కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 6/1 పేజీలు 19-22
  • మీ సంతోషానికి కావల్సిందేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ సంతోషానికి కావల్సిందేమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ద్రవ్యాన్ని ప్రేమించువారు తృప్తినొందరు
  • సంతోషం సంపాదించవచ్చు కాని ఎలా?
  • ఆత్మీయావసరతల్ని గుర్తించుట
  • యెహోవా యందు నమ్మకముంచుట
  • దైవ గద్దింపును అంగీకరించుట
  • నిర్మలులుగాను, సమాధానమును ప్రేమించువారిగా ఉండుట
  • సహనం చూపుట
  • ఇప్పుడు, నిరంతరం సంతోషాన్ని కనుగొనుట
  • యెహోవాను సేవించుటలో నిజమైన సంతోషము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ‘సంతోషంగల దేవుణ్ణి’ ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఐశ్వర్యం మీకు సంతోషాన్ని ఇవ్వగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నిజమైన సంతోషం ఎక్కడ కనుగొనబడగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 6/1 పేజీలు 19-22

మీ సంతోషానికి కావల్సిందేమిటి?

ప్రజలెన్నుకున్న రాజకీయ నాయకులు ఆ ప్రజల్ని సంతోషపరచడానికి గట్టిగా కృషిచేస్తారు. చెప్పాలంటే వారి పనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే పోలాండ్‌లో “భ్రమతొలగిన, విలక్షణమైన ఓటరును” గూర్చి ఒక వార్తాపత్రిక మాట్లాడుతుంది. అమెరికా సమాజం “అపనమ్మక సాధారణ రాజకీయాలతో నిండిపోయింది” అని ఒక పత్రికా రచయిత తెలియజేస్తున్నాడు. “ఫ్రాన్సులో పెరుగుతున్న రాజకీయ ఉదాసీనతను” గూర్చి మరో రచయిత మనకు తెల్పుతున్నాడు. ఈ మూడు దేశాలకు మాత్రమే పరిమితంకాని అటువంటి బహుళవ్యాప్త ఉదాసీనత, అసంతృప్తి ప్రజల్ని సంతోషపెట్టే తమ ప్రయత్నాలందు రాజకీయ నాయకులు విఫలమౌతున్నారని సూచిస్తున్నది.

మతనాయకులు కూడ, ఈ జీవితంలో కాకుంటే కనీసం బావిజీవితంలోనైనా సంతోషముంటుందని వాగ్దానం చేస్తారు. మానవులకు అమర్త్యమైన లేదా పరకాయ ప్రవేశంచేసే ఆత్మ ఒకటివుందనే విషయంపై ఆధారపడి వాదిస్తారు. వివిధ కారణాల్నిబట్టి, పైగా బైబిలు స్పష్టంగా దీన్ని నిరాకరిస్తుందని అనేకమంది ప్రజలు ఈ తలంపును తృణీకరిస్తారు. సంతోషానికి మతం అగత్యమని లక్షలాదిమంది ఎంతమాత్రం పరిగణించుటలేదని నిర్జనంగా ఉన్న చర్చీలు, తరిగిపోతున్న వాటి సభ్యుల సంఖ్య చూపిస్తున్నవి.—ఆదికాండము 2:7, 17; యెహెజ్కేలు 18:4, 20 పోల్చండి.

ద్రవ్యాన్ని ప్రేమించువారు తృప్తినొందరు

ఇటు రాజకీయాల్లో కాక, అటు మతంలో కాక మనం మరెక్కడ సంతోషాన్ని కనుక్కోగలం? వాణిజ్య రంగంలోనా? ఇదికూడ సంతోషాన్నివ్వగలదని చెప్పబడింది. సమస్త వస్తు సంపదను కలిగియుండడం ద్వారా, డబ్బుకొనగల సేవల ద్వారా సంతోషం కలుగుతుందని అనేకమాటలు పలుకుతూ, వ్యాపార ప్రకటనల ద్వారా ఇది సమర్థించుకుంటుంది.

ఈ విధంగా సంతోషాన్ని వెదికే ప్రజల సంఖ్య పెరుగుతున్నట్లు కనబడుతుంది. జర్మనీలో 50 శాతం కుటుంబాలు తీవ్రమైన అప్పుల్లోవున్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం రిపోర్టుచేయబడింది. కాబట్టి, ప్రఖ్యాత జర్మనీ వార్తాపత్రికయగు డీ ట్సిట్‌ “[వీరిలో] అనేకమంది ఈ అప్పులనుండి బయటపడే అవకాశం దాదాపు లేనేలేదు” అని ప్రకటించడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అదిలా వివరించింది: “బ్యాంకు అనుమతించిన పరిమితి వరకు ఖాతాలో ఉన్నదానికంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడం ఎంత సులభమో, ఆ రుణ ఉరినుండి బయటపడ్డం అంత కష్టం.”

పారిశ్రామికంగా బహుగా అభివృద్ధిచెందిన దేశాల్లో సహితం పరిస్థితి అదేవిధంగా ఉంది. న్యూయార్క్‌ నందలి సిటీ విశ్వవిద్యాలయంలో సమాజ శాస్త్రజ్ఞునిగానున్న డేవిడ్‌ కాప్లొవిట్జ్‌ కొన్ని సంవత్సరాల క్రితం, అమెరికాలో రెండు కోట్ల నుండి రెండున్నర కోట్లమంది తీవ్రంగా అప్పుల్లో మునిగివున్నారని అంచనావేశాడు. “ప్రజలపై తీవ్ర అప్పుల భారమున్నది, అది వారి జీవితాల్ని పాడుచేస్తున్నదని” ఆయన చెప్పాడు.

అది సంతోషం అన్నట్లు ఏమాత్రం కన్పించడం లేదు. అయితే మిగిలినవి రెండు (రాజకీయం, మతం) సాధించలేనిది వాణిజ్య రంగం సాధించగలదని మనమపేక్షించవలెనా? సుసంపన్నుడైన సొలొమోను రాజు ఒకసారి యిలా వ్రాశాడు: “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు; ఇదియూ వ్యర్థమే.”—ప్రసంగి 5:10.

వస్తుసంపద యందు సంతోషాన్ని వెదకువారు గాల్లో మేడలు కట్టేవారిగా ఉంటారు. గాల్లో మేడలు కట్టడం ఉల్లాసకరమే గాని వాటిలో నివసింప ప్రయత్నించడం మీకెన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది.

సంతోషం సంపాదించవచ్చు కాని ఎలా?

అపొస్తలుడైన పౌలు యెహోవాను “సంతోషంగల దేవుడని” పిలుస్తున్నాడు. (1 తిమోతి 1:11 NW) అట్టి సంతోషంగల దేవుడు తన స్వరూపమందు మానవులను సృష్టించుట ద్వారా వారుకూడ సంతోషంగా ఉండే సామర్థ్యాన్ని వారికిచ్చాడు. (ఆదికాండము 1:26) అయితే కీర్తనల రచయిత చూపినట్లుగా వారి సంతోషం దేవుని సేవించుటపై ఆధారపడి ఉంటుంది: “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.” (కీర్తన 144:15) న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో “సంతోషించుము,” “సంతోషము” అనే పదాలున్న 110 స్థలాల్లో కొన్నింటిని మనం పరిశీలించినట్లయిన, దేవునికి మనంచేసే సేవయందు ఇమిడియున్నదేమి, ఆయనను సేవించుట నిజమైన సంతోషానికి ఎలా నడుపుతుందో మనం మరిచక్కగా అర్థంచేసుకోగలం.

ఆత్మీయావసరతల్ని గుర్తించుట

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రఖ్యాత కొండమీది ప్రసంగంలో యిలా చెప్పాడు: “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు.” (మత్తయి 5:3 NW) సంతోషానికి విలాస వస్తువులు కొంటేచాలని తప్పుగా తలంచేటట్లు చేయడానికి వాణిజ్య ప్రపంచం ప్రయత్నిస్తున్నది. అది మనతో యిలా చెప్తుంది, ఇంట్లో ఒక కంప్యూటర్‌, ఒక వీడియో కెమెరా, ఒక టెలిఫోను, ఒక కారు, అత్యాధునిక క్రీడాసామగ్రి, ఆడంబరమైన దుస్తులు కలిగివుండడమే ధన్యత. కోట్లాదిమందికి ఇవి లేవు అయినా వారు అసంతోషంగా లేరని అది మనకు చెప్పదు. ఇవి జీవితాన్ని మరింత సుఖవంతం, అనుకూలవంతం చేస్తున్ననూ, సంతోషానికి మాత్రం అవి అగత్యం కావు.

తమ ఆత్మీయావసరతల యెడల శ్రద్ధగలవారు పౌలువలెనే ఇట్లంటారు: “అన్నవస్త్రములు గలవారమైయుండి వాటిలో తృప్తిపొందియుందము.” (1 తిమోతి 6:8) ఎందుకు? ఎందుకనగా ఆత్మీయావసరతలు తీర్చుకొనుటే నిత్యజీవమునకు నడిపిస్తుంది.—యోహాను 17:3.

కొనడానికి మనదగ్గర డబ్బుంటే మంచి సంగతుల ననుభవించడం తప్పా? ఎంతమాత్రం కాదు. అయినప్పటికిని, కేవలం మనం కొనగలం కాబట్టి కొందామని లేదా ప్రతిదాన్ని కొనే భ్రమలో పడకుండా ఉండడం నేర్చుకుంటే అది మన ఆత్మీయతను బలపరుస్తుంది. ఆ విధంగా, లోకరీత్యా ఆయన ఆర్థిక పరిస్థితి అంతగా లేకపోయిననూ యేసువలెనే మనంకూడ తృప్తికలిగివుండి మన సంతోషాన్ని కాపాడుకుంటాము. (మత్తయి 8:20) “నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను” అని చెప్పినప్పుడు పౌలు అసంతోషాన్ని వ్యక్తపర్చడం లేదు.—ఫిలిప్పీయులు 4:11, 12.

యెహోవా యందు నమ్మకముంచుట

ఆత్మీయావసరతల యెడల ఒకడు శ్రద్ధ కలిగియుండుట దేవునియందు నమ్మకముంచడానికి చూపే ఇష్టతను సూచిస్తుంది. “యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు” అని సొలొమోను రాజు వివరించినట్లుగా, దేవునియందలి నమ్మకం సంతోషాన్నిస్తుంది.—సామెతలు 16:20.

అనేకమంది ప్రజలు దేవునికి బదులుగా తమ ధనసమృద్ధియందు, వస్తుసంపదయందు తమ నమ్మకాన్ని ఉంచడం వాస్తవం కాదా? ఈ భావం దృష్ట్యా చూసినట్లయిన, “మేము దేవునియందు నమ్మిక ఉంచాము” అనే వాక్యం అమెరికా కరెన్సీ మీద కన్పించిననూ, డబ్బుమీద అలా వ్రాయడంకంటే అయుక్తమైన స్థానం మరొకటి ఉండజాలదు.

డబ్బు కొనగల మంచి సంగతుల్లో ఏదియూ కొదువగా లేని సొలొమోను రాజు, వస్తుసంపత్తినందు నమ్మకముంచడం శాశ్వత సంతోషానికి నడిపించదని గుర్తించాడు. (ప్రసంగి 5:12-15) బ్యాంకు దివాలా తీయడం లేదా ద్రవ్యోల్బణం కారణంగా బ్యాంకులో డబ్బుపోగలదు. గొప్ప తుఫానుల కారణంగా ఇళ్లు నాశనం కాగలవు. పాక్షికంగా సంపద నష్టాలను పూడ్చే భీమా పాలసీలు ఎన్నడూ భావోద్రేక నష్టాలను పూరించవు. అకస్మాత్తుగా దలాల్‌ మార్కెట్టు పడిపోవడంతో స్టాకులు బాండ్లు ఒక్కరాత్రిలోనే విలువలేనివై పోవచ్చు. మంచి ఆదాయంగల ఉద్యోగాలు సహితం అనేక కారణాల్నిబట్టి ఈ రోజు ఉంటున్నాయి రేపు ఊడిపోతున్నాయి.

ఈ కారణాల్నిబట్టి యెహోవాయందు నమ్మకముంచువాడు యేసు యిచ్చిన హెచ్చరికను లక్ష్యపెట్టడంలో జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.”—మత్తయి 6:19, 20.

అన్నివేళలా కావల్సింది సమకూర్చే సర్వశక్తిగల దేవున్ని నమ్మానని ఒకడు తెలుసుకొనుటకంటె గొప్పదైన సురక్షితా భావం, సంతోష భావం మరెక్కడ ఉండగలదు?—కీర్తన 94:14; హెబ్రీయులు 13:5, 6.

దైవ గద్దింపును అంగీకరించుట

నిజమైన స్నేహితుడు ప్రేమతో సలహాను, చివరకు గద్దింపును ఇచ్చినప్పుడు అది స్వీకరించబడుతుంది. దేవుని సేవకుడైన యోబు స్నేహితుడనని చెప్పుకొనిన వ్యక్తి ఒకసారి స్వనీతితో ఆయనకిట్లు చెప్పాడు: “దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు.” ఎలీఫజు పలికిన ఆ మాట సత్యమైననూ, ఆయన మాటల అన్వయభావము, అనగా యోబు గంభీరమైన తప్పిదముచేసిన దోషి అనేది సత్యంకాదు. అతడెంత ‘బాధకు కర్తగా’ ఉండెను! ఆ తర్వాత యెహోవా ప్రేమతో యోబును గద్దించినప్పుడు, యోబు అట్టి గద్దింపును అంగీకరించి మిగుల ధన్యుడయ్యాడు.—యోబు 5:17; 16:2; 42:6, 10-17.

నేడు దేవుడు యోబుతో మాట్లాడినట్లు తన సేవకులతో సూటిగా మాట్లాడడు. బదులుగా, ఆయన తన వాక్యము ద్వారా, తన ఆత్మ నడిపింపుగల సంస్థద్వారా వారిని గద్దిస్తాడు. అయితే వస్తుసంపత్తిని వెంటాడే క్రైస్తవులకు బైబిలును పఠించడానికి, యెహోవా సంస్థ ఏర్పాటుచేసే కూటాలన్నింటికి హాజరు కావడానికి తరచు సమయము, శక్తి లేదా ప్రేరణ ఉండదు.

సామెతలు 3:11-18 కనుగుణ్యంగా దేవుడు గద్దించు వ్యక్తి, అటువంటి గద్దింపును అంగీకరించుటలోని జ్ఞానాన్ని గుర్తిస్తాడు: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు. పగడములకంటె అది ప్రియమైనది, నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు. దాని కుడిచేతిలో దీర్ఘాయువును, దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.”

నిర్మలులుగాను, సమాధానమును ప్రేమించువారిగా ఉండుట

సంతోషంగల ప్రజలను “హృదయశుద్ధిగలవారు,” “సమాధానపరచువారు” అని యేసు వర్ణించాడు. (మత్తయి 5:8, 9) అయితే వస్తుసంపత్తిగల జీవన విధానాన్ని ప్రోత్సహించే ఈ లోకమందు మన హృదయాల్లో స్వార్థపూరితమైన, చివరకు అశుద్ధమైన కోరికలు వేళ్లూనుకొనుట ఎంత సులభం! దైవజ్ఞానంచే నడిపించబడనట్లయిన, ఇతరులతో మన సమాధానకర సంబంధాలను పాడుచేయు సందేహాస్పదమైన ఆర్థిక స్తోమతకొరకు ప్రయత్నించే మోసంలో పడిపోవడం మనకెంత సులభం! బైబిలు అకారణంగా యిలా హెచ్చరించడం లేదు: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”—1 తిమోతి 6:10.

ధనాపేక్ష అసంతృప్తిని, కృతఘ్నతను, దురాశను పెంచే అహంభావాన్ని కలుగజేస్తుంది. అలాంటి స్వభావం వృద్ధికాకుండా అడ్డుకోవడానికి, కొంతమంది క్రైస్తవులు పెద్దపెద్ద ఆర్థిక నిర్ణయాలు చేయకముందు, తమనుతాము ఇలా ప్రశ్నించుకుంటారు: ఇది నిజంగా నాకు అవసరమా? నేనింత ఖరీదైనది కొనడం లేదా ఇవేవీ లేకుండా జీవించే లక్షలాదిమందికంటె ఎక్కువ సమయాన్ని కోరే ఎక్కువ ఆదాయంగల ఉద్యోగం నాకవసరమా? ప్రపంచవ్యాప్త ప్రకటించు పనికి మద్దతునిచ్చుట ద్వారా, లేదా నాకంటె దురదృష్టవంతులైన ప్రజలకు సహాయం చేస్తూ సత్యారాధనలో నా భాగాన్ని మరియెక్కువ చేయుటకు నా ధనాన్ని లేదా సమయాన్ని నేను మరి శ్రేష్ఠముగా వెచ్చించగలనా?

సహనం చూపుట

సహించడానికి యోబు ఎదుర్కొనిన శోధనల్లో డబ్బు లేకపోవడం ఒకటి. (యోబు 1:14-17) ఆయన మాదిరి చూపినట్లుగా, సహనమనేది జీవితమందలి ప్రతివిషయంలో చూపించాల్సిన అవసరముంది. కొందరు క్రైస్తవులు హింసను సహించాలి; ఇంకొందరు శోధనను; మరికొందరు ఆదర్శప్రాయంగా లేని ఆర్థిక పరిస్థితుల్ని సహించాలి. అయితే, “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము” అని క్రైస్తవ శిష్యుడైన యాకోబు యోబును సూచిస్తూ వ్రాసినట్లుగా, ప్రతివిధమైన సహనానికి యెహోవా ప్రతిఫలమిస్తాడు.—యాకోబు 5:11.

మన ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపర్చుకోవడానికి ఆత్మీయాసక్తులను నిర్లక్ష్యం చేయడం వలన తాత్కాలిక ఆర్థిక లాభాన్ని తీసుకురావచ్చు గాని దేవుని రాజ్యంక్రింద శాశ్వత ఆర్థిక లాభాన్ని గూర్చిన మన దృష్టిని ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుందా? అటువంటి ప్రమాదాన్ని ఆహ్వానించుట మంచిదేనా?—2 కొరింథీయులు 4:18.

ఇప్పుడు, నిరంతరం సంతోషాన్ని కనుగొనుట

మానవుల సంతోషానికి కావల్సిందేమిటనే విషయంలో యెహోవా దృష్టితో కొంతమంది విభేదిస్తారు. మరి ప్రాముఖ్యమైన దీర్ఘకాలిక ప్రయోజనాల్ని నిర్లక్ష్యంచేస్తూ వారు దేవుని సలహాల్లో ఇప్పుడు ప్రయోజనం లేదనుకుంటారు. వస్తుసంపత్తిపై నమ్మకముంచడం నిరర్థకమని, అది నిరుత్సాహానికి నడిపిస్తుందని వారు గ్రహించరు. బైబిలు రచయిత సరిగా యిలా ప్రశ్నిస్తున్నాడు: “ఆస్తియెక్కువైన యెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు; కన్నులార చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజనమేమి?” (ప్రసంగి 5:11; ప్రసంగి 2:4-11; 7:12 కూడ చూడండి.) మనం కోరితెచ్చుకున్న వాటిపై మన ఆసక్తి ఎంత త్వరగా సన్నగిల్లిపోతుంది, అవి కేవలం షెల్ఫ్‌కే పరిమితమై దుమ్ముపట్టడం జరుగుతుంది!

వస్తుదాయకంగా ‘పక్కింటి పిన్నిగారింట్లో ఉన్నవన్నీ తనకూ ఉండాలనే’ వత్తిడికి లొంగిపోవడాన్ని ఒక క్రైస్తవుడు అనుమతించడు. ఒకడు కలిగియున్న దానిబట్టి గాక, నిజంగా అతడెలాంటి వాడనేదానిపై విలువ లెక్కించబడుతుందని అతనికి తెలుసు. ఒకవ్యక్తి సంతోషంగా ఉండాలంటే, అంటే నిజమైన సంతోషానికి, యెహోవాతో సన్నిహిత సంబంధమేర్పరచుకొని, ఆయన సేవలో పనిరద్దీగా ఉండడం అవసరమని అతనికి తెలుసు.

[20వ పేజీలోని చిత్రం]

వస్తుసంపత్తి మాత్రమే ఎన్నడూ శాశ్వత సంతోషాన్ని తీసుకురాదు

[22వ పేజీలోని చిత్రం]

బైబిలిట్లు చెప్తున్నది: “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి