కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 8/15 పేజీలు 23-26
  • సురాపాన సమరంలో విజయం సాధించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సురాపాన సమరంలో విజయం సాధించుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిమ్మల్ని మీరు యథార్థంగా చూచుకొనుట
  • సహాయం పొందండి
  • దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోండి
  • “బలాధిక్యము”
  • బలపర్చే ఒక విధానం
  • బాగుపడ్డం మీ బాధ్యత
  • నేను త్రాగుడు ఎలా మానుకోగలను?
    తేజరిల్లు!—1993
  • కుటుంబానికి హాని కలిగించే సమస్యలను మీరు అధిగమించగలరు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం
    కావలికోట: మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం
  • మద్యం సేవించే విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 8/15 పేజీలు 23-26

సురాపాన సమరంలో విజయం సాధించుట

“పనిచేసే సమయంలో, ఉదయం పదిగంటల నుండి త్రాగడం గురించి ఆలోచించడం మొదలు పెట్టి, పన్నెండయ్యేసరికి ఒకటి రెండుసార్లు త్రాగేవాన్ని. మూడు గంటలకల్లా ఊగుతూ ఉండేవాడిని. మరోసారి త్రాగడానికి ఇంటికివెళ్లే సమయం కొరకు ఎదురుచూసేవాడిని. అలా ఇంటికి వచ్చేలోపు తరచు మార్గంలో నేను మరో రెండు పెగ్గులు వేసుకోవడం, ఇంటిదగ్గర ఏడు గంటలకు తప్పకుండా మరోసారి త్రాగేవాన్ని. అలా త్రాగుతూ, సోయిలేకుండా కుర్చీలోంచి పడిపోయి, తడిసిన పాంటుతో తెల్లారేవరకు మూత్రమందు అలానే పడుకుని ఉండేవాన్ని. “ఇలా వారానికి ఏడుసార్లు; సంవత్సరానికి 52 వారాలచొప్పున 29 సంవత్సరాలు నేనున్నాను.”

ఇతడొక త్రాగుబోతు. ఇతనే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ మరణకరమగు దుస్థితిలో ఉన్నారు. డా. వెర్‌నన్‌ ఇ. జాన్సన్‌ చెప్పిన ప్రకారం, ఈ స్థితిలో “మనిషి మొత్తం అంటే భౌతికంగా, మానసికంగా, మనస్తత్వపరంగా, ఆత్మీయంగా యిమిడియున్నాడు.”a

త్రాగుబోతుతనాన్ని పూర్తిగా బాగుచేయలేము గాని పరిమితమనే జీవితాంత కార్యక్రమము ద్వారా దానిని నిర్భందించవచ్చునని అనేకమంది నిపుణులు చెబుతున్నారు. ఇదొక అసాధారణమైన కట్టడకాదు, ఎందుకంటె మద్యపానం జీవితానికి ఆవశ్యకమైనదేమీ కాదు. వాస్తవానికి, మద్యపాన దుర్వినియోగానికి దేవుని అనుగ్రహం ఉండదు. (1 కొరింథీయులు 6:9, 10) మద్యపాన వాంఛకు బలై నిత్యజీవం పోగొట్టుకొనుటకంటే అది లేకుండా దేవుని నూతన లోకంలో ప్రవేశించడం ఉత్తమం.—మత్తయి 5:29, 30.

మద్యపాన దుర్వినియోగం నుండి బంధవిముక్తులై, అది పుచ్చుకోకుండా ఉండటం తరచు కలవరపరచే సవాలే. (రోమీయులు 7:21-24 పోల్చండి.) ఏది సహాయం చేయగలదు? ఒక సూటియైన సలహాను మనం చూద్దాం. మీరు మద్యం ముట్టకపోయిననూ, త్రాగుబోతుతనంతో పోరాడుతున్న మీ స్నేహితునికో, బంధువుకో సహాయం చేయగల్గునట్లు ఈ సమాచారం మీకు తోడ్పడుతుంది.

మిమ్మల్ని మీరు యథార్థంగా చూచుకొనుట

అధిగమించాల్సిన గొప్ప అడ్డంకు ఏమంటే మీరు త్రాగుబోతులనే వాస్తవాన్ని నిరాకరించడం. అలా నిరాకరించడం యథార్థతారాహిత్యమే. త్రాగడానికి మీకున్న స్వేచ్ఛను అడ్డుకోవడానికి అది ఉద్దేశపూర్వకంగా సమర్థించుకోవడమే అవుతుంది. ‘నేను అంత త్రాగుబోతునేం కాదు. నాకింకా కుటుంబం, ఉదోగ్యం ఉంది’ అని మీరు తర్కించవచ్చు. అంతకంటే ప్రాముఖ్యంగా మీవద్ద మద్యపానం కూడ ఉంది.

అలా నిరాకరించడం మీకు సహాయపడాలనుకున్న స్నేహితుల మాట మీరు వినకుండా చేస్తుంది. తన భార్య మారుతండ్రి విపరీతంగా త్రాగడానికి, క్రూరంగా ప్రవర్తించడానికి అలవాటుపడ్డాడని రాబర్డ్‌ గమనించాడు. “కొన్ని దినాల తర్వాత నేనాయనను కలుసుకొని, అతనలా ప్రవర్తించడానికి త్రాగుడే కారణమా అని అడిగితే” దానికి “‘నీ దగ్గర రుజువులేదు, నా భావమేమిటో నీకు తెలియదు’ వంటి మాటలతో ఆయన దానిని పూర్తిగా నిరాకరించాడని రాబర్ట్‌ చెబుతున్నాడు.”

మీ త్రాగుడు విషయమై శ్రద్ధకలిగిన మీ కుటుంబ సభ్యుడో లేదా స్నేహితుడో మీ దగ్గరకొచ్చి మీ ప్రవర్తనను మీ దృష్టికి తెస్తే మిమ్మల్నిమీరు యథార్థంగా పరీక్షించుకొనే వారిగా ఉండండి. (సామెతలు 8:33) ఒక వారమంతా, నెలంతా లేదా కొన్ని నెలలపాటు మద్యం పుచ్చుకోకుండా మీరుండగలరా? ఉండలేకపోతే, ఎందుకలా ఉండలేకపోతున్నారు? తప్పుడు తర్కనతో తననుతాను మోసపుచ్చుకొను వ్యక్తిగా ఉండకండి. యాకోబు ఇట్లంటున్నాడు: “వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికిపోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా.”—యాకోబు 1:22-25.

బాగుపడ్డం మొదలైన తర్వాత కూడ, నిరాకరించే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ది విల్‌ పవర్స్‌ నాట్‌ ఇనఫ్‌ అనే పుస్తకం యిలా వివరిస్తుంది: “కొద్దికాలంపాటు—బహుశ మొదటిసారి—త్రాగడం మానివేసినందున తను బాగుపడ్డానని క్రొత్తగా మానేసిన వ్యక్తి తప్పుగా నమ్మే అవకాశం కలదు.” ఈ విధమైన తలంపు బలమైన అలవాటైన మాటగావుండి, మరలా త్రాగుడుకు బానిసవ్వడానికి మొదటి అడుగువలె ఉంటుంది. అట్టి నిరాకరింపును గట్టిగా ఎదిరించడానికి, మీ ఒంటరి పోరాటం సరిపోదు.

సహాయం పొందండి

ఈ సురాపాన సమరంలో తాను ఒంటరిగా పోరాడలేనని గ్రహించిన ఓ వ్యక్తి—ఆయన్ని మనం లియో అని పిలుద్దాం—నిపుణుల సహాయాన్ని వెదికాడు. కొంతకాలంపాటు అత్యంత జాగ్రత్తగాచేసిన చికిత్స పొందిన తర్వాత, అతను బాగుపడ్డం ఆరంభించాడు. ఆ నిపుణులందించిన సహాయం యొక్క విలువను గూర్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని లియో భావిస్తున్నాడు.b అటువంటి సహాయం స్థానికంగా లభిస్తే, దానినుండి ప్రయోజనం పొందడానికి మీరు తీర్మానించుకోవచ్చును.

ఏమైననూ, బాగుపడటంలో కేవలం త్రాగుట మానేయడం కంటే ఎక్కువ ఉందనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ త్రాగుబోతుతనం వెనుక మీరు ఎదుర్కోవాల్సిన లోతైన సంగతులు ఉన్నాయి. వీటిని అలక్ష్యం చేయడం ప్రమాదకరం కాగలదు. డా. షార్లెట్‌ డేవిస్‌ కాస్‌ యిలా వ్రాస్తుంది: “నేను దాదాపు పధ్నాలుగుసార్లు త్రాగుడుకు అలవాటుపడిన వారికిచ్చే చికిత్స పొందిన ప్రజలను ఇంటర్వ్యూ చేశాను ఎందుకంటే దానిలో మూల సమస్యలైన దుర్వినియోగం, ఆధారపడ్డం, నిర్లక్ష్యం చేయడంవంటి వాటితో వ్యవహరించడం జరగలేదు.”

డెన్నిస్‌ ఇది నిజమని కనుగొన్నాడు. “నేనెన్నో సమస్యలున్న పచ్చి త్రాగుబోతునై యుంటిని. కేవలం త్రాగుడు మాత్రం మానివేయడం సరిపోలేదు. నా గతాన్ని ఒకసారి చూసుకొని, అనగా నా చిన్ననాటి పాఠాల్ని పరిశీలించి, అవి నాపై ఎలా ప్రభావం చూపుతూ వచ్చాయో అర్థంచేసుకొని నా ప్రవర్తనలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది” అని వ్రాస్తున్నాడు.

అదే ప్రకారం, బాగుపడ్డానికి లియో తన అంతరంగాన్ని చూసుకోవాల్సి వచ్చింది. “నేను బహు ఈర్ష్యపరున్ని, హింసాప్రవృత్తిగల వ్యక్తిని. న్యూనతాభావం మరియు గొప్పభావాల భ్రమల మధ్య నేను ఊగిసలాడుతూ ఉండేవాడిని” అని అతడంటున్నాడు. లియో ఎఫెసీయులు 4:22లోని బైబిలు సలహాను అనువర్తించుకున్నాడు: “మునుపటి ప్రవర్తన విషయములో . . . మీ ప్రాచీన స్వభావమును వదలుకొనుడి.” అవును, మీ “మునుపటి ప్రవర్తన” మీ వ్యక్తిత్వంపై బలమైన ప్రభావం చూపింది. అచ్చునుబట్టి అందలి ముద్దకు ఎలా రూపం వస్తుందో, అలానే మీ మునుపటి ప్రవర్తననుబట్టి మీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. చెడు ప్రవర్తన తీసివేయబడ్డప్పుడు, ఇక మిగిలివుండేదేమిటి? బహుశ అనేక సంవత్సరాలుగా రూపుదిద్దబడిన వ్యక్తిత్వమే గదా. కాబట్టి, బాగుపడ్డంలో మీ మునపటి ప్రవర్తన విషయమై మీ ప్రాచీన వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టడం యిమిడివుండాలి.

దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోండి

లియో బాగుపడ్డంలో దేవునితో వ్యక్తిగత సంబంధం వృద్ధిచేసుకోవడం కూడా చేరియుండెను. “యెహోవాపై ఆధారపడ్డాన్ని నేర్చుకోవడం, నిశ్చయంగా నా దృక్పథాన్ని, ప్రవర్తనను, దృక్కోణాన్ని మార్చివేసింది” అని అతనంటున్నాడు.

అయితే, ఇందుకు జాగ్రత్త అవసరం. దేవునితో లేదా మానవులతో ఎటువంటి సంబంధానికైనా బయటకు చెప్పుకోవడం, యథార్థత, నమ్మకం కావాలి. ఈ లక్షణాల్నే త్రాగుబోతుతనం రూపుమాపుతుంది. వాటిని పెంపొందించుకోవచ్చు, అయితే అందుకు సమయం పడుతుంది.

త్రాగుబోతుగా సన్నిహిత సంబంధమంటే ఎలావుంటుందో మీకు తెలిసివుండకపోవచ్చు. బహుశ మీరెన్నడూ దానిని అనుభవించియుండక పోవచ్చును. ఓపిక పట్టండి. త్రాగుడు మానేయడంతో యాంత్రికంగానే దేవునితో సంబంధం సిద్ధిస్తుందని అపేక్షిస్తూ ఈ విషయంలో తొందరపడకూడదు. దేవున్ని, ఆయన లక్షణాల్ని అర్థం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. యెహోవాను గూర్చి, ఆయన మార్గాల్ని గూర్చి గాఢమైన, మెప్పుతోకూడిన భావాలను వ్యక్తపర్చే కీర్తనలను బహుశ జాగ్రత్తగా చదువుతూ, క్రమంగా ధ్యానించాలి.c

“బలాధిక్యము”

దేవునితో నమ్మకమైన, మనోనిశ్చయమైన సంబంధము మీపై బలమైన ప్రభావము కలిగివుండగలదు. బాగుపడ్డానికి మీరుచేసే ప్రయత్నాలను యెహోవా బలపరుస్తాడు. (కీర్తన 51:10-12; 145:14 పోల్చండి.) ఆయన తన “బలాధిక్యత” అనుగ్రహిస్తాడనే మనోనిశ్చయతతో ఏ సమయంలోనైనా పట్టుదలగాచేసే ప్రార్థనతో మీరాయనను సమీపించవచ్చును.—2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:6, 7.

మీరు నిర్మింపబడిన రీతి ఏ మానవునికంటెను సృష్టికర్తకు బాగా తెలుసు. (కీర్తన 103:14) మానవ జ్ఞానంపై ఆధారపడే మానవ సలహాదారులు సహాయపడగలరు; అయితే ఈ సమరంలో మానవ సృష్టికర్త మీకు మరెంతగానో సహాయం చేయగలడు. (యెషయా 41:10; 48:17, 18) క్రైస్తవ సంఘమందు ఆయన ఈ ప్రేమగల మద్దతును సమకూర్చాడు.

బలపర్చే ఒక విధానం

క్రైస్తవ సంఘమందలి ఆత్మీయ పరిపక్వతగల పెద్దలు మీకెంతో సహాయం చేయగలరు. వారిలో కొంతమందే వైద్య లేదా మానసిక-ఆరోగ్యశాస్త్ర రంగాల్లో నిపుణులై ఉండవచ్చు, అయితే వారికి దేవుని వాక్యం, అందలి సూత్రాలు తెలుసు, వాటిని వారు నమ్ముతారు. వారు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను . . . ఎండినచోట నీళ్ల కాలువలవలెను, అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను” ఉండునట్లు నిరూపించుకోగలరు. (యెషయా 32:2) వారిచ్చే సహాయమునుండి పూర్తి ప్రయోజనము పొందుము.d

అయితే, అట్టి పెద్దలు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ స్వంత క్రియలవల్ల కలిగే పరిణామాలనుండి మిమ్మల్ని సంరక్షించలేరు. కమింగ్‌ ఆఫ్‌ డ్రింక్‌ అనే ప్రచురణ యిలా వివరిస్తున్నది: “త్రాగుబోతులకు చేసే చికిత్సలో కీలకమైన విషయమేమంటే, వారి దురలవాటువల్ల కలిగే విపత్కర పరిణామాలు వారికిచెప్పి, వారి ప్రవర్తనకు వారే బాధ్యులని వారిని ఒప్పించడమే.” కాబట్టి, వారు దయగలవారైననూ, మీరు వాస్తవాన్ని ఎదుర్కొనుటకు, సురాపాన సమరంలో విజయం సాధించుటకు అవసరమైన చికిత్సకు, ప్రవర్తనా విధానానికి కట్టుబడియుండుడని ప్రోత్సహించడంలో నిర్మొహమాటంగా ఉంటారు.

బాగుపడ్డం మీ బాధ్యత

ఇతరుల మద్దతుతో మీరు ప్రయోజనం పొందువారైననూ, ఏ మానవుడు లేదా ఆత్మ బలవంతంగా మిమ్మల్ని బాగుచేయలేరని మీరు తెలుసుకోవాలి. మీరు దేనినైనా స్వేచ్ఛగా ఎంచుకునే వ్యక్తిగావున్నారు. చివరకు బాగుపడ్డం మీ బాధ్యతే. (ఆదికాండము 4:7; ద్వితీయోపదేశకాండము 30:19, 20; ఫిలిప్పీయులు 2:12 పోల్చండి.) ఆ బాధ్యతను అంగీకరించండి, అప్పుడు యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. మొదటి కొరింథీయులు 10:13లో మనకిలా అభయమివ్వబడింది: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” కాబట్టి, ధైర్యం తెచ్చుకోండి—సురాపాన సమరంలో మీరు విజయం సాధించగలరు.

[అధస్సూచీలు]

a ఇక్కడ త్రాగుబోతు అని మగవారిని సూచించిననూ, ఇక్కడి సూత్రాలు సరిసమానంగా త్రాగుటకు అలవాటైన స్త్రీలకూ అన్వయిస్తాయి.

b సహాయం అందించగల చికిత్సా కేంద్రాలు, వైద్యశాలలు ఇతర రికవరీ కార్యక్రమములు అనేకం ఉన్నాయి. ఈ కావలికోట ప్రత్యేకంగా ఫలాని చికిత్స అని చెప్పదు. ఒకడు లేఖన సూత్రాల విషయంలో రాజీపడే కార్యక్రమాల్లో యిమిడియుండకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే, చివరకు చెప్పొచ్చే విషయమేమంటే, ప్రతివారు తనకు ఎటువంటి చికిత్సా విధానం అవసరమో స్వంతగా తీర్మానించుకోవాలి.

c కీర్తనల కొన్ని ఉదాహరణలు 8, 9, 18, 19, 24, 51, 55, 63, 66, 73, 77, 84, 86, 90, 103, 130, 135, 139, 145.

d పెద్దలకు సహాయకరమగు సలహాలు ది వాచ్‌టవర్‌ మే 1, 1983, పుటలు 8-11 నందు కలవు.

[24వ పేజీలోని బాక్సు]

మీరు బహుశ మద్యపానంవల్ల కలిగే హీనతను, దుఃఖాన్ని అనుభవిస్తుండవచ్చు. అట్లయిన, నిరాశ చెందకండి. సహాయం అందుబాటులోవుంది.

[26వ పేజీలోని బాక్సు]

మీరు తిరిగి దానికిలోనైతే

“తిరిగి దాని అలవాటుకు సిద్ధపడ్డం అగ్నిప్రమాదం తప్పించుకోవడానికి సిద్ధపడుటవంటిదే. అంటే నిప్పంటుకుంటుందని ఎదురుచూడ్డం కాదుగాని జరుగబోయే దానికి బాధ్యత వహించుటకు మీరు సిద్ధపడుటని దాని భావం” అని విల్‌పవర్స్‌ నాట్‌ ఇనఫ్‌ అనే పుస్తకం చెబుతున్నది. మీరు తిరిగి అలవాటుపడు పొరపాటే చేస్తే:

□ యెహోవాకు ప్రార్థించండి. ఆయన మన సమస్యను అర్థం చేసుకుంటాడని, మనకు సహాయం చేయుటకు ఇచ్ఛయిస్తున్నాడనే అభయం కలిగివుండండి.—కీర్తన 103:14; యెషయా 41:10.

□ అవసరమేర్పడినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్లాలో ముందుగానే నిర్ణయించుకొన్నవారై వెళ్లి ఆ క్రైస్తవ పెద్దకు విషయం తెల్పండి. జరిగిన విషయంలో యథార్థంగా ఉండి, ఆయనిచ్చే లేఖన సలహాను జాగ్రత్తగా వినండి.

□ నిరాశ చెందకుండా జాగ్రత్తగా ఉండండి. ఆత్మన్యూనతా భావం మిమ్మల్ని మరలా ఊబిలోకి దించుతుంది, కాబట్టి మీ పొరపాటును సరియైన దృక్పథంతో చూడండి. మీరొకసారి ఓడిపోయారంటే దానర్థం యుద్ధంలో మీరు పూర్తిగా ఓడిపోయారని కాదు. ఎక్కువదూరం పరుగెత్తే మారథాన్‌ క్రీడాకారుడు క్రిందపడితే, లేచి ప్రారంభ గీత దగ్గరకు తిరిగి వెళ్లడు, వెంటనే లేచి తన పరుగు కొనసాగిస్తాడు. మీరు బాగుపడే విషయం కూడా అంతే. మీరింకా మార్గమందే ఉన్నారు. మద్యపానాన్ని మీరు మానేసిన వారాలు, నెలలు లేదా సంవత్సరాలు యింకా మీవెనకే ఉన్నాయి.

[25వ పేజీలోని చిత్రం]

మిమ్మల్నిమీరు గట్టిగా, యథార్థంగా పరిశీలించుకుంటూ నిరాకరింపును ఎదిరించండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి