కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 7/1 పేజీలు 3-4
  • వారిని మనము మరలా ఎప్పటికైనా చూడగలమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారిని మనము మరలా ఎప్పటికైనా చూడగలమా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • పునరుత్థాన నిరీక్షణ తప్పకుండా నిజమౌతుంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • పునరుత్థాన నిరీక్షణ ఒక వాస్తవం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “లేదు, అలా జరిగి ఉండదు!”
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 7/1 పేజీలు 3-4

వారిని మనము మరలా ఎప్పటికైనా చూడగలమా?

“నీవు మమ్ములను శాశ్వతంగా విడిచివెళ్లావు. అది నిజంగా ఆకస్మిక పరిణామము. కాని నీ మరణము మాకు మానని గాయములను విడిచినను నీవు మా హృదయములలో ఎల్లప్పుడు ఉంటావు. మేము నీతో గడిపిన అద్భుతమైన సంవత్సరములను ఎన్నటికిని మరువము, ఏదోఒకనాటికి నిన్ను తిరిగి చూడగలమను నిరీక్షణను విడువము.”

లక్సెంబర్గ్‌ నందలి గ్రేండ్‌ డచ్చీలో, తమప్రియుడు మరణించిన తరువాత మిగిలియున్న కుటుంబాలు, స్నేహితులు పైన పేర్కొన్నటువంటి భావప్రకటనలను వ్యక్తపర్చుచు వార్తాపత్రికలలో వాటిని ప్రచురించుచుందురు. ప్రపంచమంతటానున్న యితరులు కూడా అట్టి తలంపులు కలిగియుండి వారిని కోల్పోయామన్న నిరాశ అనిశ్చయ నిరీక్షణతో కలగలిపి ప్రేమపూర్వక జ్ఞాపక స్మృతులను కలిగియుంటారు. అట్టి ప్రతిచర్యలు మీరు చూపియుండవచ్చును లేదా ఒక ప్రియుడు చనిపోయిన తరువాత ఒక స్నేహితునినుండి అట్టి మాటలను నీవు వినియుండవచ్చును.

చనిపోయిన తమప్రియులను తిరిగి చూడగలమనే నిరీక్షణ అనేకులకు అస్పష్టముగాను కలవరముగాను ఉన్నది. కారణాలు తేటగా ఉన్నవి. మొదటిదిగా ఈ విషయమును గూర్చి తెలుసుకొనుటకు ఈ దినములలో ఎవరూ సమయాన్ని తీసుకొనడంలేదు. ఎవరైనా ప్రయత్నించినను ఈ ప్రశ్నపై అనేక మతములు అందించిన సమాచారము మరీ అస్పష్టముగాను లేదా ఒప్పించడానికి మరీ వీలుకానిదిగాను ఉన్నది.

మీకు తెలిసియున్నట్లు చనిపోయినవారి “భవిష్యత్తు జీవితము” అనేది కేవలము తమ కుటుంబవంశక్రమమును కొనసాగింపజేయుటయేనని అనేకులు భావిస్తారు. ‘తమపిల్లలయందు వారు జీవిస్తారనే’ దృక్పధాన్ని మీరు వినియుందురు. కాని అట్టి “జీవితము” చనిపోయినవారికి ఏదైన ప్రయోజనమును తెచ్చునా, లేక విడువబడినవారికి వారిని మరలా చూడగలమనే నిరీక్షణయివ్వగలదా? లేదు. కనుక అట్టి తలంపునందు నిజముగా కొద్దిపాటి ఉపశమనమే కలదు.

మనము ప్రేమిస్తున్న మన స్వంతప్రియులయెడల మనకున్న శ్రద్ధవలన చనిపోయినవారు, యింకా బ్రతికియున్న ఈ యిరువురుని గూర్చి ఈ ప్రశ్నలకు సమాధానమవసరము: మనము ప్రేమిస్తున్న ఒకరు చనిపోయినయెడల ఆయన్ని మనము మరలా ఎప్పటికైనా చూడగలమా? సమాధానము అవునన్నట్లయితే అది ఎప్పుడు మరియు ఎక్కడ? పరలోకంలోనా? లేక భూమిమీదనా? నిజంగా మనకు, మనము ప్రేమిస్తున్న మృతులకు భవిష్యత్తునందు ఏ నిరీక్షణ ఉన్నది?

నిజము చెప్పాలంటే ఈ ప్రశ్నలకు మంచి వార్తే ఉన్నది. మంచిదనగా అంత ఖచ్చితమైన ఉల్లసభరితమైన నిరీక్షణ ఉన్నదని అర్థము. అనేకులు మతములనుండి విన్నదానికి కూడా అది వ్యత్యాసముగల వర్తమానము గనుక, అది వార్తయైయున్నది.

మనసామాన్యశకము మొదటి శతాబ్దమునందు క్రైస్తవ మిషనరీయైన పౌలు గ్రీసునందలి ఏథెన్సులో ఉన్నప్పుడు చనిపోయినవారిని గూర్చిన లేఖనాధార నిరీక్షణను ఆయన మాట్లాడెను. కొందరు బహుశ్రద్ధగా విన్నారు. కాని ఇతరులు నిర్లక్ష్యంగా విన్నారు. తత్వవేత్తలు కొందరు అతనితో వివాదాస్పదమైన సంభాషణను కొనసాగించాలని తలంచి యిలా అన్నారు: “ఈ వదరుబోతు ఏమి చెప్పదలచుకున్నాడు?” “అతడు యేసునుగూర్చియు పునరుత్థానమును గూర్చియు (సువార్తను) ప్రకటించెను గనుక-మరికొందరు వీడు ‘అన్యదేవతలను ప్రచురించుచున్నాడనిరి.’” (అ.కార్యములు 17:18) అవును, పౌలు చెప్పదల్చుకున్న సువార్తయందు పునరుత్థానము కూడా ఉన్నది!

చనిపోయినవారిని మరలా సజీవంగా చూస్తామన్న భవిష్యత్తు పునరుత్థానమును గూర్చి మాటలాడుటను మీరు ఎలా దృష్టిస్తారు? అనవసరమైన ప్రస్తావనగా అన్పించుచున్నదా? లేక మీ మత బోధలవలన మీ స్వంత దృక్పథములవలన చనిపోయిన వారి నిరీక్షణను గూర్చి పరిశుద్ధలేఖనములందుగల వర్తమానము ఏదో ‘అన్యదేవత’లనుండి వచ్చుచున్న దానిగా మీకు క్రొత్తగా వింతగా తోచుచున్నదా?

ఏథెన్సువారలు పౌలుతో: “కొన్ని క్రొత్తసంగతులు మాచెవులకు వినిపించుచున్నావు గనుక వీటిభావమేమో మేము తెలుసుకొనగోరుచున్నాము” అని అన్నారు. (అ.కార్యములు 17:20) చనిపోయిన మనవారిని గూర్చి జీవిస్తున్న మనలనుగూర్చి బైబిలు నిరీక్షణ ఏమిటో మీరుయింకా నేర్చుకొనగోరుచున్నారా? అట్లయితే తదుపరి శీర్షిక మీకు ఆసక్తిని కలిగించును. (w89 6/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి