కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/15 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒంటరితనానికి, వివాహానికి సంబంధించిన జ్ఞానయుక్త సలహాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఒంటరి జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • కష్టతరమైన ఆర్థిక సమయాల్లో అవివాహజీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • అవివాహితులుగా ఉన్నా యెహోవా సేవలో సంతృప్తిగా ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/15 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

వివాహమాడుటకు తగిన జీవిత భాగస్వామిని కనుగొనలేకపోతే ఒక క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు ఏం చేయవచ్చును?

సమర్పించుకున్న క్రైస్తవులమైనప్పటికీ, మన హృదయపూర్వక కాంక్ష నెరవేరకపోతే, మనం ఆందోళనచెందుతాం. సామెతలు 13:12లో మన భావాలు చక్కగా వ్యక్తపరచబడినవి. అక్కడ ఇలా వ్రాయబడివుంది: “కోరిక సఫలము కాకుండుటచేత హృదయమునొచ్చును.” పెళ్ళిచేసుకోవాలనే కోరికవుండి, తగిన జీవిత భాగస్వామిని కనుగొనలేకపోయిన కొందరు క్రైస్తవులు ఇలాగే భావించారు. అపొస్తలుడైన పౌలు “కామతప్తులు,” అని వర్ణించిన వారి విషయంలో ఇది ప్రత్యేకముగా వాస్తవమైయుంటుంది.—1 కొరింథీయులు 7:9.

తమకు వ్యతిరేక లింగములో ఒకరియందు నిజమైన సహాయకారిని కనుగొనే కోరికను యెహోవా మానవులలో ఉంచాడు. కాబట్టి, ఒంటరిగావున్న అనేక క్రైస్తవులలో ఇటువంటి ఆవేశాలు కలుగుట సహజమే. (ఆదికాండము 2:18) వివాహము చేసుకోవలసిందేనని (లేక ఒక నిర్దిష్ట వయస్సు వచ్చేప్పటికి వివాహము కావాలని) ఒత్తిడి తెచ్చే సంస్కృతులలో, లేక సంఘంలో ఆనందభరితులైన వివాహితుల మధ్యతో ఒంటరిగా ఉన్న క్రైస్తవులకు ఈ సహజ భావాలు తారాస్థాయికి చేరుకుంటాయి. అయినప్పటికీ, ఇటువంటి చింతను ఎక్కువ సమయంవరకు కొనసాగనివ్వడం మంచిది కాదు. ఈ విషయంలో, అతిగా కలతచెందకుండా యథార్థ క్రైస్తవులు ఎలా వ్యవహరించగలరు?

ఈ పరిస్థితితో వ్యవహరించడం అంత సులభం కాదు, మరియు ఇతరులు, ఈ చింత కేవలం సహజంగా కలిగే ఇబ్బంది లేక అది హెచ్చించబడినదనే భావనతో దానియెడల వ్యవహరించకూడదు. అయితే, ఈ పరిస్థితితో వ్యవహరించడం లేక దానిని పరిష్కరించడం అన్నది ప్రాముఖ్యంగా ఒంటరివారు తీసుకునే చర్యలపైన ఆధారపడుతుంది.

ఆచరణయోగ్యమైన ఈ బైబిలు సూత్రంలో ఒక పరిష్కారాన్ని ఇందుకు కనుగొనగలము: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) ఇవి ఒంటరివాడైన యేసు మాటలు. అలా మాట్లాడటానికి ఆయన సమర్ధుడే. స్వార్ధరహిత దృక్పథంతో ఇతరులకు సహాయపడడం, కోరిక సఫలము కాకుండుటచేతకలిగే వ్యధను అధికమించడానికి మంచి ఔషధం. అయితే ఒంటరి క్రైస్తవుల విషయంలో దీని భావమేమిటి?

మీ కుటుంబానికి, సంఘంలోని ఇతరులకు దయతోకూడిన పనులు చేయుటకు ప్రయత్నించండి, మీ సేవను వృద్ధిపరచుకోండి. ఈ సలహా ‘పనిరద్దీని కలిగియుండండి, పెళ్లాడాలన్న కోరికను మర్చిపోతారు’ అనే వట్టిమాట కాదు. కానేకాదు. ఇటువంటి ఫలభరితమైన క్రైస్తవ గమ్యములలో నిండియుండడంవలన ‘అతడు స్థిరచిత్తుడై, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడు’ అన్నట్లుగా మిమ్ములను మీరు మలచుకొనగలిగి, మీ ప్రస్తుత పరిస్థితులను ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనుటను మీరు కనుగొనగలరు.—1 కొరింథీయులు 7:37.

వివాహము చేసుకోవాలనుకున్న కొందరు, ఆ కోరికను తమ్మును అది దహించివేసే చింతగా మారేటట్లు అనుమతించారు. చివరికి వారు వార్తాపత్రికలలో జతకోసం ప్రకటనలు వేయించేంతమేరకు వెళ్లారు. ఒంటరిగావుండటంవలన కలిగే ప్రయోజనాలను గుణగ్రహించి వాటిపైన తమ అవధానంవుంచడం ఎంతో శ్రేయస్కరం.—“అవివాహితులేగాని, దేవుని సేవకు సంపూర్ణులు”, “ఒంటరిగా యుండుట ఒక ప్రతిఫలదాయక జీవన పద్ధతి” అను శీర్షికలను ఆగస్టు 1, 1992  కావలికోట లోనూ, “వివాహము మాత్రమే సంతోషమునకు కీలకమైయున్నదా?” అనే శీర్షిక కావలికోట మే 1, 1988 లోనూ దయచేసి చూడండి.

మీ ఒంటరితనాన్ని కాపాడుకునే శక్తికొరకై యెహోవానుండి సహాయంకొరకు ప్రార్థించండి. (ఫిలిప్పీయులు 4:6, 7, 13) అనేక అవివాహిత క్రైస్తవులు, దేవుని వాక్యమును పఠించుటలో, దానిని ధ్యానించుటలో మరియు క్రైస్తవకూటములకు హాజరై, దానిలో పాల్గొనడంలో తమ సమయాన్ని వ్యయపరచుటవలన, యేసు తనననుసరించు వారికిచ్చిన వాగ్దానముబట్టి, వారు తమ ‘ప్రాణములకు’ మరింత అధిక ‘విశ్రాంతి’ని అనుభవిస్తున్నారు. (మత్తయి 11:28-30) ఇది వారు ఆత్మీయంగా మంచి అభివృద్ధినొందుటకు సహాయపడుతుంది. భవిష్యత్‌లో ఒకవేళ వారికి తగిన జతదొరికి వివాహము చేసుకున్నట్లైతే, వారు మంచి భర్తగా లేక భార్యగా వుండటానికి సహాయపడుతుంది.

తనను సేవించే అవివాహిత ప్రజల పరిస్థితిని యెహోవా అర్థం చేసుకోగలడన్న విషయాన్ని ఎన్నడూ మరువకూడదు. ప్రస్తుతము మీరనుభవించే పరిస్థితి మీరు కోరింది కాదని మీరు భావించే సంగతి ఆయనకు తెలుసు. మీ ఆత్మీయ మరియు భావోద్రేక చిరకాల ప్రయోజనాల గ్రహింపును, మన ప్రేమగల పరలోకపు తండ్రి కలిగియున్నాడు. మీ మట్టుకు మీరు ఈ విషయాన్ని నమ్మవచ్చును. అదేమనగా: సహనంతో యెహోవాపై ఆధారపడి, ఆయన వాక్యములోని సూత్రాలను మన అను దిన జీవితంలో ఆచరణలో పెట్టినట్లైతే మీకు చిరకాల క్షేమం జరిగేట్లు, మీ అతి ప్రాముఖ్యమైన అవసరతలను ఆయన తీరుస్తాడు.—కీర్తన 145:16 పోల్చండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి