కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/15 పేజీ 32
  • వీరిలో ఒకరివలె మీరున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వీరిలో ఒకరివలె మీరున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/15 పేజీ 32

వీరిలో ఒకరివలె మీరున్నారా?

‘నూరేళ్లు గొర్రెవలె జీవించేకన్నా ఒక్కరోజు సింహంవలె జీవించడం మేలు.’ ఒకప్పటి ఇటలీ నిరంకుశాధికారి, బెనిటో ముస్సోలినీకి ఈ మాటలు ఆపాదించబడినవి.

ముస్సోలినీవలే అనేక మంది ప్రజలు తమను గొర్రెలుగా లేక గొర్రెపిల్లగా వర్గీకరించుటను నిరాకరిస్తారు. అయితే, ప్రాచీన ఇశ్రాయేలీయుల కీర్తన కర్త, మరియు రాజైన దావీదు ఇలా అన్నాడు: “యెహోవా నా కాపరి. . . . పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు.” (కీర్తన 23:1, 2) అవును, యెహోవా దేవుడు మహాగొప్ప కాపరియైయున్నాడు. హానికరముకాని గొర్రెలవలే ఆయన తన ప్రజలకు ప్రేమపూర్వక ఆదరణనందిస్తాడు.

కీర్తన 95:7లో (NW) దేవుని ప్రజలు సూచనార్థక గొర్రెలుగా పోల్చబడ్డారు. అక్కడ ఇలా వ్రాయబడివుంది: “మనమాయన పాలించు గొర్రెలము ఆయన మేపు ప్రజలము.” ఇచ్చట కీర్తనల రచయిత “ఆయన పాలించు ప్రజలము” “ఆయన మేపు గొర్రెలము” అని అనవలసిందని కొందరు తలంచారు. అయితే, ఇక్కడ వాటి భావాలు ఒకదాని స్థానంలో మరొకటిగా ఉన్నాయి. యెహోవా ప్రజలు తామే గొర్రెలుగా గుర్తించబడుతున్నారు. ఇచ్చటవారు దేవునినుండి లభించే పోషణా కార్యక్రమమునుండి ప్రయోజనములను అనుభవిస్తూ, ఆయన ప్రేమపూర్వక పాలనలో నడిపింపబడుతున్నారు.

యెహోవా కుమారుడైన యేసు మంచి కాపరి. ఆయన అనేకమార్లు ప్రజలను గొర్రెలని సంబోధించాడు. ఉదాహరణకు, “చిన్న మంద” మరియు తన “వేరే గొర్రెల” గురించి యేసు మాట్లాడాడు. (లూకా 12:32; యోహాను 10:14-16) వినయశీల గొర్రెలవంటి తన శిష్యులనుగూర్చి యేసు ఇలా అన్నాడు: “నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపలేడు.” (యోహాను 10:27, 28) దయార్ద పరిపాలకుని నీడలో ప్రజలు, ఆయన అధికారం, కృప, నడిపింపు, మరియు రక్షణనుండి ప్రయోజనమును పొందుతారు.—ప్రకటన 1:16, 20; 2:1.

యేసు రక్షణ హస్తమునుండి తన గొర్రెవంటి ప్రజలను ఎవడునూ అపహరింపలేడు. ఈనాడు, ఆయన కృపను పోగొట్టుకున్న “మేకలుగా” లేదా దేవుని పరలోక రాజ్యములో నిత్యజీవమును అనుభవించు “గొర్రెలుగా” ప్రజలను ఆయన వేరుచేస్తున్నాడు. (మత్తయి 25:31-46) ఆశీర్వదింపబడిన అట్టి ప్రజలలో మీరునూ ఒకరని మీరు ప్రదర్శించగలరా? (w93 1/15)

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి