కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 8/15 పేజీ 32
  • యోనాను అది మ్రింగిందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోనాను అది మ్రింగిందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 8/15 పేజీ 32

యోనాను అది మ్రింగిందా?

యెహోవా ప్రవక్తయగు యోనా సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దమందు తనకు అప్పగింపబడిన పనిని విడిచి పారిపోతూ, ఒక ఓడనెక్కాడని బైబిలు మనకు చెబుతున్నది. మధ్యధరా సముద్రమందు ఆ ప్రయాణంలో సంభవించిన తుఫానప్పుడు, ఓడ సిబ్బంది అతన్ని సముద్రంలో పడవేశారు. “గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.”—యోనా 1:3-17.

‘అది అసాధ్యం! సముద్రమందలి ఏ ప్రాణియు ఒక మనిషిని మ్రింగలేదని’ కొందరందురు. అయితే ఒక స్పెర్మ్‌ తిమింగిలం లేదా ఒక గొప్ప తెల్ల సొరచేపగాని అలాచేయగలదు. నేషనల్‌ జియోగ్రఫీ (డిశంబరు 1992) మరో సాధ్యతను అనగా వేల్‌షార్క్‌ కూడా అలాచేయగలదని వెల్లడించింది. అతిపెద్ద సొరచేప 20 మీటర్ల పొడవు 70 టన్నుల బరువుకు పెరగగలదు.

“ఈ వేల్‌షార్క్‌ యొక్క అసాధారణమైన జీర్ణకోశ నిర్మాణం యోనా కథలకు తావిస్తున్నది. ఒక పెద్ద సొరచేప అమాంతంగా మిమ్మల్ని మ్రింగివేయడాన్ని మీరు సులభంగా ఊహించుకోవచ్చు . . . చిన్నసైజు వేల్‌షార్క్‌ సహితం సునాయాసంగా ఇద్దరు యోనాలను తన విశాలమైన నోటిలో ఇముడ్చుకోగలదు.”

ఈ వేల్‌షార్క్‌ తేలియాడే నాచును, నాచువంటి మొక్కల్ని తిని బ్రదుకుతుంది. “అవన్నీ దాని పెద్ద అన్నవాహిక ద్వారా విశాలమైన బానలాంటి కడుపులోకి చేరుకుంటాయి.” అదిసరే, ఎవరైనా దాని కడుపులో నుండి మరలా బయట పడగలరా? నేషనల్‌ జియోగ్రఫీ ఇలా చెబుతున్నది: “ఈ సొరచేపలు తాము తిన్నవాటిని జీర్ణించుకోలేకపోతే వాటిని సునాయాసంగా బయటకు క్రక్కివేస్తాయి . . . తమ విశాలమైన ఖాళీ కడుపును మెలిపెట్టి లోనవున్న వాటినవి నోటి ద్వారా బయటకు నెట్టేస్తాయి. . . . అలా, శ్లేష్మం కమ్మిన దారిగుండా బయటపడ్తావు, అది జిగురుతో పూయబడినట్లున్నా ఎక్కువ అనుభవంతో బయటపడతావు.”

నేడు ఈ వేల్‌షార్క్‌లు మధ్యధరా సముద్రమందు కన్పించకపోయినను న్యూయార్క్‌ నగరానికి ఉత్తర ప్రాంతమందు అవి కనుగొనబడ్డాయి. యోనా కాలంలో మధ్యధరా సముద్రంలో అవివుండెనా? నిశ్చయంగా ఎవరు చెప్పగలరు? యెహోవా ఏ విధమైన సముద్ర ప్రాణిని ఉపయోగించాడో బైబిలు విశదంగా చెప్పుట లేదు, అయితే యోనా వృత్తాంతము సత్యమని యేసే తానుగా ధృవపర్చాడు.—మత్తయి 12:39, 40.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

Norbert Wu/Peter Arnold Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి