కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 12/1 పేజీ 31
  • మీకు జ్ఞాపకమున్నవా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు జ్ఞాపకమున్నవా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 12/1 పేజీ 31

మీకు జ్ఞాపకమున్నవా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి వాటిని గుణగ్రహించారా అయితే, క్రింది ప్రశ్నలకు మీరు సమాధానములు చెప్పగలరేమో చూడండి:

◻ బబులోను చెరనుండి తిరిగివచ్చిన నెతీనీయులకు, సొలొమోను సేవకుల వంశస్థులకు అదనంగా ఇవ్వబడిన సేవాధిక్యతలు వేటికి ఒక చక్కని ఛాయారూపముగా ఉండగలవు?

ఈనాడు, భూమిపై ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము తగ్గుచుండగా, వేరే గొర్రెలు వృద్ధియగుచున్నారు. నెతీనీయులు, సొలొమోను సేవకుల వంశస్థులవలె గొర్రెలవంటి వీరిలో కొందరికీ, శేషించిన వారి పర్యవేక్షణ క్రింద ఇప్పుడు బరువైన బాధ్యతలు అప్పగింపబడుచున్నవి. (యెషయా 61:5)—7/1, పుటలు 30, 31.

◻ “ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు” అని ప్రవక్తయగు జెఫన్యా చెప్పుటలో ఆయన భావమేమి? (జెఫన్యా 2:2, 3)

రానైయున్న “మహాశ్రమలలో” ఎవరైనా కాపాడబడాలంటే, అది ఒకసారి రక్షింపబడితే ఇక రక్షింపబడినట్లే అన్నట్లుండదు. (మత్తయి 24:13, 21) ఆ దినమందు దాచబడుట, ఒకవ్యక్తి నిర్విరామముగా మూడు సంగతులు చేయుటపై ఆధారపడియుండును. అవేవనగా, అతడు యెహోవాను వెదకవలెను, నీతిని వెదకవలెను, దీనత్వమును వెదకవలెను.—8/1, పుటలు14, 15.

◻ “అంత్యకాలములో” మిఖయేలు “నిలువబడును” అంటే దాని భావమేమి? (దానియేలు 12:1, 4)

ఆయన 1914లో రాజుగా నియమించబడి నప్పటినుండి, మిఖాయేలు యెహోవా ప్రజల పక్షముగా “నిలుచున్నాడు.” అయితే, త్వరలోనే ఒక ప్రత్యేక భావమందు—అనగా భూమిపై నుండి సమస్త దుష్టత్వమును తొలగించు యెహోవా ప్రతినిధిగా దేవుని ప్రజల విమోచకునిగా మిఖాయేలు “నిలువబడును.”—8/1, పుట 18.

◻ నిజమైన సంతోషము దేనిపై ఆధారపడును?

మన నిజమైన సంతోషము యెహోవాతో మనకున్న అమూల్యమైన సంబంధము, ఆయన గుర్తింపు, ఆయన ఆశీర్వాదములపై ఆధారపడియుండును. (సామెతలు 10:22) కాబట్టి, యెహోవాకు విధేయత చూపకుండ, ఆనందముతో ఆయన చిత్తానికి లోబడకుండ నిజమైన సంతోషాన్ని సాధించుట అసాధ్యము. (లూకా 11:28)—8/1, పుటలు 28, 31.

◻ మత్తయి 13:47-50లో యేసు చెప్పిన దృష్టాంతమందలి “చేపలుపట్టు వల” దేనిని సూచిస్తున్నది?

“చేపలను” సమకూర్చుతూ, దేవుని సంఘమని చెప్పుకుంటున్న భూసంబంధమైన ఉపకరణాన్ని ఈ “చేపలుపట్టువల” సూచిస్తున్నది. దీనిలో క్రైస్తవమత సామ్రాజ్యం మరియు అభిషక్త క్రైస్తవుల సంఘము కూడ ఉన్నవి. ఈ రెండవ గుంపు మత్తయి 13:49 ప్రకారం దూతల నడిపింపు క్రింద ‘మంచి చేపలను’ సమకూర్చుటలో కొనసాగారు.—9/1, పుట 21.

◻ ఇశ్రాయేలీయులలోని న్యాయాధిపతులు అనువర్తించవలసిన సూత్రములలో కొన్ని ఏమైయున్నవి?

బీదలుకు ధనికులకు ఒకటే న్యాయము, ఖండితముగా పక్షపాతము చూపకుండుట, లంచము పుచ్చుకొనకుండుట మొదలైనవి. (లేవీయకాండము 19:15; ద్వితీయోపదేశకాండము 16:19)—10/1, పుట 13.

◻ న్యాయ విచారణ ద్వారా పెద్దలు దేనిని సాధించడానికి ప్రయత్నిస్తారు?

ఒక ధ్యేయమేమిటంటే, వ్యాజ్యెమునకు సంబంధించిన వాస్తవాలు ప్రేమతో కనుగొనుటే. ఈ వాస్తవాలు తెలిసినప్పుడు, సంఘాన్ని కాపాడి దానిలో యెహోవా ఉన్నత ప్రమాణాలు నెలకొనియుండునట్లు, ఆలాగే దేవుని ఆత్మ ధారళముగా పనిచేయులాగున పెద్దలు అవసరమైన చర్యలు గైకొంటారు. సాధ్యమైతే ప్రమాదమందున్న పాపిని కాపాడుటకు కూడ ఈ విచారణ సహాయం చేస్తుంది. (లూకా 15:8-10 పోల్చుము.)—10/1, పుటలు 18, 19.

◻ అక్రమ లైంగిక సంబంధమైన భ్రమలు ఎందుకు హానికరము?

మత్తయి 5:27, 28లోని యేసు మాటల దృష్ట్యా, అదేపనిగా అక్రమ లైంగిక సంబంధమైన భ్రమలలో మునిగియుండువారు తమ హృదయంలో వ్యభిచరించు దోషులౌతారు. ఆ భ్రమలే లైంగిక దుర్నీతికి నడిపే ప్రమాదం కలదు.—10/1, పుటలు 27, 28.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి