కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/1 పేజీ 32
  • జీవజలము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవజలము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/1 పేజీ 32

జీవజలము

“వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) “జీవజలము—అంటే రక్షణాధారమైన యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిద్వారా దేవుడు మనకు యిచ్చే సమస్త అనుగ్రహములని దాని భావము. ఈ ఏర్పాట్లు ఉచితము. అందుబాటులో ఉన్నవి. దేవుని పట్ల అది ఎంతటి అద్భుతమైన ఉదారత! ఎందుకు మరి, అది జలముతో పోల్చబడింది?

అక్షరార్థమైన నీరు భూమిలో చెట్లను మొలిపింప జేస్తుంది, అంతేకాకుండా మానవ జీవితాన్ని సాధ్యపరుస్తుంది. నీరులేకపోతే వృక్షజాతి, అలాగే మానవ జాతి ఉనికిలో ఉండజాలదు. అంతేకాకుండా, మీ శరీరంలో 65 శాతం నీరే. కొందరు నిపుణులు ఈ నిష్పత్తిని కలిగివుండటానికి రోజుకు 2.4 లీటర్ల నీటిని త్రాగాలని సిఫారసు చేస్తారు. మీ అంతరంగ జీవ పద్ధతంతటికి—ఆహారాన్ని జీర్ణించుకోవడంనుండి, అనవసరమైన వాటిని విసర్జించుట వరకు—నీరు అవసరం. ఒక్క వారం నీరు త్రాగకుండా ఉంటే మీరు చనిపోతారు.

అదే విధంగా, “జీవజలం” ఆత్మీయ జీవితాన్ని సాధ్యపరచి దాన్ని పోషిస్తుంది. జీవమునిచ్చే జలమును విసర్జిస్తే, మనకు భవిష్యత్తు లేదు. (యోహాను 3:36) మనం దాన్ని అంగీకరిస్తే, నిత్యజీవాన్ని మనం పొందగలం. “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని!” యేసు సమరయ స్త్రీతో అన్నప్పుడు ఆమె ఆసక్తితో ప్రతిస్పందించడం ఆశ్చర్యకరం కాదు. (యోహాను 4:14) మనము కూడా ఆసక్తితో ముందుకేగి, ఉచితముగా ఇవ్వబడు జీవజలము నందుకుందాము.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి