కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 2/1 పేజీ 32
  • ఆమె బహుమతిని గెల్చుకున్నది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆమె బహుమతిని గెల్చుకున్నది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 2/1 పేజీ 32

ఆమె బహుమతిని గెల్చుకున్నది

“దీనికంతటికి నేను మీకు రుణపడియున్నాను” అని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థినియగు కియోయి, జపానులోని వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి కార్యాలయానికి వ్రాసింది. ఎందుకామె అంత కృతజ్ఞత కలిగివుంది? జపాన్‌ ట్రాఫిక్‌ భద్రత సమాఖ్యవారు నిర్వహించిన జాతీయ వ్యాసరచన పోటీలో కియోయి ఇటీవలనే ఉత్తమ బహుమతి నందుకుంది. ఆ విలువైన పురస్కారంలో స్వీడన్‌ను సందర్శించడం కూడ యిమిడియుంది.

వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించే అనేక చక్కని సాహిత్యాలయెడల మెప్పును వ్యక్తంచేస్తూ కియోయి అలా వ్రాసింది. అవి ఆమె విజయానికి ఎంతో దోహదపడినట్లు ఆమె భావిస్తోంది. ఈ పోటీయే గాకుండ, ఆమె అనేకమార్లు వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో తమ పాఠశాలకు ప్రాతినిధ్యం వహించింది. “అనేక పోటీలలో ఒక మూలాంశానిచ్చే వారు, దానిని విద్యార్థులు తమ గ్రంథాలయంలో పరిశోధించి తెల్సుకోవాలి. అయితే, నేనా శ్రమపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటె మా యింటిలో బుక్‌షెల్ఫ్‌లోనే అద్భుతకరమైన విషయాల్ని నేను కనుక్కోగలను” అని వ్రాస్తూ ఆమె యింకా ఏమంటుందంటే, “మూలాంశమేదైనను, అది బహుశ వృద్ధాప్య సమస్యలను గూర్చి, పర్యావరణాన్ని గూర్చి, అంతర్జాతీయ సంబంధాలను గూర్చి లేదా స్వయం అభివృద్ధిని గూర్చి కానివ్వండి, వాటిని గూర్చిన లోతైన చర్చ వాచ్‌టవర్‌ లేదా ఆవేక్‌! పత్రికలలో ఉంటుంది.”

ఏమైనప్పటికిని, కేవలం సాహిత్యాలు మాత్రమే కియోయికి సహాయం చేయలేదు. వ్రాయుటలో, మాట్లాడుటలో తానభివృద్ధి చెంది, పోటీలలో విజయం సాధించడానికి యెహోవాసాక్షుల బోధనా కార్యక్రమముల ద్వారా తాను పొందిన విద్యే తనకు సహాయం చేసిందని ఆమె చెబుతుంది. “ఒకప్పుడు, విశ్వవిద్యాలయపు విద్య కావాలని నేను నిజంగా కోరుకున్నాను, కాని ఇటువంటి శిక్షణ నేనెక్కడ పొందగలను?” అని ఆమె అంగీకరిస్తున్నది. తాను పొందిన విద్యనుండి ప్రయోజనం పొందుటకు ఇతరులకు సహాయపడుటలో పూర్తికాలం పనిచేయడానికి ఆమె నిరీక్షిస్తున్నది. వ్యాసరచనా బహుమానం విషయంలో ఆనందమున్నను, జీవమనే బహుమతి పొందుటపైనే కియోయి తన హృదయం నిలిపింది.—ఫిలిప్పీయులు 3:14 పోల్చండి. (w92 11/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి