ఇట్టి కాలము కొరకు మీరు పరితపిస్తున్నారా ఎప్పుడైతే . . .
◻ దినములో ఏ సమయమందైనా—మీరు మీ గృహములో క్షేమంగా, సురక్షితంగా ఉండగలరో?
◻ తాళములు, అడ్డగడియలు, అలారములు, తొంగిచూచే రంధ్రములు, కంచెలు, కావలివారు, కాపలా కుక్కలు మరియితర భద్రతా ఏర్పాట్లు అవసరము ఉండవో?
◻ మీరు రాత్రియందుకూడ ఒంటరిగా వీధులలో సంపూర్ణ రక్షణతో నడువగలరో?
◻ హానికరమైన మాదక ద్రవ్యములు దాని సంబంధిత సమస్యలు మరువబడునో?
◻ అన్ని రకములైన యుద్ధములు అంతమై, ఇక ఆయుధముల తయారీ లేదా నిల్వలు ఉండవో?
◻ కలుషితమైన ఆహారము, గాలి, నీరు వీటినిగూర్చి ఇక నీవు చింతించనవసరము లేదో?
◻ ఉగ్రవాదము, బందీలుగా పట్టుకొనడం, మరియు బాంబులను గూర్చిన భయాందోళనలు పూర్తిగా తొలగించబడునో?
◻ భూమియొక్క సహజవనరులు కాపాడబడి, సక్రమంగా వినియోగించబడి, అందరి ప్రయోజనము కొరకు జ్ఞానయుక్తముగా వాడబడునో?
◻ పేరాశ, స్వార్థము మానవులను పురికొల్పే శక్తులుగా ఇక ఎన్నటికి ఉండకపోవునో?
◻ పిల్లలు అమాయకులుగానే కొనసాగి, యితరులయెడల, వారి ఆస్తియెడల గౌరవంగా వ్యవహరించుదురో?
◻ స్త్రీలు అణచివేయబడక, బాధింపబడక యుందురో?
◻ చట్టములు, నియమనిబంధనలు తేటగాయుండి అందరి ప్రయోజనము కొరకు న్యాయంగా అమలు జరుపబడునో?
◻ రాజకీయ ప్రయోజనము కొరకుకాక, నిజమైన అవసరతలపై ఆధారపడి ప్రభుత్వము నిర్ణయము తీసికొనునో?
◻ స్వాతంత్ర్యము, సమానత్వమనేవి కేవలం ప్రచారము కొరకు మాత్రమే కాక, ఆచరణలో పెట్టబడునో?
◻ ఇక ఎన్నటికిని పేదరికము ఉండక, అందరూ తమ ఆరోగ్యము, సంక్షేమము, సంతోషముల కొరకు అవసరమైన దేనినైనను కలిగియుందురో?
◻ పిల్లలు కోరదగినవారై, లక్ష్యము చూపబడి, ఎన్నటికి పాడుచేయబడక లేదా విడువబడక యుందురో?
◻ రోగము, మరణము జయించబడి, భయంకరమైన తెగుళ్లు ఇక ఉండవో?
◻ మీరు కలిసే ప్రతివారు దయకలిగి, సహాయము చేయువారై నమ్మదగిన వారిగా ఉందురో?
◻ ప్రతిఒక్కరి జీవము విలువైనదిగా ఎంచబడి, అందరూ శాశ్వత సంతోషమును కనుగొందురో?
◻ మతము ఇక ఎన్నటికి విభాగిత శక్తిగా ఉండి, మతోన్మాదము, ద్వేషము యుద్ధములకు నడిపించేదిగా ఉండకపోవునో?
◻ నివసించుటకు అందరికి తగినంత, ఆహ్లాదకరమైన స్థలములు ఉండి, గృహములేని వారు అనునది గతించిన సంగతైయుండునో?
పైనున్న వాటిలో దేనికైనను మీరు అవును అని చెప్పగల్గితే, దీని తరువాతి శీర్షికలను చదువుటకు మీరు ఆసక్తి చూపుదురు. (w90 10/1)