కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 1/1 పేజీలు 6-7
  • ఒక నూతన లోకము సమీపమున ఉన్నది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక నూతన లోకము సమీపమున ఉన్నది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • త్వరలోనే యుద్ధంలేని లోకం
    తేజరిల్లు!—1996
  • “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
    “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
  • ఈ గుండెకోత త్వరలోనే మటుమాయమౌతుంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • కొత్తలోకం దగ్గర్లో ఉంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 1/1 పేజీలు 6-7

ఒక నూతన లోకము సమీపమున ఉన్నది!

లోక రుగ్మతలను బాగుచేయుటకు ప్రతిపాదనలు వృద్ధియగుచున్నవి. సాధారణంగా, సంబంధ, సహకారములు, ఆలాగే ప్రపంచవ్యాప్తముగా దేశములన్నింటిచే చేయబడు సహకార ప్రయత్నములు అవసరము. పరిస్థితి విషమించే కొలది, పరస్పర నిలకడను గూర్చిన ఆవశ్యకత, తమ ప్రాధాన్యతలనుగూర్చి అంచనా వేసికొనుటకు దేశాలు బలవంతపెట్టబడునని, ఒక నూతనమైన నిలకడైన లోకమును స్థాపించుట కొరకు కలిసి కృషిచేయుదురనే తలంపు ఉన్నది. పరిసరముల ప్రమాదమును ఎదుర్కొనుటకు ఖర్చుచేయుచున్న మిలటరీ వ్యయములో ఎక్కువ కోత విధించుదురని తలంచబడెను మరియు స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ 1990 నందు పేర్కొనబడిన విధముగా “విస్తృతమైన తమ స్వంత రక్షక దళములను కొనసాగించుటకు బదులుగా బహుగా విస్తరించబడి బలమును పుంజుకున్న ఐక్యరాజ్య సమితియొక్క శాంతి రక్షక దళముపై ప్రభుత్వములు ఆధారపడవచ్చును, కలహమునకు కాలు దువ్వినవారి బారినుండి ఏ సభ్యదేశమునైనా కాపాడుటకు అధికారమును, శక్తిని అది కలిగియున్నది.”

అయితే ప్రారంభ పేజిలలో పేర్కొనబడినటువంటి కోరదగిన పరిస్థితులను తెచ్చుటలో అట్టి పథకములు ఎంతో విఫలమైనవి. కేవలం మానవ తంత్రములే మానవుల పాపములను, పేరాశను ఏ విధము చేతనైనను నయము చేయజాలవు; ద్వేషమును జాతి విభేదములను అవి తొలగించలేవు; మానవాళియంతటిలో నిస్వార్థమైన ప్రేమను అవి పుట్టింపజాలవు; రోగము మరియు మరణమును అంతమొనర్చగలవని అభయమివ్వలేవు. నేరము అంత తీవ్రమైనదిగా పేర్కొనబడడంలేదు, లేదా మత సంబంధమైన వ్యత్యాసములను, ద్వేషములను అధికమించగలమని కూడ పేర్కొనలేదు. ప్రకృతి వైపరీత్యములను తొలగించుదమనే విషయాన్నే పరిశీలించలేదు. సమస్యలకు కారణభూతమైన జాతీయతా భావము నిలిచియుండునటుల అనుమతించబడెను. దుఃఖకరమైన విషయమేమంటే, పనిచేయదగు పరిష్కారమును తెచ్చుటలో మానవులు విఫలులైరని మనము ముగించాల్సిందే.

అయినను, పరిష్కారమున్నది! అవును, మానవులు కోరుకొనే యిట్టి సంగతులన్నియు వాగ్దానము చేయబడినవి, ఆ వాగ్దానము “అబద్ధమాడనేరని” దేవునినుండి వచ్చినది. (తీతు 1:2) అందుకొరకు ఏమి చేయవలెనో ఆయనకు ఖచ్ఛితముగా తెలియును, మరియు తాను సంకల్పించిన దానిని చేయడానికి జ్ఞానము, శక్తి, సామర్థ్యములును అయన కలిగియున్నాడు.—ప్రకటన 7:12; 19:1.

దేవుడిలా వాగ్దానము చేయుచున్నాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు; వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడక పోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:10, 11.

ఇది ఎలా సాధించబడును? యెషయా 11:9 ఇట్లు ప్రత్యుత్తరమిచ్చుచున్నది: “నీ పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.” అవును, మానవులంతా “యెహోవాను గూర్చిన జ్ఞానముతో” ఉపదేశము నొందుదురు. దానితో ఏకీభవించుటకు నిరాకరించు ఏ వ్యక్తులైనా యితరుల సమాధానమును చెరచుటకు అనుమతించబడరు. సుందరమైన మన భూమి యిక ఎన్నటికి పాడుచేయబడదు.

“యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, . . . ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు,” అని కీర్తన 46:8, 9 వాగ్దానము చేయుచున్నది. (మీకా 4:3, 4 కూడా చూడుము.) జాతీయతా విభేదములను అంతమొనర్చుట ప్రపంచశాంతిని తెచ్చుటలో ఒక ముఖ్యాంశము. సహకారము అభయమివ్వబడెను, ప్రపంచమంతటా ఒకే ప్రభుత్వముండును—అది దేవుని ప్రభుత్వము. ఆయన ప్రభుత్వము “ఎన్నటికి లయము కాని” రాజ్యము. (దానియేలు 2:44) అంతేకాదు, పునరుత్థానము చేయబడిన, అమర్త్యుడైన యేసుక్రీస్తు దానికి రాజు, ఆయన నీతిన్యాయములను బట్టి పాలించును.—యెషయా 9:6, 7; 32:1.

అయితే మానవుని వారసత్వపు అపరిపూర్ణతను బట్టి అది పాడుచేయబడి మరియు కొనసాగునట్టి బాధ, రోగము, వ్యాకులత, మరణముచేత అది చెరచివేయబడునా, లేదు, ఇవికూడ గతించిన సంగతులై యుండును. ప్రకటన 21:4 మనకిలా అభయమిచ్చుచున్నది: “ఆయన వారి కన్నుల ప్రతిబాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయెను.” యేసు క్రయవిమోచన బలి ఆధారముగా వారసత్వపు పాపము క్షమించబడును, మానవులు తిరిగి పరిపూర్ణ స్థితికి తేబడుదురు. (రోమీయులు 6:23; ఎఫెసీయులు 1:7) ప్రకృతి శక్తులను వాటి సృష్టికర్తకన్నా ఎవరు బాగుగా అదుపు చేయగలిగి, మానవులకు హానిచేయకుండా ఆపగలరు?—కీర్తన 148:5-8; యెషయా 30:30.

మానవుడు కేవలము నిరీక్షించి, కలగనే సంగతులను దేవుడు అనుగ్రహించును. అయితే ఎప్పుడు? దేశములు “ఆగ్రహించినప్పుడు” మరియు మానవులు “భూమిని పాడుచేయు” సమయమున అట్టి మార్పులు వచ్చునని బైబిలు ప్రవచనములు చూపుచున్నవి. (ప్రకటన 11:18) పాతలోకముయొక్క అంత్య దినములు “వ్యవహరించుటకు కష్టమగు క్లిష్టకాలములతో” గుర్తింపబడును—దానిమూలముగా నేడు మనము మనచుట్టూ హీనమైన పరిస్థితులను చూచుచున్నాము. (2 తిమోతి 3:1-5, 13 NW) అట్టి సంగతులను చూచిన తరమే, దేవుని వాగ్దానముల నెరవేర్పునుకూడ ఆ తరమే చూచునని యేసు ప్రవచించెను.—మత్తయి 24:3-14; 32-34.

బైబిలులో వ్రాయబడిన ఆ వాగ్దానములను పరిశీలించుటకు సమయమును తీసికొనుము. ఒక నూతన లోకమునకు ఇదియే సమయము! అను అంశముపై జ్ఞానముగల మనుష్యులు మరియు దేవుడు వీరిరువురు అంగీకరించుచున్నారు. (w90 10/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి