రాజ్య ప్రచారకుల నివేదిక
25 సంవత్సరములు నన్గాయున్న స్త్రీ చివరకు సత్యము నేర్చుకొనుట
బైబిలు సమస్త జనములనుండి ఒక “గొప్పసమూహము” వచ్చి యెహోవా ఆత్మీయ ఆలయములో ఆరాధింతురని ప్రవచించినది. (ప్రకటన 7:9) ఈనాడు అది జరుగుతుంది. ఆవిధముగా అనేకులు దేవుని సత్యముయొక్క సహాయము మూలంగా అబద్ధమతపు బంధములు తెంచుకొని వచ్చుటను చూచుటలో మనము సంతోషిస్తున్నాము. క్రింది అనుభవములు దీనిని వివరించుచున్నవి.
◻ ఇటలీలోని రోమునుండి ఒక స్త్రీ ఇట్లు వివరించుచున్నది: “నా చిన్నవయస్సునుండి నాకు నన్‌గా కావాలని ఎంతో ఆశగా ఉండేది. ఎందుకనగా నాకు దేవుని హృదయపూర్తిగా సేవించాలను కోరిక ఉంది. 32 సంవత్సరముల వయస్సులో 1960, డిశంబరు 8న, విధేయతగా ఉండి, ఆస్తిని కోరక, పవిత్రతతో ఉందునను ప్రమాణముచేయుటతో ఆ నా ఆశ నెరవేరినది. అనాధలైన వారు లేక తల్లిదండ్రులు జైలులలో ఉండుటవలన విడిచిపెట్టబడిన 30 మంది బీద పిల్లలను గూర్చి శ్రద్ధవహించే పని నాకు అప్పగించబడినది. నా పనిలో నేను తృప్తిని కనుగొన్నాను.
“అయితే పది సంవత్సరములు సేవచేసిన తరువాత ఆ సంస్థలోపలనే జగడము చెలరేగుటతో నా విశ్వాసము బ్రద్దలైనది. మమ్ములను దేవుడే నడిపిస్తున్నట్లయిన, అట్టి జగడములను, అక్రమములను దేవుడు తన స్వంత గృహములో ఎందుకు అనుమతిస్తున్నాడా అని నేను ఆశ్చర్యపడితిని.”
ఈ నన్‌కు ఫ్రాన్సులో ఒక సోదరి ఉన్నది. ఆమె యెహోవాసాక్షి. ఈ నన్‌కు ఆమె ఉత్తరము ద్వారా సాక్ష్యమిచ్చి ఒక న్యూవరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చ్‌ర్స్ బైబిలును పంపినది. ఆ నన్ చెప్పేదేమంటే: “23 సంవత్సరముల తరువాత దేవుని వాక్యముతో నా మొదటి పరిచయము అదే.” తరువాత ఆమె యెహోవాసాక్షులవలన బైబిలు పఠించుటకు అంగీకరించినది. ఆమె ఇలా అనుచున్నది: “నేను పఠనములో వృద్ధిచెందుకొలది, యెహోవా దేవుని, ఆయన కోరువాటిని, ఆయన అద్భుత లక్షణములను తెలుసుకొంటిని. విగ్రహములను ఉపయోగించుటను దేవుడు అంగీకరించుటలేదని నేను తెలిసికొన్నప్పుడు చాలా చెడుగా నాలోనేను భావించుకొంటిని. ఎందుకనగా ఆ సంస్థనిండా అనేక పరిమాణములలో అన్నిరకముల విగ్రహములు యున్నవి. నేను యెహోవాను సంతోషపెట్టకోరినట్లయిన, ఆ స్థలములో నేనుండలేనని గ్రహించుకొంటిని. ఒక నన్‌గా 25 సంవత్సరములు భక్తి భావముతో సేవచేసిన తరువాత, నేను చివరకు సత్యమును కనుగొన్నాను. 1985 అక్టోబరు 1న, నా పైవారిని ఆశ్చర్యపరచుచు, దానిని విడిచిపెట్టుదునను నోటీసు ఇచ్చితిని.
“ప్రేమగల నా సహోదరులు, సహోదరీలు నాకు ఆత్మీయముగాను, వస్తుసంబంధముగాను సహాయముచేసిరి. యెహోవాకు ఆయన సంస్థకు కృతజ్ఞురాలినై, 1986 ఆగస్టు, 30న బాప్తిస్మము పొంది నిత్యజీవ మార్గములో నడచుటకు బయలుదేరాను.”
దేవుని సేవించవలెనను ఒక యుక్తవయస్కురాలి కోరికను యెహోవా దీవించుట
◻ బ్రెజిల్లో యెహోవాసాక్షియైన ఒక స్కూలు టీచరు ఆమె స్కూల్ పేపర్లను దిద్దుతున్నప్పుడు అందులో 14 సంవత్సరముల విద్యార్థిని దేవునిగూర్చి ఎక్కువగా తెలుసుకొనవలెనను తన కోరికను వ్రాసినది. ఈ విద్యార్థినితో ఆమె బైబిలు పఠనమును ప్రారంభించినది. అయితే ఈ బాలిక వృద్ధిచెందుకొలది, ఆమె కేథలిక్ కుటుంబము దానిని నిషేధించి, ఆమె సాహిత్యమును నాశనము చేసింది. ఈ యౌవన విద్యార్థిని స్కూలు విరామ సమయములో బైబిలు పఠించుటకు ఆరంభించినది. కాని అది కూడా బయటపడింది. కావున ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పఠనము కొనసాగినది. అయితే త్వరలో, ఆమె ఉత్తరాలను కుటుంబము కనుగొని వాటిని కాల్చివేశారు. తండ్రి కేథలిక్ సమాజ ప్రార్థనకు (మాస్) వెళ్లునట్లు బలవంతము చేశాడు. అయితే ఆమె వెళ్లునప్పుడు ది వాచ్‌టవర్ కాపీని తనతోపాటు తీసుకెళ్లి, ఆ కార్యక్రమము జరుగు సమయములో చర్చి బుక్లెట్ లోపలి పేజీలలో దీనిని దాచి పెట్టుకొని చదువుతూ వుండేది. ఈ విధంగా ఆమె ఒక రోజు దొంగతనంగా రాజ్యమందిరమునకు వేళ్లేంత వరకు ఆరునెలలు గడిచింది. కూటము జరుగుతున్న సమయములో ఆమె తండ్రి వాకిటి దగ్గరకు వచ్చి, ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెను కొట్తానని తన కూతురుతో చెప్పమని సహోదరులకు చెప్పివెళ్లాడు. సహోదరులు ఆయనతో తర్కించుటకు చేసిన ప్రయత్నములేవి ఫలించలేదు.
మరుసటి రోజు ఆమె సంతోషంగా, చిరునవ్వుతో సహోదరులను కలవటానికి వెళ్లింది. ఆమె తన తండ్రి కొట్టిన దెబ్బలవలన ఒంటిపైపడిన వాతలను వారికి చూపించింది. మరి ఆమెకు సంతోషం ఎందుకు? రాజ్యమందిరాన్ని విడిచి వెళ్లిన తరువాత ఆమె తండ్రి పట్టణములోనున్న మేయరుతో సహా అనేకుల యొద్దకు వెళ్లి, తన కూతురు యెహోవాసాక్షిగా అవుటలోని మేలు కీడులను గూర్చి అడిగాడు. మేయరు యెహోవాసాక్షులు మంచివారని, నమ్ముటకు యోగ్యమైనవారని చెప్పాడు. ఇంకా ఆయన, వారు చాలా శ్రేష్టమైన నైతిక ప్రమాణములతో ఉన్నారనియు, సాధారణంగా యౌవనులు కలిగియుండని అట్టి ఉన్నత ప్రమాణములను బిడ్డ కలిగియుండటం చాలామంచిదని ఆయన చెప్పాడు.
అయినను, ఆ బాలిక దెబ్బలు తిన్నది. అయితే తండ్రి ఆమె ఇంట్లో అనుమతి తీసుకొనకుండా వెళ్లినందుకు కొట్తున్నానని చెప్పాడు. అంతటితో ఊరకుండక, ఆయన ఇంకా, ఈసారి నీవు బైబిలు పఠించటంనేగాని, లేక యెహోవాసాక్షుల కూటములకు హాజరవటంనేగాని మానుకుంటే కొట్తానని చెప్పాడు! ప్రస్తుతం ఆ కూతురు ఒక ఆసక్తిగల ప్రచారకురాలు. ఆమె కుటుంబంలోని కొందరు సత్యముయెడల ఆసక్తిచూపుతున్నారు.
నిజముగా, ఈ అనుభవము చూపుతున్నట్లు, ఆయనను సేవించవలెనను యథార్థమైన కోరికగల యౌవనులను యెహోవా దీవించును. (w91 2/1)