కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 8/1 పేజీ 3
  • “ఒక శాంతి జాడ్యమా”?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఒక శాంతి జాడ్యమా”?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • శాంతికి ఎలాంటి అవకాశములున్నవి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • శాంతి దాన్నెలా పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 8/1 పేజీ 3

“ఒక శాంతి జాడ్యమా”?

“ఒక శాంతి జాడ్యము.” “ఆహా, ఎంతటి శాంతియుతమైన లోకము.” “అంతటా శాంతి పెల్లుబుకుచున్నది.” గతసంవత్సరము లేదా రెండు సంవత్సరములలో పాఠకులను ఉలికిపడునట్లుగా చేసిన వార్తాపత్రిక ముఖ్యాంశములలో ఇవి ఉన్నవి. ప్రపంచమంతటా, నిరాశ మరియు వినాశనమునుండి ఆశాజనకమైన రీతిలో వార్తలు మారుచుండుట ఆశ్చర్యము గొల్పుచున్నది. ఏమి సంభవించుచున్నది?

విశేషంగా, అనేక పెద్దపెద్ద పోరాటములన్నీ యిటీవలే ముగింపునకు వచ్చినవి లేదా కొద్దినెలలోనే తీవ్రతను తగ్గించినవి. ఆఫ్రికానందు అంగోలాలో, శాంతి ‘స్థాపించబడింది’. మధ్యాసియాలో, ఆఫ్ఘనిస్తాన్‌నుండి సోవియట్‌ యూనియన్‌ తన బలగమును ఉపసంహరించుకొన్నది. మధ్య అమెరికాలో, నికరాగువ ప్రభుత్వమునకు కోంట్రా తిరుగుబాటుదారులకు మధ్య పోరాటము అణగారిపోయింది. ఆగ్నేయాసియాలో, వియత్నామ్‌ కంపూచియానుండి ఉపసంహరించుకొనుటకు అంగీకరించింది. ఇరాన్‌, ఇరాక్‌లమధ్య ఘాతుక యుద్ధము తుదకు నిలిచిపోయేసరికి “శాంతి జాడ్యము” మధ్య ప్రాచ్యమునకు కూడ చేరుకున్నది.

అగ్రరాజ్యాలమధ్య ఏర్పడిన క్రొత్తవాతావరణము బహుశ మరింత గుర్తింపదగినదైయున్నది. 40 సంవత్సరముల పోరాటానంతరం, పరస్పర శ్రేయస్సులను గూర్చిన వ్యక్తత సోవియట్‌ యూనియన్‌ మరియు యునైటెడ్‌ స్టేట్స్‌ మధ్య శాంతినిగూర్చి జరుగుచున్న సంయుక్త ప్రయత్నములవంటి సఖ్యతాభినయములను నమ్ముట కష్టతరంగా ఉన్నవి. అంతేకాదు, ది ఎకానమిస్ట్‌ ప్రకారము, ఐరోపా దాని చరిత్రయంతటిలో యుద్ధము లేకుండా కొనసాగిన దీర్ఘకాలమును కలిగిన గుర్తింపును పొందినది. నిజమే, వార్తలలో శాంతి కన్పించుచున్నది.

దాని భావమేమిటి? “మనకాలమునకు శాంతిని” అందించగల స్థితిలో రాజకీయనాయకులు ఉన్నారా? బ్రిటీషు ప్రధానమంత్రి నైవైలీ ఛాంబర్‌లైన్‌చే యాభై రెండు సంవత్సరముల క్రితం ఈ మాటలు పలుకబడియున్నవి. కొద్దికాలం తరువాత, రెండవ ప్రపంచయుద్ధం చెలరేగినప్పుడు, అవి కుత్సితమాటలని రుజువైనవి. ఎట్టకేలకు ఇప్పుడవి నిజంకానైయున్నవా? (w90 4/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి