కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 11/1 పేజీలు 24-25
  • గలిలయ సముద్ర ప్రాంతాన్ని పర్యటిద్దాం రండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గలిలయ సముద్ర ప్రాంతాన్ని పర్యటిద్దాం రండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • A7-D యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో యేసు గొప్ప పరిచర్య (2వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • యేసు తుఫానును నిమ్మళింపజేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 11/1 పేజీలు 24-25

వాగ్దాన దేశమునుండి దృశ్యాలు

గలిలయ సముద్ర ప్రాంతాన్ని పర్యటిద్దాం రండి!

గలిలయ సముద్రం కంటే చాలా తక్కువ దృశ్యాలు బైబిలు చదువరుల మనస్సుకు చాలా సులభంగా గుర్తుకు వస్తాయి. బహుశా మీరు కళ్లు మూసుకుని ఈ మంచినీటి సముద్రాన్ని, యొర్దాను నది ఎక్కడ ప్రవేశిస్తుంది, ఎక్కడనుండి బయటకు వెళ్తుంది లేక కపెర్నహూము మరియు తిబెరియ ప్రాంతాల వంటి ముఖ్య స్థలాలు ఎక్కడున్నాయో ఊహించగలరా?

ఇన్‌సెట్‌ను పోల్చి చూస్తూ ఆకాశంనుండి క్రింది దృశ్యాన్ని గమనించడానికి సమయం తీసుకోండి. అక్కడ సంఖ్యలచే చూపబడిన ప్రాంతాలను ఎన్నింటిని మీరు గుర్తించగలరు? మీరు ఎన్నింటిని గుర్తించగలిగితే, మీ బైబిలు మీకు అంత వాస్తవంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అందుకని, ఒక క్లుప్తమైన, విషయగర్భితమైన పర్యటనకు రండి.

ఆకాశంనుంచి చూస్తే ఈ చిత్రం ఈశాన్యంవైపుకు ఉంది. మనం #1 నుండి మొదలు పెడదాము. అది సముద్రం యొక్క ఏ భాగం? అవును. అది దక్షిణాది చివర, అక్కడే యొర్దాను మొదలై సమరయా మరియు గిలాదు మధ్యగా వెళ్లి మృత సముద్రంలో పడుతుంది. ఎడమ వైపునుండి మీరు సముద్రం యొక్క ఈ చివరను దగ్గరగా చూడగలరు, ఇది యెహోవా సాక్షుల 1993 క్యాలెండర్‌లో కూడ చూపబడింది.

మధ్యదరా సముద్రానికి 200 మీటర్లు దిగువన, లోయ ప్రాంతంలో గలిలయ సముద్రం లోతుగా ఉంది. ఆకాశంనుండి మీరు పరిశీలిస్తుండగా, దాని తూర్పువైపు తీరాన పర్వతాలు ఉండడం గమనించండి (7# చుట్టూ). ఈ సముద్రం లోయలో ఉందను విషయాన్ని నొక్కిచెబుతూ దానికి దగ్గరగా, లేక పశ్చిమ తీరాన కొండలూ, పర్వతాలూ ఉన్నాయి. ఈ సముద్రం ఇంచుమించు 21 కిలోమీటర్లు పొడవు, 12 కిలోమీటర్లు వెడల్పు ఉంది. తీరాన గ్రామాలకు మరియు తిబెరియ వంటి పట్టణాలకు కూడా స్థలం ఉండింది (#2). యేసు అద్భుత రీతిలో 5,000మందికి ఆహారం ఇచ్చిన స్థలానికి తిబెరియనుండి పడవల్లో ప్రజలు సముద్రాన్ని దాటి వచ్చారన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి.—యోహాను 6:1, 10, 17, 23.

మీరు తీరంవెంబడి తిబెరియ నుండి ఉత్తరానికి వెళ్తే గెన్నేసరెతు యొక్క సారవంతమైన ప్రాంతాన్ని మీరు దాటుతారు (#3).a ఈ ప్రాంతంలోనే యేసు కొండమీది ప్రసంగాన్ని ఇచ్చారు, బహుశా దీనికి దగ్గరలోని తీరప్రాంతంలోనే, ఆయన పేతురు మరియు ముగ్గురు ఇతరులను ఇక్కడ చూపబడుతున్నట్లు “మనుష్యులను పట్టు జాలరులు” అవ్వడానికి పిలిచాడు. (మత్తయి 4:18-22) అలా ప్రయాణిస్తూ వెళ్తే, మీరు కపెర్నహూముకు వస్తారు (#4). అది యేసు కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉండింది, అది “ఆయన స్వంత పట్టణంగా” కూడ పిలువబడింది. (మత్తయి 4:13-17; 9:1, 9-11; లూకా 4:16, 23, 31, 38-41) సముద్రానికి తూర్పు దిశగా వస్తే, యొర్దాను పైభాగం సముద్రంలో (క్రిందకు) పడే చోటుకు మీరు తిరిగి వస్తారు. (#5). తరువాత మీరు బెత్సయిదా ప్రాంతానికి వస్తారు (#6).

గలిలయ సముద్రాన్ని గురించి మీకు తెలిసిన విషయాలు, బైబిలు వృతాంత్తాలను అనుసరించి, వాటిని ఊహించడానికి మీకు ఎలా సహాయం చేయగలవో ఉదహరించడానికి మనం ఈ కొన్ని స్థలాలను కూడా ఉపయోగించవచ్చు. బెత్సయిదా ప్రాంతంలో యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చిన తరువాత జనసమూహం ఆయనను రాజును చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన అపొస్తలులను పడవలో కపెర్నహూముకు పంపాడు. వారి ప్రయాణంలో, పర్వతాలనుండి ఈదురు గాలులు హఠాత్తుగా వీచి అపొస్తలుల్లో భయాన్ని కల్గిస్తూ, అలలను రేపాయి. కానీ యేసు సముద్రంపై నడుస్తూ వారి దగ్గరకు వచ్చి, తుఫానును నిమ్మళింపజేసి, గెన్నేసరెతు దగ్గర ప్రాంతానికి వారిని క్షేమంగా చేర్చాడు. (మత్తయి 14:13-34) తిబెరియ నుండి వచ్చిన వారు మళ్లీ సముద్రాన్ని దాటి కపెర్నహూముకు వెళ్లారు.—యోహాను 6:15, 23, 24.

సముద్రానికి తూర్పువైపున ప్రయాణిస్తుంటే, “గదరేనీయుల [లేక, గెరాసేనుల] దేశము” అని పిలువబడే ప్రదేశాన్ని మీరు దాటుతారు. ఇద్దరు వ్యక్తులనుండి యేసు దయ్యాలను వెళ్లగొట్టాడని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ ఆత్మలు అతి క్రూరంగా పెద్ద పందుల మందలో ప్రవేశించి, చివరకు అవి కొండ శిఖరం నుండి సముద్రంలోకి దూకేలా చేశాయి. వారిలో ఒక మనిషి తరువాత దగ్గరలో ఉన్న దెకపొలి యొక్క గ్రీకు మాట్లాడే పట్టణాల్లో సాక్ష్యమిచ్చాడు. యేసు ఈ ప్రాంతానికి రావడం మరియు ఈ ప్రాంతంనుండి వెళ్లడం కూడ గలిలయ సముద్రాన్ని దాటుతూ పడవలోనే వెళ్లాడు.—మత్తయి 8:28–9:1; మార్కు 5:1-21.

సముద్రం దిగువ భాగం వైపుకు ప్రయాణించడం ముగిస్తే, గుట్టల మధ్యగా పారుతున్న (యార్‌ముక్‌ అని పిలువబడు) ఒక పెద్ద నదిని మీరు దాటుతారు, అది యొర్దాను నది క్రింది భాగానికి కావలసినంత నీరును తెస్తుంది.

గలిలయ సముద్రం చుట్టు జరిగిన కొన్ని సంఘటనల స్థలాన్ని, అంటే పేతురు మరియు ఇతర అపొస్తలులు చేపలు పడుతున్నప్పుడు పునరుత్థానం తర్వాత యేసు కనిపించిన స్థలం వంటి కొన్నింటిని బైబిలు కచ్చితంగా చెప్పడం లేదు (క్రింద). అది కపెర్నహూము వద్ద అయుండవచ్చని మీరు భావిస్తున్నారా? ఏది ఏమైననూ, ఈ ప్రాముఖ్యమైన సముద్రాన్ని గూర్చిన మీ జ్ఞానము అది సంభవమే అని దృశ్యీకరించడానికి మీకు సహాయం చేస్తుంది.

[అధస్సూచీలు]

a ది వాచ్‌టవర్‌ జనవరి 1, 1992లోని “గెన్నేసరెత్‌—‘వండర్‌ఫుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’” అను శీర్షికను చూడండి.

[24వ పేజీలోని చిత్రాలు]

1

2

3

4

5

6

7

ఉ

ద

తూ

ప

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[24, 25వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian

[25వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి