కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/1 పేజీలు 8-9
  • గిలాదు బలాఢ్యులకు పుట్టినిల్లు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గిలాదు బలాఢ్యులకు పుట్టినిల్లు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెఫ్తా యెహోవాకు తన మ్రొక్కుబడిని చెల్లించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • కష్టమైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • అమ్మోనీయులు—దయకు మారుగా ద్వేషం చూపిన ప్రజలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా అందించిన నిర్దేశాన్ని ఆనందంగా స్వీకరించాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/1 పేజీలు 8-9

వాగ్దాన దేశమునుండి దృశ్యములు

గిలాదు బలాఢ్యులకు పుట్టినిల్లు

ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించే కొద్ది ముందుగా మోషే వారికి యీలా ఉద్బోధించాడు: “భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే.”—ద్వితీయోపదేశకాండము 31:6.

మోషే ఉద్బోధలో రూబేను, గాదీయుల గోత్రీకులూ మనష్షే గోత్రంలోని సగంమంది యిమిడి వుండిరి. ‘గిలాదు ప్రదేశము మందలకు తగిన స్థలమని తెలిసికొనిరి’ కనుక, గిలాదు ప్రాంతంలో నివసించుటకు తమ్మును నియమించుమని వారు అడిగారు.—సంఖ్యాకాండము 32:1-40.

ఆవల అంటే, యోర్దానుకు తూర్పు ప్రక్కన గిలాదు వుండేది. ప్రాముఖ్యంగా మృత సముద్రపు ఉత్తర అంచునుండి గలిలయ సముద్రము వరకూ పూర్తి తూర్పు ప్రాంతమంతా అది వ్యాప్తించివుంది. ఈ ప్రాంతం యోర్దాను లోయ నుండి పచ్చికగల మెట్టభూమి, వలయాకారంలో గల కొండలతో నిండినది. కాబట్టి గిలాదు పంటలు పండించటానికి, మందను మేపడానికి చాలా అనువైన ప్రదేశముగా ఉండేది. పైన యివ్వబడిన చిత్రం, గిలాదులోని కొద్ది ప్రాంతము ఎలా వుండెనో తెలుసుకోవటానికి సహాయపడుతుంది. అయితే యింతటి మనోహరమైన ప్రదేశాన్ని ధైర్యంతో ముడిపెట్టటం ఎందుకు?

గిలాదులో నివసించే గోత్రాలు భయమువలన అలా చేయలేదన్నది స్పష్టం. గుర్తుతెచ్చుకోండి, వాగ్దాన దేశంలోని శత్రువులతో యుద్ధం చేయడానికి యోర్దానును దాటడానికి వారు అంగీకరించారు. మరి గిలాదుకు తిరిగి వచ్చిన తర్వాత వారికి ఎక్కువ ధైర్యం కావలసి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే, వారు సరిహద్దులో వున్నారు, ఆగ్నేయం నుండి అమ్మోనీయులు, ఉత్తరం నుండి సిరియన్ల దాడికి వారు లోనయ్యే అవకాశం వున్నది. వారలా అమ్మోనీయులు, సిరియన్ల వలన ముట్టడించబడ్డారు కూడా.—యెహోషువ 22:9; న్యాయాధిపతులు 10:7, 8; 1 సమూయేలు 11:1; 2 రాజులు 8:28; 9:14; 10:32, 33.

ఈ ముట్టడి సమయాలే ధైర్యం మరింత అవసరమైన ప్రత్యేక సందర్భాలు. ఉదాహరణకు, గిలాదు అమ్మోనీయులవలన అణిచివేయబడటానికి యెహోవా అనుమతించిన తర్వాత, దేవుని ప్రజలు పశ్చాత్తాపపడి “పరాక్రమముగల బలాఢ్యు”ని వైపు నడిపింపుకొరకు మరలారు. అతని తండ్రి పేరు కూడా గిలాదే. ఈ పరాక్రమముగల, లేక బలాఢ్యుడైన పురుషుడు యెఫ్తా, అతను పరాక్రమశాలుడైనప్పటికి, దేవుని నడిపింపునూ మద్దతునూ కోరాడని అతను చేసిన ఒక ప్రమాణం విషయంలో అతను ప్రసిద్ధిగాంచాడు. ఒకవేళ దేవుడు ఆ క్రూరులైన అమ్మోనీయులను జయింపజేస్తే, తన యింటినుండి తనను కలుసుకోవడానికి మొదట వచ్చిన దానిని అతను ‘దహన బలిగా అర్పిస్తానని’ లేక దేవునికి అర్పణగా ఇస్తానని మ్రొక్కుకున్నాడు.a అది చివరకు దేవుని గుడారములో సేవచేసేందుకు వెళ్లిన తన ఏకైక సంతానమైన తన కుమార్తే అయ్యింది. అవును, యెఫ్తా, మరో విధంగా ఆయన కుమార్తె ధైర్యాన్ని ప్రదర్శించారు.—న్యాయాధిపతులు 11:1, 4-40.

అంతగా ప్రసిద్ధికెక్కని ఒక పరాక్రమ సంఘటన సౌలు కాలంలో జరిగింది. ఆ సంఘటనను ఊహించుకోండి, సౌలు రాజైనప్పుడు బహుశా కొండలగుండా యోర్దాను వరకూ ప్రవహించే కొండవాగు ఒడ్డున వున్న యాబేష్గిలాదు పట్టణములోని పురుషుల కుడి కంటిని పీకుతామని అమ్మోనీయులు భయపెట్టారు. యాబేషును బలపర్చడానికి సౌలు వెంటనే తన సైన్యాన్ని సమకూర్చాడు. (1 సమూయేలు 11:1-11) ఆ సంఘటనను మన మనస్సులో వుంచుకొని, ఎలాంటి ధైర్యం ప్రదర్శించబడిందో చూడటానికి సౌలు పాలనాంతానికి వెళ్దాం.

ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో, సౌలు అతని ముగ్గురు కుమారులు మరణించారని మీరు గుర్తు చేసుకోవచ్చు. ఆ శత్రువులు, సౌలు తలను ఆయన కుమారుల తలలను నరికి ఆనందోత్సహాలతో వారి మొండాలను బేత్షా పట్టణం గోడలకు తగిలించారు. (1 సమూయేలు 31:1-10; కుడివైపున, త్రవ్వితీయబడిన బేత్షా శిధిలాలను మీరు చూస్తారు.) యాబేషును గూర్చిన ఈ వార్తను యోర్దాను గుండా గిలాదు కొండలకు ప్రాకిపోయిరి. మరి ఇశ్రాయేలీయుల రాజునే హతమార్చిన అంతటి బలాఢ్యులైన శత్రువులను ఎదుర్కొనడానికి గిలాదీయులు ఏమి చేయగలరు?

గిలాదీయులు ఏర్పర్చుకున్న మార్గాన్ని పరిశీలించుటకు పటమును గమనించండి. “బలశాలులందరు లేచి రాత్రంతయు నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి”రి. (1 సమూయేలు 31:12) అవును, శత్రువుల దుర్గములోకి వారు రాత్రివేళ ప్రవేశించి ఆ పని సాధించారు. కాబట్టి వారిని పరాక్రమవంతులు లేక బలాఢ్యులని బైబిలు ఎందుకు పిలుస్తుందో మీరు అర్థం చేసుకోగలరు.

ఈ నడుమ, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యస్థాపనకు పది గోత్రాలు విడిపోయారు. దీనిలో గిలాదుకూడా వుంది. చుట్టుప్రక్కల దేశాలు, మొదట సిరియన్లు తర్వాత అస్సీరియన్లు ఆ ప్రాంతంలోని యోర్దాను తూర్పు ప్రక్కనవున్న స్థలాలకు ఆక్రమించుకోసాగారు. కాబట్టి గిలాదు ప్రజలు ధైర్యాన్ని ప్రదర్శించినప్పటికీ, సరిహద్దు ప్రాంతంలో నివసించినందున వారు దానికి తగిన మూల్యాన్ని చెల్లించారు.—1 రాజులు 22:1-3; 2 రాజులు 15:29.

[అధస్సూచీలు]

a జాగ్రత్తగా జరిపిన చరిత్ర పరిశీలన యెఫ్తా తన కుమార్తెను నరబలిగా అర్పించాడన్న విషయాన్ని ఖండిస్తోంది. వాచ్‌టవర్‌ బైబిలు అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించిన ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్ర్కిప్చర్స్‌, వాల్యూమ్‌ 2, పేజిలు 27-8, చూడండి.

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[9వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[8వ పేజీలోని చిత్రం]

గలిలయ సముద్రము

మృత సముద్రము

యోర్దాను నది

బేత్షాను

రామోత్గిలాదు

యాబేషు

గిలాదు

[క్రెడిట్‌ లైను]

Based on a map copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి