వాగ్ధాన దేశమునుండి దృశ్యములు
షోమ్రోను ఉత్తరప్రాంత ముఖ్యపట్టణములలో ముఖ్యపట్టణము
బబులోను, నీనెవె, రోము. యివి బైబిలు కాలములలో ముఖ్యపట్టణములై యుండెను. అయినను, బైబిలు ప్రకారము మాట్లాడినట్లయిన, యెరూషలేమును తప్పిస్తే, వాటిలో ఏదియు కాదుగాని షోమ్రోను జ్ఞాపకార్థమైన ముఖ్యపట్టణమై యున్నది. దాదాపు 200 సంవత్సరములపాటు అది ఇశ్రాయేలీయుల పది తెగల రాజ్యమునకు రాజధానియైయుండెను, మరియు షోమ్రోనుమీద అనేక ప్రవచనార్థక సమాచారములు కేంద్రీకరించబడెను. అయితే షోమ్రోనునుగూర్చి మీకేమి తెలియును? మరియు అది ఉత్తరప్రాంత ముఖ్యపట్టణములలో ఎందుకు ముఖ్యపట్టణమై యుండెను?
మ్యాపును చూస్తు, యెహోవాయొక్క రాజునుండి యెరూషలేము ఆలయమునుండి ఇశ్రాయేలీయుల పది-తెగలు వేరైపోయిన తర్వాతగల చరిత్రను కొంత గుర్తుకు తెచ్చుకొనుము. ఉత్తరప్రాంత రాజ్యమును రూపొందించుటకు నడిపిన యెరొబాము ఉత్తర దక్షిణ పర్వత మార్గమందలి, షెకెమునుండి కొద్దికాలము పరిపాలించెను. ఆ తర్వాత యెరొబాము కొండవాగైన ఫరా అగ్రభాగమునగల, తిర్సాకు తన ముఖ్యపట్టణమును మార్చెను. యొర్దాను లోయనుండి వెళ్లు ఒక రహదారి తిర్సాగుండా వెళ్లి పర్వత మార్గములో కలిసిపోవును. నాదాబు, బయెషా, ఏలా, జిమ్రీ, మరియు ఒమ్రీ పరిపాలనా కాలములలో తిర్సా పది-తెగల రాజ్యమునకు ముఖ్యపట్టణముగా ఉండెనను సంగతి మీకు తెలియునా?—ఆదికాండము 12:5-9; 33:17, 18; 1 రాజులు 12:20, 25, 27; 14:17; 16:6, 15, 22.
దాదాపు ఆరు సంవత్సరముల తర్వాత, ఒమ్రీ క్రొత్త ముఖ్యపట్టణమును నిర్మించెను. ఎక్కడ? ఎడమవైపు మీరు చూచు షోమ్రోను అను పర్వతమును అతడు కొనుగోలు చేసెను. (1 రాజులు 16:23-28) ప్రస్తుతము అది వ్యవసాయముకొరకు సమృద్ధిగా ఎత్తైన ప్రదేశమును కలిగియున్నను, సులభముగా రక్షించుకోగల పైకిపొడుచుకు వచ్చిన సమతల శిఖరభాగము కలిగియున్నందున ఒమ్రీ దానిని బహుశ ఎంపిక చేసుకొనియుండవచ్చును. అతని కుమారుడైన అహాబు దానికి వెడల్పైన ప్రాకారములతో రక్షిత బలమును విస్తరింపజేయుటద్వారా షోమ్రోనును యింకను నిర్మించెను. అంతేకాకుండా, ఆయన బయలుకు ఒక ఆలయమును, మరియు తనకొరకు తన సిరియా ప్రాంతపు భార్యయైన యెజెబెలు కొరకు రాజ భవంతినికూడ నిర్మించెను. త్రవ్వకములు, పాడుపడిన అహాబు రాజ భవంతిని బయటపెట్టినవి. యివి ప్రక్కపేజీలో చూపబడినవి. ఆ భవంతి భోగభాగ్యములకు విపరీతమైన దుష్టత్వమునకు పేరుపొందినదై యుండెను. (1 రాజులు 16:29-33) బయలు కారణముగా జరిగించబడుచున్న కీడును తప్పుబట్టుటకు, ఏలీయా ప్రవక్త ఈ పట్టణమునకు ఎక్కివచ్చి భవంతికి వెళ్లు రహదారిమీద నడచుచుండుటను చిత్రీకరించుకొనుము.—1 రాజులు 17:1.
అక్కడ ద్రాక్షారసము మరియు ఒలీవ తైలము రవాణా లేక చెల్లించిన పన్నుల వివరములు వ్రాయబడియున్న కుండపెంకులను 1910లో భూగర్భపరిశోధకులు కనుగొనిరి. అయితే వాటిమీది వ్యక్తుల పేర్లలో అనేకము బయలు అను మాటను అంశముగా కలిగియున్నవి. యిక్కడ చూపబడినట్లుగా, ఏనుగు దంతముతో తాపడము చేయబడిన ముక్కలు లేక తోలుముక్కలనుకూడ భూగర్భపరిశోధకులు కనుగొనిరనుమాట మీకు ఆసక్తిని కల్గించవచ్చును. ఎంతోకాలము పూర్వమే 1 రాజులు 22:39 అహాబు “దంతపు ఇంటిని” నిర్మించెనని తెల్పినది. బహుశ దీనియందు ఒక శతాబ్దము తర్వాత ప్రవక్తయైన ఆమోసు సూచించినట్లు “దంతపు మంచముల” వంటి, నగిషీ చేయబడిన దంతపు తాపడములుగల మహత్తరమైన గృహ సామగ్రి చేరియుండవచ్చును. (ఆమోసు 3:12, 15; 6:1, 4 NW) వాటిమీది నగిషీ పనులలో రెక్కలుగల సింహపు శరీరముల బొమ్మలు, యితర ఐగుప్తు కల్పిత గాథలలోని చిహ్నములు ఉండెను.
అహాబు యెజెబెలుల ప్రస్తావన బహుశ వారెట్లు చనిపోయిరో మీ మదికి తీసుకొని రావచ్చును. సిరియాతో అవివేకముగా చేసిన యుద్ధమందు అహాబు తన ప్రాణాలను కోల్పోయెను. ఏలీయా చెప్పిన మాట ప్రకారము అతని రథమును “షోమ్రోను కొలనులో కడిగినప్పుడు, . . . కుక్కలువచ్చి అతని రక్తమును నాకెను.” (1 రాజులు 21:19; 22:34-38) రాణియైన యెజెబెలు ఒక భవంతి కిటికినుండి క్రిందికి పడద్రోయబడి మరణించెను. అది షోమ్రోనులోని భవంతినుండియా? కాదు. అహాబు యెజ్రెయేలు లోయ ఉత్తర భాగమునకూడ ఒక భవంతిని కలిగియుండెను. దానికి దగ్గరగావున్న నాబోతు ద్రాక్షాతోటను అతడు ఆశించెను. ఆ భవంతి పైభాగమునుండి కావలివారు తూర్పువైపున ఆ లోయగుండా యెహూ బహు రౌద్రముతో వచ్చుటను చూసిరి. అక్కడనుండి ఆ మాజీ షోమ్రోను రాణి పడద్రోయబడి భయంకర మరణముననుభవించెను, అయితే ఆమెకు అలా జరుగుట న్యాయమే.—1 రాజులు 21:1-16; 2 రాజులు 9:14-37.
షోమ్రోను ముఖ్యపట్టణముగా కొనసాగినను, దానికి దేవుని అంగీకారము లేక ఆశీర్వాదము లేకుండెను. బదులుగా, అది దక్షిణముగావున్న తన ముఖ్యపట్టణమైన యెరూషలేము యెడల ద్వేషమును వ్యతిరేకతను చూపించెను. షోమ్రోను పాలకుల మరియు ప్రజల విగ్రహారాధననుగూర్చి, లైంగిక దుర్నీతినిగూర్చి, తన నియమముల యెడల చూపించబడుచున్న అగౌరవమునుగూర్చి వారిని హెచ్చరించుటకు యెహోవా ఎంతోమంది ప్రవక్తలను పంపినను ప్రయోజనము లేకపోయెను. (యెషయా 9:9; 10:11; యెహెజ్కేలు 23:4-10; హోషేయ 7:1; 10:5; ఆమోసు 3:9; 8:14; మీకా 1:1, 6) కాబట్టి, సా.శ.పూ. 740లో షోమ్రోను లెక్కకు పిలువబడెను, అలా అది అష్షూరీయులచేత నాశనము చేయబడెను. దాని ప్రజలనేకులు బందీలుగా తీసుకొనపోబడి, వారి స్థానములలో పరదేశులు ఉంచబడిరి.—2 రాజులు 17:1-6, 22-24.
ఆ తర్వాత, ప్రత్యేకముగా హేరోదు కాలములో, గ్రీకులు మరియు రోమన్లు షోమ్రోనుకు (సమరయ) కొంత ప్రాధాన్యతను మరలా కల్గించిరి. కాగా యేసు మరియు అపొస్తలులు సహితము ఉత్తరప్రాంత ముఖ్యపట్టణములలో ముఖ్యపట్టణమైన దీనిని ఎరిగియుండిరి.—లూకా 17:11; యోహాను 4:4. (w90 11/1)
[10వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
యెజ్రెయేలు
తిర్సా
షోమ్రోను
షెకెము
యెరూషలేము
యొర్దాను నది
[క్రెడిట్ లైను]
Based on a map copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel.
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[11వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
Garo Nalbandian
Inset: Israel Department of Antiquities and Museums; photograph from Israel Museum, Jerusalem