కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 1/15 పేజీ 3
  • కుటుంబం ముట్టడికి గురౌతుంది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబం ముట్టడికి గురౌతుంది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • కుటుంబ సంతోషానికి రహస్యమేదైనా ఉందా?
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • కుటుంబం—ఒక మానవ అవసరత!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • కుటుంబ దురవస్థ—మన కాలానికి ఒక విలక్షణమైన సూచన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 1/15 పేజీ 3

కుటుంబం ముట్టడికి గురౌతుంది!

“కుటుంబం అతి ప్రాచీన మానవ సంస్థాపనం. అనేక విషయాల్లో అది అత్యంత ప్రాముఖ్యమైయున్నది. అది సమాజం యొక్క అత్యంత అవసరమైన భాగం. కుటుంబ జీవితం బలమైనదా లేక బలహీనమైనదా అనే దానిమీద ఆధారపడి సమాజములోని అన్ని సంస్కృతులు బ్రతికి బయటపడినవి లేదా అదృశ్యమైనవి.”

ఆ విధముగా ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియ 1973లో చెప్పింది. అయితే నేడు కనపడుతున్న పరిస్థితినిబట్టి చూస్తే, ఆ మాటలు ఎంతో అశుభసూచకంగా భవిష్యత్తులో రాబోవు కీడును సూచిస్తున్నవి. గత కొన్ని సంవత్సరములుగా కుటుంబ జీవితము ప్రత్యక్షంగా ఎంతో తీవ్రమైన దాడికి గురైనట్లు కనిపిస్తుంది. పేరుగాంచిన సలహాదారుడు జాన్‌ బ్రాడ్‌షా ఇలా వ్రాస్తున్నాడు: “నేడు కుటుంబములో క్లిష్టమైన పరిస్థితి నెలకొనివుంది. . . . పెచ్చుపెరిగిపోతున్న విడాకులు, యుక్తవయస్కుల హింసాత్మక ధోరణి, విపరీతమైన మాదకద్రవ్య దుర్వినియోగము, రక్తసంబంధులలోనే అంటురోగమువలె అలుముకొనివున్న లైంగిక దుర్నీతి, అదుపుతప్పిన తిండి, శారీరక హింస మొదలగునవన్నీ ఎక్కడో నెలకొనివున్న తీవ్ర లోపానికి నిదర్శనమై యున్నవి.”

నిజంగా, కుటుంబంలో “ఎక్కడో నెలకొనివున్న తీవ్ర లోపానికి నిదర్శనము” ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో కన్పిస్తున్నది. ఐరోపాలోని పరిస్థితినిగూర్చి ది యునెస్కో కొరియర్‌ ఇలా చెప్పింది: “1965 నుండి ఖండమంతటి విడాకుల సంఖ్యలో ఎంతో పెరుగుదల కన్పిస్తుంది. పిల్లలను పెంచే భారం ఒంటరిగా కేవలం తండ్రి లేక తల్లి మాత్రమే మోయవలసిన కుటుంబాలు పెరిగిపోతున్నవి.” అలాగే అభివృద్ధిచెందుతున్న దేశాలలో సహితము కుటుంబ వ్యాకులత పెరిగిపోతుంది. రచయిత్రి ఎలెన్‌ ట్రాన్‌బ్లా ఇలా వ్రాసింది: “శతాబ్దాలుగా ఆశాజనకమైన మరియు స్థిరమైన జీవితవిధానానికి పేరెన్నికగన్న సమాజములలో జీవిస్తున్న లక్షలాదిమందికి నేటి కాలం అల్లకల్లోలంగా మారింది.”

నేడు అనేక గృహాలలో చోటుచేసికొనియున్న వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఒక్క అమెరికాలోనే లక్షలాదిమంది పిల్లలు, తాగుడుకు బానిసలైన తండ్రి లేక తల్లి చేత పెంచబడుతున్నారు. కుటుంబములో హింస విపరీతంగా పెరుగుతోంది. ఇంటిమేట్‌ వయెలెన్స్‌, అనే తమ పుస్తకంలో పరిశోధకులైన రిచర్డ్‌ జెల్స్‌, మరియు మూరే స్ట్రాస్‌ ఇలా నివేదిస్తున్నారు: “మన సమాజములో ఎక్కడో ఎవరివలననో కొట్టబడటం, శారీరక దాడికి గురికావడం, చంపబడటం కంటె చాలామట్టుకు మీ స్వంత గృహాలలో మీ ప్రియమైన వారివలన ఇవి ఎక్కువగా జరుగుతున్నవి.”

నిజంగా సమాజం బ్రతికిబయటపడటం కేవలం కుటుంబ బలంపైనే ఆధారపడివుంటే, ఈ సమాజ భవిష్యత్‌ సంసతినిగూర్చి భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, సమాజ దశ అనేది నీకు అంతగా పట్టింపులేని సంగతేకావచ్చును. అంతకంటె ఎక్కువగా, అలాంటి క్లిష్టపరిస్థితి మీ కుటుంబానికి ఏంచేస్తుందా అని బహుశా మీరు భయపడవచ్చును. మరి చివరికి ఫలితమేంటి? ఒక అధికారిక మూలంనుండి ఇందుకు వచ్చే సమాధానం మిమ్ములను ఎంతో ఆశ్చర్యపరచవచ్చును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి