కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 11/1 పేజీలు 16-17
  • బహుశా నీకు తెలిసియుండని యొర్దాను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బహుశా నీకు తెలిసియుండని యొర్దాను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • హూల హవాయి యొక్క నృత్యం
    తేజరిల్లు!—1996
  • గలిలయ సముద్ర ప్రాంతాన్ని పర్యటిద్దాం రండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యోర్దాను నది దాటడం
    నా బైబిలు కథల పుస్తకము
  • గిలాదు బలాఢ్యులకు పుట్టినిల్లు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 11/1 పేజీలు 16-17

వాగ్థానదేశమునుండి దృశ్యములు

బహుశా నీకు తెలిసియుండని యొర్దాను

యొర్దాను నది పేరు వినగానే మీకు తెలిసియున్న కొన్ని దృశ్యములు మీ మదిలోకి వస్తాయి: యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు దాని ఆరిన నేలమీదుగా యెరికోయొద్ద దాటుట; కుష్టురోగము నుండి స్వస్థతపొందుటకు నయమాను దానినీటిలో ఏడుమారులు స్నానముచేయుట; యోహాను వలన బాప్తిస్మము పొందుటకు అనేకమంది యూదులు, ఆ తదుపరి యేసు ఆయనయొద్దకు వచ్చుట మొదలగునవి.—యెహోషువ 3:5-17; 2 రాజులు 5:10-14; మత్తయి 3:3-5, 13.

సాక్ష్యాధారమునుబట్టి, ప్రసిద్ధమైన ఈ సంఘటనలన్నియు పొడవాటి మరియు బాగుగా తెలియబడిన యొర్దాను భాగమందు, అనగా గలిలయ సముద్రానికి దక్షిణమునుండి మృతసముద్రము వరకుయున్న భాగమందు జరిగాయి. అయితే దేవునివాక్యమును శ్రద్ధతోపఠించు విద్యార్థులు యొర్దానుయొక్క మరొక భాగమును—అంటే నదియొక్క ఉత్తరభాగమును మరియు దానిచుట్టుప్రక్క ప్రాంతాలను గమనించియుండక పోవచ్చును. పటమును గమనించుము.a మధ్యలోగల దిగువైన భాగము యొర్దాను నది లోయయొక్క భాగము. భౌగోళిక సంబంధముగా భూగర్భమందలి రాతిపొరలలోని తారతమ్యములు సిరియానుండి ఆఫ్రికా వరకు వ్యాపించియున్నవి.

యొర్దాను నదికి ముఖ్యమైన మూడు మూలములు ఎత్తైన హెర్మోను పర్వతమునుండి కరగివచ్చు మంచు ప్రవాహములే. తూర్పువైపునుండి వచ్చుప్రవాహము (పటములో చూపబడినది) పర్వతపు సున్నపురాళ్ల ఎత్తైన చరియలనుండి ప్రారంభమగును. ఇచ్చటనే ఫిలిప్పుదైన కైసరయ ఉన్నది; యేసు తాను “ఎత్తయిన ఒక కొండమీద” రూపాంతరము పొందకమునుపు ఈ స్థలమును దర్శించినది జ్ఞాపకము తెచ్చుకొనుము. (మత్తయి 16:13–17:2) ఇంకొక ప్రవాహము దాను పట్టణము కట్టబడిన ఎత్తయిన కొండప్రాంతమునుండి ఉద్భవించును. ఉత్తరరాజ్యపు ఇశ్రాయేలీయులు ఇచ్చటనే బంగారుదూడను చేసినది. (న్యాయాధిపతులు 18:27-31; 1 రాజులు 12:25-30) ఈ రెంటితోపాటు ఇంకొక ప్రవాహము కలసి యొర్దాను నదిగా తయారవుతుంది. ఇది దాదాపు ఏడు మైళ్ల దూరములో వెయ్యి అడుగుల ఎత్తునుండి ప్రవహిస్తుంది.

తదుపరి ఈ లోయ హూలా సరస్సు ప్రవాహప్రాంత నీటి మడుగులుగా విస్తరించి, యొర్దాను నీరు పారుటవలన బురదప్రాంతమును కలుగజేస్తుంది. పురాతనకాలమందు ఒక చెరువువలె కూడిన నీటిని హూలా సరస్సు (లేక హూలె) అని పిలిచారు. ప్రస్తుతము హూలా సరస్సు లేదు. ఎందుకనగా ఇటీవల యొర్దాను పైభాగమును సమముచేసి ఈ బురదప్రాంతము ఎండిపోవునట్లు చేయుటకు యొర్దానుకు కాలువలను కట్టించారు. సరస్సుయొక్క ఒరలును తోతుచేయబడినవి. కాబట్టి గలిలియ సముద్రమునకు ఉత్తరముగా హులా సరస్సు ప్రాంతమును పటములో గమనించిన ఆపటము పురాతనకాలమందు ఎలా కనిపించి ఉంటుందో నీవు తెలిసికొనవచ్చును. అయితే ఈనాడు అట్లు కనిపించుటలేదు.

ఒకవేళ నీవు దర్శించినట్లయిన బైబిలు కాలములలో ఆ ప్రాంతము ఎట్లు కనిపించి ఉంటుందో అను తలంపునిచ్చుటకు అనువైన సహజముగా ఏర్పడిన నీటి మడుగులను చూడగలవు. బైబిలు కాలములో కొన్ని ప్రత్యేక రకములైన మొక్కలు, జమ్ము, రెల్లు మొదలగునవి పెరుగుటకు అది అనువైన ప్రాంతముగా ఉండేది.—యోబు 8:11.

ఆ ప్రాంతము వచ్చివెళ్తుండు పక్షులకు నిలయమైయుండెను. ఇచ్చట ఏర్పడిన బురద, మరియు నీటిమడుగుల ప్రాంతము ఐరోపానుండి ఆఫ్రికా మధ్య వలసవెళ్లు పక్షులకు శ్రేష్టమైన విశ్రాంతి స్థలముగాయున్నందున సంకుబుడికొంగలు, కొంగలు, గూడబాతులు, గువ్వలు మరియు ఇతర పక్షులు ఎక్కువగా ఉండేవి. (ద్వితీయోపదేశకాండము 14:18; కీర్తన 102:6; యిర్మీయా 8:7) ఈ ప్రాంతమునకు సంబంధించిన ఇతర ప్రాణులు చాలా తక్కువగా కనపడుతుండేవి. అయితే అవి అచ్చట ఉన్నందున హూలా ప్రవాహప్రాంతముగుండా వెళ్లుటను కోరుకొనేవారు కాదు. వాటిలో సింహము, ఖడ్గమృగము, తోడేలు, అడవిపందులు ఉండేవి. (యోబు 40:15-24; యిర్మీయా 49:19; 50:44; హబక్కూకు 1:8) కొన్నిసమయములందు మలేరియా కలుగజేయు దోమలును ఉన్నవి. నిశ్చయముగా బైబిలులో చెప్పబడిన జ్వరములలో ఇది ఒకటి.

కాబట్టి వ్యక్తిగతముగావెళ్లు ప్రయాణీకులుగాని, సమూహములుగా వెళ్లు వర్తకులుగాని ఇచ్చటినుండి వెళ్లరు. అయితే గలిలయ సముద్రమునకు ఉత్తరముగానున్న యొర్దాను నది లోయప్రాంతమందు ఎక్కడినుండి దాటివెళ్లుదురు?

గలిలయ సముద్రమునకు దగ్గర బాసాల్ట్‌ రాళ్లతోనిండిన గుట్టలు ఉన్నవి; ఇవి ఆనకట్టవలె నీళ్లను అడ్డగించుచున్నందుననే వెనుక హూలా సరస్సు ఏర్పడుటకు కారణమైనది. భూమినుండి పొడుచుకొచ్చిన రాళ్లగుట్టలను మీరు 16వ పేజీలో చూడవచ్చును. యొర్దాను అక్కడనుండి దక్షిణముగా గలిలయ సముద్రమువైపుగా (దూరముగా కన్పించుచున్నది) వెళ్తుండగా అది ఎంతో వేగముగా ప్రవహించును. అందుచేత దాని నీరు ఎంతో తెల్లగా వచ్చును. స్పష్టముగా పురాతన ప్రయాణీకులు అట్టి లోతైన మరియు సన్ననిత్రోవ గుండా వేగముగా వెళ్లు యొర్దాను నీళ్లను దాటుట అపాయకరము.

హూలా నీటిమడుగుల ప్రాంతమునకు మరియు ఈ సన్నని త్రోవకు మధ్య యొర్దాను నెమ్మదిగా ప్రవహించు చిన్నప్రవాహము కలదు. పూర్వకాలమందలి ప్రయాణీకులు ఇక్కడనుండే సురక్షితముగా దాటగలుగుతున్నందున, వాగ్థానదేశములో అది ముఖ్యరహదారిగా తయారైనది. ప్రస్తుతము ఆ ప్రాంతములో ఒక వంతెన నిర్మించబడింది. ఇప్పుడు యొర్దానును దాటుటకు ఒక ముఖ్యస్థలముగా ఉన్నది.

హూలా ప్రవాహప్రాంతము ఈనాడు సారవంతమైన వ్యవసాయ ప్రాంతముగా ఉన్నది. అచ్చట యిప్పుడు చేపల చెరువులునుగలవు. ఇదంతయు యొర్దాను నుండి క్రిందికివచ్చు విస్తారమైన నీటిమూలముగా సాధ్యమగుచున్నది. (w90 7⁄1)

[అధస్సూచీలు]

a 1990వ సం.పు యెహోవా సాక్షుల కేలండరులోని పెద్దని పటము మరియు బొమ్మతో పోల్చుము.

[17వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

హూల

గలిలయ సముద్రము

[క్రెడిట్‌ లైను]

Based on a map copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel.

[16వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[17వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

Animal photos: Safari-Zoo of Ramat-Gan, Tel Aviv

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి