కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 12/1 పేజీలు 10-13
  • ఈనాడు యెహోవా చేసే రక్షణకార్యాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈనాడు యెహోవా చేసే రక్షణకార్యాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేమను క్రియల్లో కనపర్చుట
  • ప్రపంచ వ్యాప్త సహోదరత్వం
  • నిజమైన కాపుదలకు మూలాధారము
  • ఆండ్రూ తుఫాను నాశనం చేయలేనివి
    తేజరిల్లు!—1993
  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • మియన్మార్‌ తుఫాను బాధితులకు సహాయం అందింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మెక్సికో నందు విపత్తుల మధ్య క్రైస్తవ ప్రేమ
    తేజరిల్లు!—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 12/1 పేజీలు 10-13

ఈనాడు యెహోవా చేసే రక్షణకార్యాలు

బైబిలు యెహోవాను గూర్చి యిలా చెబుతోంది: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నింటిలోనుండి యెహోవా వానిని విడిపించును,” ఇంకా, “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . ప్రభువు సమర్థుడు.”—కీర్తన 34:19; 2 పేతురు 2:9.

తన ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు యెహోవా వారికి ఎలా సహాయపడతాడు? అనేకులు అనుకొనేట్లు, ఏవో అద్భుతాల చేత ప్రకృతి శక్తులను మరల్చడంవల్లనో లేక ఏదో మానవాతీత కార్యం వల్లనో కాదు గానీ, అనేకులు నిజంగా అర్థంచేసుకోలేని మరో శక్తి వల్ల దాన్ని సాధిస్తాడు—అదే ప్రేమ. అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు, అంతేకాకుండా దాదాపు పూర్తి అద్భుతంగా కన్పించే దానిని ఆయన వారి యెడల నెరవేర్చుటకు వారు ప్రేమను కలిగియుండేలా ఆయన చేశాడు.—1 యోహాను 4:10-12, 21.

అయితే, అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యేవి ఆహారం, మందులు సామాగ్రేగాని ప్రేమకాదని కొందరు వాదించవచ్చు. నిస్సందేహంగా, ఆహారం, మందులు, సామాగ్రి అవసరమైనవే. అయితే, అపొస్తలుడైన పౌలు యిలా సహేతుకంగా చెబుతున్నాడు: “కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.”—1 కొరింథీయులు 13:2, 3.

ఒక ప్రక్క అవసరతలోవున్న ప్రజలు వ్యాధులతో, ఆహారం లేక చనిపోతూవుంటే, మరో ప్రక్క సహాయ సామాగ్రి అంతా ఓడరేవులలో చెడిపోవడం లేక ఎలుకలు వాటిని తినివేశాయి అని మనం తరచూ చదువుతూ ఉంటాం. లేక అంతకంటే ఘోరంగా, యిటువంటి సామాగ్రి అంతా, దాన్నుండి వ్యక్తిగతంగా లాభంగడించాలని చూసే పేరాశాపరుల చేతిలో, నీతిమాలిన వారి చేతిలో పడవచ్చు. కాబట్టి, సహాయ సామాగ్రిని అందుబాటులో ఉంచడం ఒక విషయమైతే, బాధితులు దాన్నుండి ప్రయోజనం పొందేలా చేయడం మరో విషయం. కేవలం యథార్థమైన ప్రేమ, శ్రద్ధ మాత్రమే అలా చేయగలవు.

ప్రేమను క్రియల్లో కనపర్చుట

సెప్టెంబరు 1992లో ఇనికి తుపాను 55,000 మంది జనాబా ఉన్న కౌవాయి అని పిలువబడే హవాయి ద్వీపాన్ని ముంచెత్తింది. దాని గాలులు గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వీచాయి, పెనుగాలి తెరలు గంటకు 260 కిలోమీటర్ల వేగంలతో వీసి 98 మందిని గాయపర్చి ఇద్దరిని పొట్టనబెట్టుకుంది, 75 శాతం యిళ్లను ధ్వంసం చేసింది, 8,000 మందికి నిలువ నీడలేకుండా పోయింది. దాదాపు 100 కోట్ల డాలర్ల ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా. ఈ చిన్న ద్వీపంపై నివసించే వారిలో దాదాపు 800 మంది యెహోవాసాక్షులు ఆరు సంఘాల్లో ఉన్నారు. వారు దాన్ని ఎలా తాళుకున్నారు?

అసలు ఇనికి తమను ముంచెత్తకముందే, ప్రయాణ కాపరి ఆధ్వర్యంలో సంఘ పెద్దలు అన్ని సంఘాల్లో ప్రతి ఒక్కరినీ కలిసి, వరద ముంచెత్తినా వారు సురక్షితంగా, భద్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఆ సమయంలో కనపర్చిన ప్రేమపూర్వక శ్రద్ధ, సాక్షుల్లో గంభీరమైన గాయాలు, మరణాలు సంభవించకుండా జాగ్రత్త తీసుకోడానికి హేతువయ్యింది.—యెషయా 32:1, 2 పోల్చండి.

రాకపోకలూ రవాణా పూర్తిగా ఆగిపోయినా, తుపాను వెలిసిపోయిన వెంటనే ఆ ప్రాంతానికి మొదటవచ్చిన వారిలో హోనోలులు నందలి వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి బ్రాంచ్‌ కార్యాలయంనుండి వచ్చిన ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు. కౌవాయి విమానంలో ప్రయాణించడానికి సివిల్‌ డిఫెన్స్‌ నుండి వీరికి ప్రత్యేక అనుమతి లభించింది. వెంటనే, ప్రాంతీయ సాక్షులను వారు కలుసుకొని, మరుసటి రోజున సహాయక చర్యలకై పథకం వేయడానికి ఒక కూటాన్ని ఏర్పాటు చేశారు. అవసరతలు అంచనా వేయడానికి, హోనోలులు బ్రాంచి కార్యాలయం ద్వారా అవసరమైన వస్తువులను పొందడానికి ఒక సహాయక కమిటీ ఏర్పాటు చేయబడింది. అలయక పనిచేస్తూ, అవసరతలో ఉన్న వారికి సామాగ్రిని అందజేయడం, శుభ్ర పర్చడం, పాడైన యిళ్లును బాగుచేయించడం వంటి వాటిని పర్యవేక్షించారు.

ఇతర ద్వీపాల్లోని సాక్షులు తమ సహోదరుల అవసరతలకు వెంటనే ప్రతిస్పందించారు. కౌవాయి విమానాశ్రయం తెరవబడగానే, 70 మంది సాక్షులు సహాయం అందించాడానికి విమానంలో వచ్చివాలారు. లక్ష డాలర్ల విలువ చేసే సహాయక సామాగ్రి ఓడల్లో ఎక్కించబడింది. అందులో జనరేటర్లు, చిన్న స్టవ్వులూ దీపాలూ ఆహారం ఉన్నాయి. ద్వీపంలోని రాజ్యమందిరాల్లో ఒకదాన్ని డిపోగా ఉపయోగించారు; అయితే, అది దోచుకొన బడుతుందేమో అన్న భయం ఒకటి ఉండేది. సైన్య ట్రక్కులు, రాజ్య మందిరం నందలి పార్కు చేసే స్థలంలోకి జొరబడి, అందులోని డ్రైవర్లు తమ ట్రక్కులను అక్కడ ఉంచవచ్చా అని అడిగారు. తమ ట్రక్కులను కాపాడ్డానికి సైనికులు కాపలా ఉండేవారు, అలాగే సహాయక సామాగ్రి దోచుకొనబడుతుందనే సమస్యకూడా తొలగిపోయింది.

ప్రజలు తమ ఫ్రిజ్‌లను ఉపయోగించుకునేట్లుగా సహోదరులు, జనరేటర్లను ఒక్కో యింటివద్ద రెండు మూడు గంటలపాటు ఉంచుతూ యింటింటికీ తీసుకువెళ్లేవారు. ఒక గుంపు సహోదరులు వేరు వేరు యిళ్లను శుభ్రంచేసి పాడైన యిళ్లను బాగుచేయడానికి పంపించబడ్డారు. వారు ఒక సహోదరి యింట్లో పని చేసే సమయంలో, మునుపు తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె భర్త ఎంతగా కదలిపోయాడంటే, అలా చూస్తూ ఏడుస్తూ నిల్చుండిపోయాడు. ముఖ్య దేశంనుండి వచ్చిన ఒక సందర్శకుడు సాక్షుల మరో గుంపు పనిచేస్తుండగా గమనించి వారి ప్రవర్తనకూ వ్యవస్థీకరణకు ముగ్ధుడై వారిని సమీపించి, వారెందుకంత భిన్నంగా ఉన్నారని అడిగాడు. దానికి కారణం తమకు దేవుని యెడల, అలాగే తమ తోటి క్రైస్తవులయెడల గల ప్రేమే కారణమని ఒక సహోదరుడు చెప్పినప్పుడు అతను యిలా అన్నాడు: “నేను దేవుని ఎలా తెల్సుకోగలను?” (మత్తయి 22:37-40) అప్పుడు అతను యింకా యిలా అన్నాడు: “మీరు ఎంతో వ్యవస్థీకరించబడినవారు, బహుశా నేను ఫ్లారిడాకు తిరిగి వెళ్లేసరికి నాకొరకు నా యింటివద్ద ఎవరో ఒకరు వేచియుండేలా మీరు చేయగలరు!”

మొత్తానికి, యెహోవాసాక్షులు కౌవాయిలోని 295 యిళ్లను శుభ్రపర్చి, బాగుచేయడంలో సహాయపడ్డారు. వీటిలో 207 యిళ్లకు స్వల్ప మరమ్మత్తులు సరిపోయాయి, అయితే 54 యిళ్లు దారుణంగా పాడయ్యాయి, 19 యిళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. సాక్షి అని తెలిసిన ప్రతి ఒక్కరి యింటికీ వెళ్లి అందరికీ సహాయం అందిందని నిశ్చయపర్చుకోడం కూడా వారిపనిలో యిమిడివుంది. సహాయక సామాగ్రిని ఒక సహోదరి యింటికి చేరవేసినప్పుడు, పక్కింటి బౌద్ధమత వ్యక్తి, తమ గుంపులోని వారినుండి ఒక్క టీపొడి పాకెట్టును కూడా పొందలేదని చెప్పాడు. సాక్షుల గుంపుచే తన యింటిని శుభ్రం చేయించుకొనిన మరో స్త్రీ యిలా అన్నది: “ఎంతో కాలంగా మీరు నా యింటికి వస్తూ ఉన్నారు, నేను మీరు మంచి పొరుగువారు అని అనుకున్నాను కానీ పొరుగువారి యెడలవున్న ఈ ప్రేమ మీ సంస్థ ఎలాంటిదో చూపుతోంది. మీరు కష్టపడిచేసిన పనికి నేనెంతో కృతజ్ఞురాలిని.”

సహాయార్థం వచ్చిన వారు తమ తోటి క్రైస్తవుల భౌతిక అవసరతలను తీర్చడమే కాకుండా, వారి ఆత్మీయ ఆరోగ్యంపై కూడా శ్రద్ధను కల్గివున్నారు. తుపాను వెలసిన తర్వాత రెండురోజులు కాకమునుపే, అనేక సంఘాలు అప్పటికే కూటాలను నిర్వహించడం ప్రారంభించాయి. కొద్ది వ్యవధిలోనే, చిన్న చిన్న పుస్తక పఠన గుంపులు మరలా నిర్వహించబడ్డాయి. ప్రతి సాక్షికొరకు కూడా కాపరి సందర్శనాలు నిర్వహించేలా స్థానిక పెద్దలకు సహాయపడడానికి యితర ద్వీపాలనుండి పదిమంది పెద్దలు కౌవాయి ద్వీపానికి వచ్చారు. మరుసటి ఆదివారం, ఆరు సంఘాలు కూడా కావలికోట! పఠనాన్ని నిర్వహించుకున్నాయి. తర్వాత సహాయక కార్యకలాపాలపై సహాయక కమిటీలోని ఒక సభ్యుడు 30 నిమిషాలు ప్రసంగించాడు, చివరిగా హోనోలులు బ్రాంచి కమిటీనుండి యీ పనినిమిత్తం పంపబడిన ఒక సభ్యుడు 30 నిమిషాల ముగింపు ప్రసంగాన్ని యిచ్చాడు. ప్రత్యక్షంగా చూసిన సాక్షుల నివేదిక యిలా చెబుతోంది: “అందరూ తమకు లభించిన చక్కటి నడిపింపుకు ఎంతో ఓదార్పును పొందారు, మరి తమ యితర సమస్యలను ఎదిరించేందుకు ఆత్మీయంగా సంసిద్ధులుగా ఉన్నామని భావించారు. కార్యక్రమం ముగింపుకు వచ్చే సరికి కన్నీళ్లు కార్చనివారు లేరు, అంతేకాక మెప్పుదలతో కూడిన కరతాళ ధ్వనులు వెనువెంటనే వినిపించాయి.”

ప్రపంచ వ్యాప్త సహోదరత్వం

ప్రపంచవ్యాప్తంగా అటువంటి ప్రేమ, శ్రద్ధ యెహోవా ప్రజల గుర్తింపుగా ఉంది. సంవత్సరం క్రితం వాల్‌ తుపాను పశ్చిమ సమోయపై విరుచుకు పడినప్పుడు, అది ఎంతో గొప్ప నష్టాన్ని కలిగించింది, అయితే ప్రపంచంలోని యితర భాగాల్లోని యెహోవాసాక్షులు అక్కడున్న వరద బాధితుల సహాయార్థమై రెక్కలు కట్టుకు వచ్చారు. తర్వాత, ప్రభుత్వం అన్ని మతాల వారితో సహా యెహోవాసాక్షులకు కూడా తమ స్థలాలను మరమ్మత్తు చేయించుకోడానికి నిధులను అందించింది. అపుడు వారు, ముందే తమ కట్టడాల మరమ్మత్తులు పూర్తయ్యాయనీ ఈ డబ్బును ప్రభుత్వ భవనాల మరమ్మత్తుకు ఉపయోగించవచ్చుననీ ఉత్తరం రాస్తూ, ఆ డబ్బును వారు తిరిగి పంపారు. ఈ చర్య ప్రాంతీయ వార్తాపత్రికలో వెలువడింది. దీన్ని గమనించిన ఒక ప్రభుత్వ అధికారి, తమ స్వంత చర్చిని తలచుకొని సిగ్గుపడుతున్నానని ఒక సాక్షితో అన్నాడు. దానికి కారణం తుపానువల్ల పాడైన భవనాలకు సంబంధించిన ఇన్సూరెన్సును తమ చర్చీ వారు ముందే పొందినప్పటికీ ప్రభుత్వం యిచ్చిన డబ్బును వారు తీసుకున్నారు అని ఆయన వివరించాడు.

అదే విధంగా, సెప్టెంబరు 1992లో ఫ్రాన్స్‌ ఆగ్నేయ దిశనందున్న ఉవాజ్‌ నది వాజన్‌ ల రొమెన్‌ ప్రాంతాన్ని దాని చుట్టూవున్న 15 తెగలవారినీ ముంచెత్తి, నాశనం చేసింది, అప్పుడు సాక్షులు తక్షణమే రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రే 40 మంది చనిపోయారు, 400 యిళ్లు ధ్వంసమయ్యాయి, వందలాది యిళ్లు పాడైపోయాయి, వేలాది కుటుంబాలకు మంచి నీళ్లు విద్యుత్‌చ్చక్తి లేకుండా వందల యిళ్లు పాడైపోయాయి. ఆ మరుసటి రోజు తెల్లవారు జామునే, స్థానిక సంఘాల్లోని సాక్షులే తమ సహోదరులకు సహాయం చేయడానికి వచ్చిన వారిలో మొదటివారు. ఆశ్రయం కావల్సినవారిని ఆ ప్రాంతంలోని సాక్షుల కుటుంబాలు ఎంతో ప్రేమగా చేర్చుకున్నాయి. వందలకొలది సాక్షులు ఆయా ప్రాంతాలనుండి తమ సహాయాన్ని అందించడానికి వచ్చారు. ఆ ప్రాంతానికి దగ్గర్లోవున్న ఆరెంజ్‌ పట్టణంలో, నాలుగు జట్ల స్వచ్ఛంద సేవకుల పనులను పర్యవేక్షించడానికి సహాయక కమిటీ స్థాపించబడింది. వారు మట్టిని తీసి యిళ్లను శుభ్రం చేశారు, మట్టికొట్టుకుపోయిన గుట్టలగుట్టల బట్టలను ఉతికారు, ఆహారాన్ని తయారు చేసి దానితోపాటు త్రాగేనీటిని బాధిత ప్రాంతమంతటా పంచిపెట్టారు. అంతేకాకుండా వారు స్థానిక పాఠశాలనూ అనేక మునిసిపల్‌ భవనాలనూ శుభ్రపర్చారు. వారి అలుపులేని ప్రయాసాన్ని సహోదరులూ ఆ ప్రాంతంలోని ప్రజలూ మెచ్చుకున్నారు.

అనేక ఇతర స్థలాల్లో కూడా యెహోవాసాక్షులు యితరులలాగే విపత్తులూ వరదలూ గాలివానలూ భూకంపాలను ఎదుర్కొన్నారు. ఇవన్నీ అనుకోకుండా జరిగే లేక ఆపలేని సంఘటనల పరిణామమని వారు అర్థం చేసుకొని, దేవున్ని గానీ యితరులనుగానీ వారు నిందించరు. (ప్రసంగి 9:11) అలా కాకుండా ఎంతటి విపత్కకర సంఘటనలను వారు ఎదుర్కొన్నా, తమ తోటి విశ్వాసుల స్వయంత్యాగ స్ఫూర్తితో కూడిన ప్రేమ వారి రక్షణార్థమై తరలి వస్తుందని వారు నమ్ముతున్నారు. ఆలాంటి ప్రేమపూర్వక చర్య తాము పంచుకునే ఒకే విశ్వాసం వల్లనే కల్గుతుంది. శిష్యుడైన యాకోబు యిలా అంటున్నాడు: “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక—‘సమాధానముగా వెళ్లుడి, చలికాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.”—యాకోబు 2:15-17.

నిజమైన కాపుదలకు మూలాధారము

యెహోవాసాక్షులు ఏదో దైవిక జోక్యం వల్ల కలిగే అద్భుతాల కొరకై నిరీక్షించకుండా ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వంలో కాపుదల కొరకు చూడాలని వారు గ్రహిస్తారు. నిజానికి, ఆపద కాలంలో ఆ సహోదరత్వం సాధించేపని ఏ అద్భుతానికి తీసిపోయేది కాదు. మత్తయి 17:20 నందున్న యేసు మాటలను వారు జ్ఞాపకముంచుకుంటారు: “మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి—‘ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే’ అది పోవును.” అవును, కొండంత అడ్డంకులను సహితం ప్రేమతో కూడిన క్రైస్తవ విశ్వాస కార్యాలతో ఎదుర్కొనవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలు, ఈ అస్థిర ఆపత్కర కాలాల్లో తమ దేవుని రక్షణ హస్తం క్రింద సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారు. కీర్తన రచయిత భావించినట్లే వీరూ భావిస్తున్నారు: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” (కీర్తనలు 4:8) వారు ధైర్యంగా తమ ముందున్న పనికి అవధానమిస్తున్నారు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) అంతేకాకుండా వారు యెహోవా వాగ్దానం చేసిన శాంతియుతమైన నీతియుక్త నూతన లోకం వస్తుందని పూర్తి నిశ్చయతతో ఎదురుచూస్తున్నారు. అందులో మనుష్యుల వల్లగాని లేక ప్రకృతి వల్లగానీ కలిగే ఏ విపత్తునూ వారు ఎన్నటికి అనుభవించరు.—మీకా 4:4.

[12వ పేజీలోని చిత్రాలు]

వరద బాధితులకు సహాయం చేయడానికై సాక్షులు ఆయాప్రాంతాలనుండి వచ్చారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి