మీకు జ్ఞాపకమున్నవా?
ఇటీవలి కావలికోట సంచికలు మీకు ఆచరణయోగ్య విలువను కలిగివున్నట్లు మీరు చూశారా? అట్లయిన ఈ క్రింది ప్రశ్నలతో ఎందుకు మీ జ్ఞాపకశక్తిని పరీక్షించుకొనకూడదు:
▫ అనాలోచితంగానే మన మనస్సులోనికి చెడుతలంపులు వస్తే, మనమేమి చేయాలి? మానసికంగా అట్టి అంశాన్ని మనం మార్చుకోవాలి, అలా నడిచివెళ్లండి, ఏదైనా చదవండి, లేదా ఏదైనా ఇంటిపని చేయండి. అట్టి పరిస్థితిలో ప్రార్థనకూడ గట్టిగా సహాయం చేస్తుంది. (కీర్తన 62:8)—ssbr (కావలికోట సంఘపుస్తక పఠన శీర్షికల బ్రోషర్.) పుట 33.
▫ తాము వినే సంగీతం విషయంలో యౌవనస్థులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? సంగీతంలో ఉర్రూతలూగించే, కట్టిపడవేసే, ప్రభావంచూపే శక్తివుంది. ప్రజలు ఇష్టపడే అనేక పాటల్లో ఆశ్చర్యపడునంత ఎక్కువగా లైంగిక పదాలు, రెండర్థాల మాటలు చేర్చబడుతున్నాయి గనుక, రికార్డులను, టేపులను, డిస్క్‌లను ఎంచుకోవడంలో బహు జాగ్రత్తగా ఉండాలనుట నిర్వివాదం.—ssbr పుట 37.
▫ “మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత” అనే మాట భావమేమి? (1 థెస్సలొనీకయులు 5:23) ఇది ఆయన పరలోకంలో సింహాసనాసీనుడైన 1914 నుండి రాజుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అదృశ్య రాజరిక ప్రత్యక్షతను సూచిస్తున్నది. (కీర్తన 110:1, 2)—ssbr పుట 51.
▫ యెహోవా తన ఆత్మీయ ఆలయాన్ని పరిశుభ్రపరచుట ఏ సంకల్పాన్ని నెరవేర్చింది? (మలాకీ 3:1-4) భూనిరీక్షణగల ఆరాధికులు ఎక్కువ సంఖ్యలో తేబడినప్పుడు, తన విశ్వ సర్వాధిపత్యము గౌరవింపబడే, తన దైవనామం ప్రతిష్టింపబడే, నీతియుక్త నియమాలకు లోబడే స్థలాన్ని వారు కనుగొనునట్లు యెహోవా తన ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరాడు.—ssbr పుట 56.
▫ క్రీస్తుయేసు తన నియమిత దాసునికిచ్చు “యావదాస్తి” ఏమై యున్నది? (మత్తయి 24:45-47) పరలోక రాజుగా ఆయన అధికారానికి సంబంధించి క్రీస్తు సొత్తుగా ఈ భూమిపై తయారైన ఆత్మీయ సంగతులన్నింటిని ఈ “యావదాస్తి” సూచిస్తున్నది. దీనిలో సమస్త జనులను క్రీస్తు శిష్యులుగా తయారుచేసే ఆజ్ఞకూడా ఇమిడియుంది. (మత్తయి 28:19, 20)—ssbr పుట 56.
▫ మొదటి పేతురు 5:2లో పేతురు ఉద్బోధించిన ప్రకారం తమ కాపుదలలో క్రైస్తవ పెద్దలెట్లు ‘సిద్ధమనస్సును’ చూపుదురు? గొర్రెలనుకాసే ఒక క్రైస్తవ పెద్ద మంచి కాపరియగు యేసుక్రీస్తు నడిపింపు క్రింద ఇష్టపూర్వకంగా, సిద్ధమనస్సుతో ఈ కాపుదల నెరవేరుస్తాడు. ఇష్టపూర్వకంగా సేవచేయుట అనగా ఒక క్రైస్తవ కాపరి యెహోవా అధికారానికి లోబడి, దైవపరిపాలనా ఏర్పాటుయెడల గౌరవాన్ని కనబర్చుటని కూడ దానిభావము.—ssbr పుట 48.
▫ తనను వెంబడింపగోరు ఏ వ్యక్తైననూ ‘తన్నుతాను ఉపేక్షించుకొనవలెనని’ చెప్పినప్పుడు యేసు భావమేమై యుండెను? (మత్తయి 16:24) ‘నిన్నునీవు ఉపేక్షించుకొనుట’ అంటే నీ యావత్ యజమానత్వాన్ని యెహోవాకు అప్పగించుట అని భావము. (1 కొరింథీయులు 6:19, 20) అంటే నిన్ను ప్రీతిపర్చుకొనుటకు కాదుగాని దేవున్ని ప్రీతిపర్చుటకు జీవిస్తావని దానర్థం. (రోమీయులు 14:8)—6/1, పుట 9.
▫ ఒకవ్యక్తి సంతోషానికి కావల్సిందేమిటి? యెహోవాతో చక్కని సన్నిహిత సంబంధాన్ని కలిగివుండి, ఆయన సేవలో పనిరద్దీగా ఉండుట ఒక వ్యక్తి జీవితంలోనికి నిజమైన సంతోషాన్ని తెస్తుంది.—6/1, పుట 22.
▫ సొదొమను నాశనంచేసే తన సంకల్పాన్ని గూర్చి అంత స్వేచ్ఛగా మాట్లాడేందుకు అబ్రాహామును యెహోవా ఎందుకు అనుమతించాడు? (ఆదికాండము 18:22-32) ఒక కారణమేమంటే అబ్రాహాము దేవుని స్నేహితుడై యుండెను. (యాకోబు 2:23) అంతేకాకుండ, అబ్రాహాముకున్న దుఃఖ భావాల్ని యెహోవా ఎరిగివుండెను. అబ్రాహాము అన్న కొడుకైన లోతు సొదొమలో నివసిస్తున్నాడని, అబ్రాహాము అతని క్షేమాన్ని గూర్చి బహుగా తలస్తున్నాడని దేవునికి తెలుసు. ఈ కారణాల్నిబట్టి సొదొమను నాశనంచేసే తన సంకల్పాన్ని గూర్చి అబ్రాహామువేసే ప్రశ్నలకు జవాబివ్వడానికి యెహోవా ఇష్టపడెను.—6/15, పుట 16.
▫ పదహారవ శతాబ్దపు ప్రొటస్టెంట్ మత సంస్కరణోద్యమం నిజ క్రైస్తవత్వానికి తిరిగిరావడాన్ని గుర్తించిందా? లేదు, అదలా గుర్తించలేదు. నిజ క్రైస్తవత్వాన్ని తిరిగి తీసుకురావడానికి బదులు, ఆ మత సంస్కరణోద్యమం రాజకీయాలతో పొత్తుపెట్టుకుని, యుద్ధాల్లో చురుకుగా వాటికి మద్దతునిచ్చే అనేక జాతీయ లేదా ప్రాంతీయ చర్చీలను ఉనికిలోనికి తెచ్చింది.—7/1, పుటలు 10-11.
▫ యేసు మత్తయి 6:20లో మాట్లాడిన “పరలోకమందు . . . ధనము” అనగానేమి? యెహోవాతో మంచి పేరు, నమ్మకమైన క్రైస్తవ సేవయొక్క రికార్డు ఇమిడియున్న ఈ ధనం ఎన్నటికి సమసిపోదు. యెహోవా ఎన్నటికీ మర్చిపోని సంగతుల్లో ఇవికూడా చేరివున్నాయి. (హెబ్రీయులు 6:10)—7/1, పుట 32.
▫ మన విశ్వాసానికి ఆవశ్యకమనే ఏ లక్షణాల్ని పేతురు ప్రస్తావించాడు? (2 పేతురు 1:5-7) మన విశ్వాసానికి సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, భక్తిని, సహోదర ప్రేమను, దయను అమర్చుకొనుడని పేతురు చెప్పాడు.—7/15, పుట 13.
▫ బత్షెబతో దావీదు చేసిన పాపమును గూర్చిన వృత్తాంతమందు దేవుని సేవకులకు ఎలాంటి హెచ్చరిక కలదు? (2 సమూయేలు 11:2-4) తన వివాహమందే సంతోషమనుభవించే స్వేచ్ఛవున్ననూ, దావీదు అక్రమ లైంగిక కోరిక వృద్ధి కావడాన్ని అనుమతించాడు. ఊరియా భార్య అందానికి ఆకర్షితుడై ఆమెతో అక్రమ సంబంధం కలిగివుండాలనే తన తలంపుకు—క్రియలకు—పట్టపగ్గాలు లేకుండా చేసుకున్నాడు. ఈ విధమైన దురాశను విసర్జించకుంటే దేవుని సేవకుల్లో ఎవరికైననూ ఇది సంభవించగలదు. (యాకోబు 1:14, 15)—8/1, పుట 14.