పాఠకుల ప్రశ్నలు
క్రైస్తవులు డబ్బును పందెంకాయరు గనుక బహుమతులను గెలుచుకోగల టిక్కెట్లను తీసుకొనడం గాని, వాటిలో పాల్గొనడం గాని చేస్తారా?
ఈ ప్రశ్న అనేక పర్యాయములుత్పన్నమైనది, గనుక దీనిని గూర్చి మా ప్రచురణలలో యిదివరకే ప్రచురించాము. మాకున్న సాహిత్యాల ఇండెక్సును అనగా వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 1930-1985 (ఆలాగే 1986-1990 వరకు వున్న వాటితో కూడిన ఇండెక్సు) వంటివాటిని కొన్ని భాషలలో లభ్యమయ్యేటట్లు చేశాము. ఒక క్రైస్తవుడు అట్టి ఇండెక్స్‌లను తన భాషలో కలిగియుంటే సంతృప్తికరమైన సమాధానములను వెంటనే కనుగొనడానికి అవి ఎంతగానో సహాయపడతాయి.
పైన అడుగబడిన ప్రశ్న ఒక ఉదాహరణ. అందుకు 1930-1985 ఇండెక్స్ నందు “క్వశ్చన్స్ ఫ్రమ్ రీడర్స్” అనే శీర్షిక క్రింద “‘డ్రాయింగ్స్,’ మే క్రిస్టియన్ ఏక్సెప్ట్ టిక్కెట్ ఫర్?” అనే ఉపశీర్షికను కనుగొంటాడు, ది వాచ్‌టవర్ ఫిబ్రవరి 15, 1973 పేజి 127 నందలి “క్వశ్చన్స్ ఫ్రమ్ రీడర్స్” అనే భాగమును చూడుమని పాఠకునికి సూచించబడింది.a ది వాచ్‌టవర్ 1973 బౌండ్ వాల్యూమ్‌లు (లేదా విడి పత్రికలు) అనేకమంది సాక్షులవద్ద వున్నాయి, లేదా అనేక రాజ్యమందిరాల గ్రంథాలయములలో దానిని చూడవచ్చును.
బహుమానమును గెలుచుకొనేందుకు ద్రవ్యాన్ని వెచ్చించడం లేదా పందెములు కాయడం, అదృష్టం మీద గెల్చుకొనే లాటరీల (లాటరీ టిక్కట్ల వంటివి) జోలికి క్రైస్తవులు ఏమాత్రం పోకూడదని 1973లో ప్రచురించబడిన చర్చలో సూచించబడింది. ఒక్క మాటలో తేల్చి చెప్పాలంటే, మనం జూదమాడము. నిజంగా అది లోభత్వమే అవుతుంది.—1 కొరింథీయులు 5:11; 6:10; ఎఫెసీయులు 4:19; 5:3, 5.
అయితే, ఒక దుకాణముగాని, వ్యాపారముగాని, వ్యాపార ప్రకటన నిమిత్తము అట్టి లాటరీ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఒక వస్తువు కొనకుండానే తన పేరును లేదా ఒక పత్రము లేక టిక్కెట్‌ను పంపవచ్చును. లాటరీ తీయుట వ్యాపార ప్రకటన పథకంలో ఒక భాగం; ఎవరికి బహుమానం లేదా బహుమానములు యివ్వాలో అనేది నిష్పక్షపాతంగా నిర్ణయించబడునట్లు అది ఏర్పాటుచేయబడింది. ఒక వ్యాపార సంస్థ, లేదా దుకాణం తన వ్యాపార ప్రకటనా పథకములో యిచ్చే ఉచిత వస్తువులను లేదా యితర బహుమానములను అంగీకరించినట్లు జూదము యిమిడియుండని లాటరీ పద్ధతి ద్వారా బహుమతులను తాము అంగీకరించవచ్చునని కొంతమంది క్రైస్తవులు తలంచవచ్చును.
అయితే, కొంతమంది క్రైస్తవులు యిలాంటి వేటినైననూ విసర్జించి యితరులను అభ్యంతర పెట్టడానికి లేదా సంశయంలో పడవేయడానికి యిష్టము లేక, అదృష్ట దేవత యందు నమ్మికయుంచే మోసములో పడిపోకుండా దూరంగా వుంటున్నారు. యెషయా 65:11 చూపినట్లుగా దేవుని సేవకులు “అదృష్టముతో” లేదా “అదృష్టదేవితో” సంబంధము పెట్టుకొనరు. విజేతలు పాల్గొనవలసిన ప్రకటనలో భాగంవహించుటకు యిష్టపడమని కూడా వారు భావిస్తుండవచ్చు. ఇలా భావించేవారు అలాంటి వాటిలో పాల్గొనునట్లు తమ మనస్సాక్షి ప్రేరేపించబడిన క్రైస్తవుని లేదా క్రైస్తవులను నిశ్చయంగా విమర్శించకూడదు—రోమీయులు 14:1-4 పోల్చండి.
[అధస్సూచీలు]
a అదే సమాచారము, “ఎడ్వర్‌టైజింగ్,” “బిజినెస్,” “గేంబ్లింగ్” అనే శీర్షికల క్రింద యివ్వబడింది, కావున సమాచారమును కనుగొనడానికి ఇండెక్స్‌లో వున్న పలువిషయాలు సహాయపడగలవు.