కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 2/15 పేజీ 32
  • ఇది అసాధ్యము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇది అసాధ్యము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 2/15 పేజీ 32

ఇది అసాధ్యము

“ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము.” (మత్తయి 19:24) యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక పాఠము ఉపదేశించడానికే దీనిని చెప్పాడు. అంతకు ముందే ఒక యౌవన అధికారి తన అనుచరుడై అద్భుతమైన ఆత్మీయ అవకాశముల కొరకు ఎదురుచూడమనే యేసు ఆహ్వానాన్ని త్రోసిపుచ్చాడు. ఆ మనుష్యుడు మెస్సియాను అనుసరించుట కంటె, తనకుగల సంపదలకే అంటుపెట్టికొనియుండుటకు యిష్టపడ్డాడు.

రాజ్య ఏర్పాటు క్రింద ధనవంతుడు నిత్యజీవమును పొందడం పూర్తిగా అసాధ్యమని యేసు చెప్పడం లేదు. ఎందుకనగా కొందరు సంపన్నులు ఆయన అనుచరులయ్యారు. (మత్తయి 27:57; లూకా 19:2, 9) అయినా, ఆత్మీయ విషయములకంటె తనకుగల సంపదలపైనే ఎక్కువ మక్కువ గలవానికి ఇది అసాధ్యమే. ఒకడు కేవలం తన ఆత్మీయ అవసరతను గుర్తించి, దైవిక సహాయమును వెదకితేనే దేవుడిచ్చు రక్షణపొందటం సాధ్యమవుతుంది.—మత్తయి 5:3; 19:16-26.

ఒంటె మరియు సూదిబెజ్జమునుగూర్చిన ఉపమానాన్ని అక్షరార్థముగా తీసికొనకూడదు. ఒకప్రక్క సంపన్నమైన, వస్తుసంబంధమైన ఆశగల జీవితవిధానాన్ని కావాలని కోరుకుంటూనే, దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నించే ధనవంతులైన ప్రజలకు ఇది ఎంతకష్టమో నొక్కిచెప్పడానికే యేసు అలంకారంగా దీనిని చెప్పాడు.—1 తిమోతి 6:17-19.

సూదిబెజ్జము అనేది, ఒక పట్టణములోని చిన్న ద్వారమని, ఒంటెపైనున్న బరువును తీసేస్తే ఒంటె కష్టపడి దూరగలదని కొందరంటారు. అయితే మత్తయి 19:24 మరియు మార్కు 10:25 నందు “సూది” అని తర్జుమాచేయబడిన గ్రీకు పదము రా.ఫిస్‌’, అంటే “కుట్టుట” అనే అర్థముగల క్రియాపదమునుండి వస్తుంది. లూకా 18:25లో బి.లో’నె అనుపదము కుట్టు సూదిని సూచిస్తుంది. అందుకే న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ నందు ఇలా చదువబడుతుంది: “ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె కుట్టే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము.” అనేక అధికారిక మూలములు ఈ తర్జుమాను బలపరుస్తున్నాయి. డబ్ల్యు. ఇ. వైన్‌ ఇలా అంటున్నాడు: “‘సూది బెజ్జమును’ చిన్న ద్వారాలకు అన్వర్తించే ఆలోచన ఆధునికమైనదే. మునుపు అలా చేసిన దాఖలాలేమి లేవు.”—ఎన్‌ ఎక్స్‌పొజిటరి డిక్షనరి ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌.

ఒక పెద్ద ఒంటె కుట్టే చిన్న సూదిబెజ్జములో దూరుట “తూర్పు ప్రాంతపు అతిశయోక్తి,” అని ఒక పరిశోధక పుస్తకం చెబుతుంది. అసాధ్యమైన దానిని చేయగలరనిపించే తెలివైనవారిని గూర్చి ది బాబిలోనియన్‌ టల్మూడ్‌ ఇట్లంటుంది: “వారు సూది బెజ్జమునుండి ఏనుగును దూర్చుతారు.” యేసు అసాధ్యమైన దానిని నొక్కిచెప్పడానికే క్లిష్టమైన, వివరణాత్మకమైన భేదాన్ని నొక్కితెల్పే అలంకారాన్ని ఉపయోగించాడు. ఒక ఒంటేగాని, ఏనుగేగాని కుట్టుకునే సూదిబెజ్జముగుండా దూరివెళ్లుట అసాధ్యము. ఏమైనప్పటికి, ధనవంతుడు మాత్రము దైవిక సహాయముతో వస్తుసంబంధమైన ఆశగల దృక్పథమును విడనాడి, నిత్యజీవమును నిజంగా వెదకవచ్చును. సర్వోన్నతుడగు దేవుడైన యెహోవానుగూర్చి నేర్చుకొని ఆయన చిత్తమును చేయగోరువారందరును అలాగే చేయవచ్చును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి