“మాట్లాడుకోవడం మాకెందుకో తగనిరీతిగా కన్పిస్తోంది!”
న్యాయవాది, మైఖేల్ వాగ్దాటి తిరుగులేనిది. ఆయన వృత్తికి అది అత్యవసరం. కాని ఇంట్లో భార్య ఆడ్రియన్ వద్దకు వచ్చేసరికి ఆయన సంభాషణా నైపుణ్యాలు మాయమై పోతున్నాయని వివాహమైన 16 సంవత్సరాలకు ఆయన గుర్తించాల్సి వచ్చింది. “ఆండ్రియన్ నేనూ, ఎప్పుడూ దానిమీదనో దీని మీదనో వంకబెట్టి ప్రతిచిన్న విషయానికి విమర్శించుకోవడం ఎప్పుడూ ఒకరితో ఒకరం ఏకీభవించకుండా కేకలతో పోట్లాడుకునే వాళ్లం, నాకైతే అలా చివరకు విసుగుతో అలసిపోతామేమోనని అనిపించేది. వివాహం అంటే ఇలాంటిదేయైతే అది అసంతృప్తికి, కలతకు ఎడతెగని నిలయమేనని నా కనిపిస్తుంది. మా జీవితమంతా ఇదే పరిస్థితియైతే నేను దానినుండి తప్పించుకొని పోవలనుకున్నాను. నేను తమాషాగా అనడం లేదు. ఇరవై, ముప్పయి, నలభై యేండ్లు ఈ విధమైన ఎడతెగని కలతను, ఒత్తిడిని భరించలేను” అని మైఖేల్ తలపోస్తున్నాడు.
ఇలాంటి మనోభావాలు కేవలం మైఖేల్, ఆండ్రియాన్లకు మాత్రమే పరిమితం కాదు. గొడవలు మొదలవడం తగ్గిపోవడంవంటి సంబంధంతో బ్రతికే అనేకమంది దంపతుల మధ్య ఇవి వాస్తవరూపమై ఉన్నాయి. చాలా సున్నితమైన సంభాషణ అలా పెద్ద వాగ్యుద్ధంగా మారుతుంది. వారికి అనని మాటలు వినపడతాయి. అనుకోని మాటలను అంటారు. మీదపడి నానా ఆరోపణలుచేసి తిరిగి కక్షతో మౌనం వహిస్తారు. అలా వేరై విడిపోలేరు, లేదా నిజంగా ‘యేక శరీరమై’ ఉండలేరు. (ఆదికాండము 2:24) వారి మధ్య సంబంధం మృతతుల్యమౌతుంది. వెనక్కి పోదామంటే వేరైపోవడమౌతుంది. ముందుకు పోదామంటే ఎప్పుడూ ఈ పోరాటంతోనే కాలం గడపాల్సొస్తుంది. వీటిలో ఏ బాధను భరించలేక, దంపతులిరువురు భావోద్రేకంగా సాధ్యమైనంతవరకు ఒకరికొకరు దూరంగా మెలగుతుంటారు.
అటువంటి దంపతులు వారి వివాహానికి ‘నైపుణ్యవంతమైన’ నడిపింపును సంపాదించుకోవలసిన అవసరముంది. (సామెతలు 1:5) ఈ నడిపింపు దేవునివాక్యమైన బైబిలులో లభ్యమౌతుంది. బైబిలు “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును” ప్రయోజనకరమైనదని పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రూఢిపరుస్తుంది. (2 తిమోతి 3:16) వివాహబంధంలోని పరస్పర సంభాషణ దెబ్బతిన్నప్పుడు దానిని పునరుద్ధరించుటకు అది పనిచేస్తుంది. అది ఎలాగో మనము చూస్తాము.