రాజ్యప్రచారకుల నివేదిక
ప్రేమ కుటుంబములను ఐక్యపరచును
వివాహము నిస్వార్థముచే నడిపింపబడిన ప్రేమపై ఆధారపడినప్పుడే కుటుంబ ఐక్యత సాధించబడగలదు. అట్టి ప్రేమ ప్రేమాస్వరూపియగు యెహోవానుండి పుట్టును. అందుకే అది దేవుని ఆత్మఫలమైయున్నది. (గలతీయులు 5:22, 23; 1 యోహాను 4:8) క్రింద చూపబడిన ఉదాహరణలు బైబిలు జ్ఞానముపై ఆధారపడిన ప్రేమ కుటుంబములను ఎలా ఐక్యపరచినదో వివరించుచున్నవి.
హాంగ్ కాంగ్
◻ హాంగ్ కాంగ్‌లో ఒకగృహిణి ఆమె ఇద్దరు కుమార్తెలతో ఒక పయినీరు గృహబైబిలు పఠనమును ప్రారంభించాడు. అందుకు భర్త ఆమె ఒక విప్లవాత్మకమైన మతగుంపులో ఏకమవుతుందేమోనని చింతను వెలిబుచ్చెను. పయినీరు ఆ భార్యతో ఆమె తన భర్తనుకూడా పఠనమునకు ఆహ్వానించి తనమట్టుకు తననే నిర్ణయించుకొనమని సలహాయివ్వగా ఆయన అట్లు చేసెను. భార్య ఇంతలో కూటములకు హాజరగుటను ప్రారంభించినది, అయితే పిల్లలకు శిక్షణయిచ్చుటయందు ఆమె సమస్యను కలిగియుండెను. ఎప్పుడూ ఆమె పెద్ద అమ్మాయిని దూషిస్తు చిన్నదాన్ని పాడుచేస్తుండేది. తరువాత తనకు తనభర్తకు మధ్య సమస్యలున్నవని బయటపడింది. వారి తగవులాటలు దౌర్జన్యకరరీతిగా ప్రవర్తించునంతవరకు వెళ్లి, అనేకసార్లు పోలీసులను పిలిపింపవలసి వచ్చెను. తమవివాహములో దైవికప్రేమను ఎట్లు కనపరచవలెనో బోధించుటకు పయినీరు శక్తివంతమైన దేవునివాక్యమును ఉపయోగించాడు. త్వరలో పాత పద్ధతులు అలవాట్లు మార్పుచెందటం మొదలయ్యింది. ఇద్దరు కూటములకు క్రమంగా హాజరగువారయ్యారు. కుటుంబంలో ఎంతో సంతోషదాయకమైన వాతావరణం నెలకొంది. భర్త పొగత్రాగుటను విడిచిపెట్టి ఇప్పుడు దైవపరిపాలనా పాఠశాలలో ప్రవేశించాడు. భార్య ప్రస్తుతము బాప్తిస్మము తీసుకొనిన ప్రచారకురాలు.
దేవుని ఆత్మఫలమైన ప్రేమను ప్రదర్శించుటద్వారా కుటుంబ ఐక్యత సాధించబడింది.
బ్రిటను
◻ తన భార్యతో వ్యవహరించునప్పుడు ప్రేమ, సహనము, ఓర్పును కనపరచు భర్తను యెహోవా ఎట్లు ఆశీర్వాదించునో బ్రిటనులోని ఒక అనుభవము వివరించుచున్నది. 12 సంవత్సరముల క్రితం భర్త సత్యంలోకి వస్తున్నప్పుడు భార్యయొక్క తీవ్రమైన వ్యతిరేకత ఆమెను చట్టబద్ధమైన విడాకులు తీసుకొనునట్లు నడిపించింది. అయినను భర్త ఆమెయెడల దయను చూపిస్తు, క్రమమైన పద్ధతిలో చిన్నసరకులను ఇప్పించుటతో పాటు ఆమె ఆర్థికంగా శ్రద్ధతీసుకొనబడునట్లు చేశాడు. గత తీవ్ర వ్యతిరేకతయున్నను, భర్త నాలుగు సంవత్సరముల తర్వాత మరలా ఒకసారి సత్యము ఆమెకు చెప్పబడునట్లు తీర్మానించుకొనెను. ఒక సహోదరి ఆమెతో బైబిలును పఠించునట్లు ఆయన సలహాయివ్వగా ఆమె అంగీకరించుట ఆయనకెంతో ఆశ్చర్యమును కలిగించింది. చివరకు సత్యము విషయంలో ఆమె స్థానమును తీసుకొన్నదై బాప్తిస్మము తీసుకొనినది. భర్త ఎప్పుడును తనప్రేమను తీసువేసుకొనలేదు. సత్యమును తన స్వంతముగా చేసికొన్నదని రుజువైనప్పుడు తనను మరలా వివాహము చేసికొనమని ఆయన అడిగెను. గతమందలి ఆమె చెడుదృక్పథమునుబట్టి ఆయన ఇలాచేస్తాడని ఊహించనిదై దీనికి ఎంతో పులకరించిపోయింది. వారుతిరిగి పెండ్లిచేసుకొని దాదాపు ఎనిమిది సంవత్సరములైనది. సత్యమందు ఇద్దరు బాగా వృద్ధిచెందుతున్నారు.
దక్షిణ పసిఫిక్
◻ 20 సంవత్సరముల క్రితము టువాలు ద్వీపములోని ఒక యౌవనుడు తనకు లిటరేచర్ కావలెనని వాచ్‌టవర్ సొసైటికి వ్రాశాడు. ఆ సమయంలో ఆ ద్వీపంలో సాక్షులు లేరు. అయినప్పటికిని తనకైతానే సాహిత్యములను చదివి దానిని సత్యమని గుర్తించాడు. తన భార్య ఆయన నూతన విశ్వాసమును తీవ్రముగా వ్యతిరేకించగా తాను దానిని వదలివేశాడు.
ఇటీవల, టువాలుయన్ భాషలో సాహిత్యము లభ్యముకాగా భార్య కొన్ని ప్రచురణలను పొంది తనకైతాను వాటిని చదవగలిగింది. ఇప్పుడు ఆమె సత్యమును గుర్తించి తన భర్తకిట్లు ఫిర్యాదుచేసింది: “ఇన్ని సంవత్సరములవరకు నీ యొద్ద వెలుగును కలిగియున్నావు. కాని దానిని పైకెత్తి పట్టుకొనలేదు. సాక్షులు సరైనవారని నీవు ఎందుకు నమ్మావో కనీసం నాకెందుకు వివరించలేదు?” ఇప్పుడు ఈ దంపతులు బైబిలు సత్యమందు ఐక్యపరచబడినవారై సాక్షులతో సహవసించటం ప్రారంభించారు.
ఫిజిలో పాఠశాల కెళ్తున వారి ఇద్దరు కుమార్తెలు ఇంటికి తిరిగివచ్చినప్పుడు తాము యెహోవాసాక్షులుగా కావాలనుకొనుచున్న వారి తీర్మానమును తెలియజేశారు. పిల్లలను బైబిలు పఠనములో తమతో కలవమని ప్రోత్సహించారు, కాని పిల్లలు అప్పటికే ఫిజిలో కూటములకు హాజరవుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. కుటుంబమంతా సత్యమును సంతోషముగా అంగీకరించారు. తండ్రి, తల్లి, కుమార్తెలలో ఒకరు రాజ్యప్రచారకులయ్యారు.
ప్రపంచవ్యాప్తముగా బైబిలుసత్యము మరియు ప్రేమ ఎట్లు కుటుంబములను ఐక్యపరచునో చూచుట ఎంత ఆనందమును కలిగించును. (w89 4/1)