‘ఆకాశములు . . . ప్రకటిస్తున్నవి’
మీరిప్పుడున్న స్థలానికి షుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో ఎర్రని కాంతితో సూర్యుడు ధగధగ ప్రకాశిస్తున్నాడు. వేలాది సంవత్సరాలుగా దేవుడని పూజింపబడుచున్నను, ప్రకాశమానమైన మన పొరుగునున్న యీ గ్రహం “భూమ్యాకాశములను సృజించిన” సృష్టికర్త శక్తికి ఒక నిదర్శనంగా ఉంది. (కీర్తన 115:15) భూమ్మీదనున్న జీవరాసులకు దాని వెలుగు, వేడి ఎంతో ఆవశ్యకము. దాన్ని గూర్చి విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిసికొనిన వాస్తవాలు మనలను ఆశ్చర్యంతో ముంచెత్తుతాయి.
సూర్యగ్రహం అధిక మొత్తంలో శక్తినుత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. అది ఉత్పత్తిచేసే వేడి, వెలుగులో కేవలం నూరుకోట్ల వంతులో సగం మాత్రమే భూమికి చేరుతుందనే విషయం మీకు తెలుసా? అయినను, ప్రతి నిమిషం అలా చేరే ఆ చిన్నమొత్తమే అత్యధిక పరిమాణంలో 2,40,00,000,00,00,000 అశ్వశక్తికి సమానము!
సూర్యగ్రహం ఆ శక్తినంతా ఎలా ఉత్పన్నం చేస్తుంది? దాని అంతర్భాగంలో అతి పెద్ద అణు కొలిమిలో ప్రతి సెకనుకు 36 లక్షల మెట్రిక్ టన్నుల హెడ్రోజన్ మండుట ద్వారా ఆ శక్తి ఉత్పత్తి అవుతుంది. మానవజాతికి సంతోషకరమైన విషయమేమంటే, ఈ ప్రక్రియ కోటానుకోట్ల సంవత్సరాలు ఎడతెగక కొనసాగుటకు సరిపడునంత ఇంధనము సూర్యుని యందున్నది.
విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని సంగతులు మరిన్ని ప్రశ్నలను ఉత్పన్నం చేస్తున్నవి. ఉదాహరణకు, లోహపు రేకును ఒక సుత్తితో కొట్టిన విధంగా సూర్యగ్రహం తదేకంగా కంపిస్తున్నది. ఎందుకు? దీనిని కూడ ఆలోచించండి: మండుచున్న సూర్యగ్రహపు అంతర్భాగం అత్యంత వేడిగా ఉంటుంది. దాని బాహ్యపొరలు ఎంత దూరంగా ఉంటే అంత చల్లగా ఉంటాయి. అయితే మనం సూర్యుని వాతావరణపు పొర అనగా దాని కాంతివలయానికొస్తే అది మారిపోతుంది. మండుచున్న అంతర్భాగానికి దగ్గరగావున్న పొరలకంటె కాంతివలయమే ఎక్కువ వేడిగా వుంటుంది. ఎందుకు?
అంతేకాకుండా, భూమి వలెనే సూర్యగ్రహం పరిభ్రమిస్తున్నప్పుడు, దాని వివిధ భాగాలు వివిధ వేగాలలో పరిభ్రమిస్తాయి. ఉదాహరణకు, దానిలోపలి పొరలకన్నా దాని ఉపరితలం వేగంగా పరిభ్రమిస్తుంది. ఎందుకు? అదెలా సాధ్యం? ఇంకాచూస్తే, దానిలో సూర్యగ్రహ బిందువులనేవి ఉన్నాయి. సూర్యగ్రహపు ఉపరితలం మీదనున్న ఈ మచ్చలు ప్రతి 11 సంవత్సరాల కాలచక్రంలో క్రమంగా వస్తూపోతుంటాయి. అలా అవి క్రమంగా ఎందుకు మారుతుంటాయి?
సూర్యగ్రహాన్ని గూర్చి ఇంకా ఎంతో తెలిసికొనవలసియున్నను, దాన్నిగూర్చి ఇప్పటి వరకు మనకు తెలిసిన దాన్నిబట్టి, మనం దాని సృష్టికర్తయగు యెహోవావైపు సంభ్రమాశ్చర్యంతో చూసేట్లు చేస్తున్నది. సూర్యున్ని మనం చూసే ప్రతిసారి, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి; అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” అనే విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నది.—కీర్తన 19:1. (w92 10/1)