కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 6/15 పేజీ 32
  • నీవు బైబిలును నమ్మగలవా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీవు బైబిలును నమ్మగలవా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 6/15 పేజీ 32

నీవు బైబిలును నమ్మగలవా?

నీవొక బైబిలును తీసుకొంటే, దానిలో ఒక నాణెం దొరకాలని నీవు అపేక్షింతువా? ఈ ప్రాచీన వెండినాణెము సంగతేమిటి?

బైబిలు వింతైన కథలు, విస్మయమగు నైతిక విలువలను కలిగియున్న ప్రాచీన పుస్తకమని అనేకులు తలస్తారు. అయినా, బైబిలు వృత్తాంతములు కచ్చితమైన చరిత్రాధారముగలవని వారు నమ్మరు, కావున దానిని దేవుని వాక్యమని చెబితే వారు ఒప్పుకోరు. అయితే, బైబిలు ప్రామాణికత్వానికి కావలిసినంత సాక్ష్యాధారమున్నది. ఈ నాణెము (భూతద్దములో పెద్దగా చేయబడి) ఒక మంచి దృష్టాంతముగా ఉంది. దీని పైవ్రాత తెల్పేదేమిటి?

ఈ నాణెము తార్సులో అనగా ప్రస్తుతము టర్కీకి ఆగ్నేయంగావున్న భూభాగమందుండిన ఒక పట్టణములో తయారుచేయబడింది. సా.శ.పూ. నాల్గవ శతాబ్దమందలి పారశీక గవర్నరుయైన మాజవుస్‌ పరిపాలనా కాలములో ఈ నాణెము ముద్రించబడింది. ఇది ఆయనను “నది యివతల” అంటే యూప్రటీసు నది యివతల ప్రాంతానికి గవర్నరని గుర్తిస్తున్నది. అయితే ఆ పదము మనకెందుకంత ఆసక్తిని కల్గిస్తున్నది?

ఎందుకంటే అదే పదవిని నీవు నీ బైబిలునందు కనుగొంటావు. పారశీక రాజైన దర్యావేషు, గవర్నరైన తత్తెనై మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఎజ్రా 5:6-6:13 తెల్పుచున్నది. యూదులు యెరూషలేములో తమ మందిరాన్ని పునర్నిర్మించుకొనుట వారి చర్చనీయాంశము. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని నైపుణ్యంగా నకలు చేసేవాడు, కనుక ఆయన వ్రాసింది సరియైనదిగా, కచ్చితంగా ఉంటుందని నీవపేక్షించవచ్చు. తత్తెనై “నది యివతల అధికారి” అని ఎజ్రా 5:6 మరియు 6:13 లో పేర్కొనబడడం నీవు చూస్తావు.

ఈ నాణెము ముద్రించబడక ముందు 100 సంవత్సరాల పూర్వమే ఎజ్రా దీనిని దాదాపు సా.శ.పూ. 460లో రచించాడు. ఒక ప్రాచీన అధికారి పదవిని పేర్కొనడం అతిసామాన్య వివరమని కొంతమంది తలంచవచ్చును. అయితే అంత చిన్న విషయంలో నీవు బైబిలు గ్రంథకర్తలపై ఆధారపడగల్గినప్పుడు, వారు వ్రాసిన మిగతావాటిపై నీ నమ్మకాన్ని అది వృద్ధిచేయవలదా?

అట్టి నమ్మకానికి దోహదపడే అదనపు కారణాలను ఈ సంచిక నందలి మొదటి రెండు శీర్షికలందు నీవు కనుగొనగలవు.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

Collection of Israel Dept. of Antiquities Exhibited & photographed Israel Museum

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి