కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 12/1 పేజీ 31
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు పఠనములను ప్రారంభించుటకు మెలకువగా యుండుడి
    మన రాజ్య పరిచర్య—1990
  • త్రిత్వము—బైబిలు నందు బోధింపబడిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 12/1 పేజీ 31

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా పరిశీలించి తలంచియున్నారా? అట్లయిన క్రిందివాటిని బహుశా మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరు:

◻ యెహోవాసాక్షులు బోధించు విధానమునకు క్రీస్తుమతసామాజ్యపు మతగురువులు బోధించువిధానమునకు ఏ పెద్ద వ్యత్యాసము కలదు?

దేవునివాక్యపు అధికారముతో యెహోవాసాక్షులు బోధింతురు, క్రీస్తుమతసామ్రాజ్యపు మతగురువులైతే వారి బోధలకు బబులోను మరియు ఐగుప్తు అన్యమత పారంపర్యాచారములను ఆధారముగా చేసికొందురు.—11/91, పేజి 25.

◻ గలతీయులు 5:22, 23 లలో చెప్పబడిన తొమ్మిది ఆత్మఫలములలో ప్రేమ ఎందుకు అత్యంత గొప్పనైనది?

ఇతర ఎనిమిది ఆత్మఫలములు మొట్టమొదట చెప్పబడిన ప్రేమయొక్క వ్యక్తీకరణలు, లేక వివిధ ఆకృతులైయున్నవి. ఇతర ఆత్మఫలములన్నియు అవసరమైన లక్షణములే, అయితే ప్రేమలేనట్లయిన అవి మనకెంతమాత్రము ప్రయోజనకరము కావు. (1 కొరింథీయులు 13:3)—12/91, పేజి 14.

◻ “మమ్మును శోధనలోకి తేక తప్పించుము” అని ప్రార్థించుడని తన శిష్యులతో చెప్పినప్పుడు యేసు భావమేమి? (మత్తయి 6:13)

ఈ మాటలను మనము యెహోవా మనలను పాపముచేయునట్లు శోధిస్తాడను భావములో అర్థము చేసికొనకూడదు. బదులుగా, ఆయనకు అవిధేయులగునట్లు వత్తిడి చేయబడినప్పుడు లేక శోధించబడినప్పుడు దానికి లోబడుటకు అనుమతించకుము అని మనము యెహోవాను అడుగవచ్చును. మనము భరించలేని ఏ శోధనయు మనలను స్వాధీనపరచుకొనకుండ మన అడుగులను నడిపించమని మనము తండ్రిని బ్రతిమాలవచ్చును. (1 కొరింథీయులు 10:13)—9/91, పేజి 31.

◻ ఒక వ్యక్తి ఎప్పుడు బాప్తిస్మము పొందవలెను?

బాప్తిస్మమనునది ఒకవ్యక్తి సంపూర్తిగా, ఏమియు దాచుకొనక, ఏ షరతులులేక దేవుని చిత్తమునుచేయుటకు క్రీస్తుయేసు ద్వారా యెహోవాకు సమర్పించుకొనినప్పుడు తీసుకొనవలసిన చర్యయైయున్నది.—9/91, పేజి 20.

◻ నోవహు విశ్వాసము ఎట్లు లోకముపై నేరస్థాపనచేసెను? (హెబ్రీయులు 11:7)

తమ జీవితవిధానమును మార్చుకొన యిష్టపడినట్లయిన తాను తన కుటుంబముతోపాటు, ఇతరులును జలప్రళయమునుండి రక్షింపబడియుందురని, నోవహుయొక్క విధేయత మరియు ఆయన నీతిక్రియలు ప్రదర్శించెను. తన స్వంత అసంపూర్ణ శరీరము, తనచుట్టువున్న లోకము, మరియు అపవాదినుండి వత్తిడులున్నను, దేవునిని సంతోషపెట్టగల జీవితము జీవించ సాధ్యమని నోవహు రుజువుపరచెను.—10/91, పేజి 19.

◻ శరీరక వ్యాధి, క్రుంగుదల, ఆర్థిక యిబ్బందులను ఎదుర్కొంటు ఒక క్రైస్తవుడు ఎట్లు తన ఆనందమును కాపాడుకొనగలడు?

దేవుని వాక్యము అవసరమైన నడిపింపును మరియు ఓదార్పును ఇచ్చుచున్నది. కీర్తనలను చదువుట, లేక వినుట ద్వారా అవసరమైనంతగా నూతనపరచగల విశ్రామమును పొందవచ్చును. దావీదు ఇట్లు సలహాయిచ్చెను: “నీ భారము యెహోవాపై మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును.” ఇంకను ఆయన, యెహోవా నిజముగా మన ప్రార్థనలను “ఆలకించువాడ” నియు అభయమిచ్చుచున్నాడు. (కీర్తన 55:22; 65:2) యెహోవా సంస్థ, దాని ప్రచురణలు మరియు సంఘపెద్దలద్వారా మన సమస్యలతో మనము విజయమొందుటకు ఎల్లప్పుడు మన పక్షమున సిద్ధముగా నిలబడియున్నది.—4/91, పేజీలు 23,24.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి