కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 2/15 పేజీ 31
  • పైరూపములు మోసకరమైనవి కావచ్చును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పైరూపములు మోసకరమైనవి కావచ్చును
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 2/15 పేజీ 31

పైరూపములు మోసకరమైనవి కావచ్చును

“నమ్మదగిన పైరూపములు లేవు” అన్నాడు ఐరిష్‌ నాటక రచయిత రిచర్డ్‌ షెరిడన్‌. ఇది మనుష్యులలోనేగాక చెట్లలోను వాస్తవమైయున్నది.

సా.శ. 33 సం. మార్చి చివరిబాగంలో ఒకనాడు యేసు, బేతనియ నుండి యెరూషలేముకు తన శిష్యులతో కూడా వెళ్తుండగా, ఒక అంజూరపు చెట్టును చూశాడు. దాని నిండా ఆకులున్నవి గాని దగ్గరకొచ్చి చూసేసరికి దానిమీద పండ్లేమి లేవు. అప్పుడు యేసు: “ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను.”—మార్కు 11:12-14.

ఒకప్రక్క మార్కు “అది అంజూరపు పండ్లకాలము కాదు” అని చెప్తూ ఉండగా, యేసు ఆ చెట్టును ఎందుకు శపించాడు? (మార్కు 11:13) సాధారణంగా, ఒక అంజూరపు చెట్టు ఆకులు వేసినప్పుడు తొలికాలపు అంజూరములను కూడా ఫలిస్తుంది. సహజంగా సంవత్సరంలోని ఆ కాలంలో అంజూరపు చెట్టు ఆకులతో ఉండటం అసాధారణము. గానీ దానికి ఆకులున్నాయి గనుక పండ్లుంటాయని యేసు ఆశించటం సరైందే. (పైనున్న బొమ్మను చూడండి.) ఆ చెట్టు కేవలం ఆకులను మాత్రమే వేసిందంటే అది ఫలించేది కాదన్నమాటే. దాని రూపము మోసకరమైనది. పండ్లనిచ్చే చెట్లపై పన్ను విధిస్తుంటారు. అందుచేత నిష్ఫలమైన చెట్టు ఆర్థికంగానూ భారమైనదే గనుక దానిని నరికి వేయవలసిన అవసరమున్నది.

ఈ నిష్ఫలమైన అంజూరపు చెట్టును దృష్టాంతముగా తీసుకొని విశ్వాస విషయములో యేసు ఒక ప్రాముఖ్యమైన పాఠమును బోధించెను. ఆ మరునాడే ఆయన శిష్యులు ఆ చెట్టు యెండిపోయి ఉండుట చూచి ఆశ్చర్యపోయారు. యేసు ఇలా వివరించెను: “దేవునియందు విశ్వాసముంచుడి. . . . ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.” (మార్కు 11:22-24) యెండిపోయిన ఈ అంజూరపు చెట్టు విశ్వాసముతో ప్రార్థించు అవసరతను వివరించుటతోపాటు, విశ్వాసములేని జనాంగమునకు ఏమి సంభవిస్తుందో కూడా చూపిస్తుంది.

యేసు కొన్ని నెలల క్రితము యూదా జనాంగమును, మూడేండ్లనుండి ఫలించక ఇంకా అలాగే ఉన్నయెడల నరికివేయబడవలసిన అంజూరపు చెట్టుకు పోల్చెను. (లూకా 13:6-9) ఆయన మరణానికి కేవలం నాలుగు దినముల ముందు ఈ అంజూరపు చెట్టును శపించుటద్వారా, యూదా జనాంగము పశ్చాత్తాపమునకు తగిన ఫలములను ఫలించలేదని, అది నాశనమునకు వెళ్లుతుందని యేసు చూపెను. ఆ జనాంగము—అంజూరపు చెట్టువలె—పైకి బాగున్నట్లు కన్పించినా, జాగ్రత్తగా పరిశీలించి చూసిన మీదట దాని అవిశ్వాసము మెస్సియాను తృణీకరించుటలో తేటపడింది.—లూకా 3:8, 9.

తన కొండమీది ప్రసంగములో యేసు “అబద్ధ ప్రవక్తలను” గూర్చి హెచ్చరించెను. ఆయన ఇట్లన్నాడు: “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.” (మత్తయి 7:15-20) కావున యేసు యొక్క ఈ మాటలు మరియు శపించబడిన అంజూరపు చెట్టు వృత్తాంతము ఆత్మీయంగా మనము జాగ్రత్తపడవలసిన అవసరతను స్పష్టంగా చూపుతున్నవి. ఎందుకనగా మతసంబంధంగా పైకి కన్పించే పైరూపాలు కూడా మోసకరమైనవై యుండగలవు. (w92 11/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి