొందరు విద్వాంసులు వారిని విమర్శిస్తారు. ఎందుకు? ఎందుకంటే కొందరి ప్రకారం, ఆ నామం యొక్క హెబ్రీ ఉచ్చరణ కచ్చితంగా తెలియదు. అయితే యేసు పేరుకున్న అసలు హెబ్రీ ఉచ్ఛారణ ఎంతమందికి తెలుసు? అయినా, ఆయన పేరు విశ్వవ్యాప్తంగా ఉపయోగించబడుతోంది, గౌరవించబడుతోంది.

యేసుకు దేవుని పేరు చాలా ప్రాముఖ్యంగా ఉండేది. మనం యిలా ప్రార్థించాలని ఆయన నేర్పాడు: “నీ నామము పరిశుద్ధపరచబడుగాక.” (మత్తయి 6:9) తాను చనిపోవుటకు కొంచెము ముందు దేవునితో ఆయన యిలా అన్నాడు: “లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని.” (యోహాను 17:6) నిజమైన క్రైస్తవులు యేసు అడుగుజాడలను అనుసరించేవారు. వారు ‘దేవుని నామమును ప్రత్యక్షపర్చాలి’ కదా? యెహోవాసాక్షులు అలాగే చేస్తారు, మరి యెహోవా వారి “ఇల్లు”ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. వారి విషయంలో ఈ కీర్తన నిజమైంది: “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్తన 144:15.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి