ఎపిసోడ్ 3
“నేనే ఆయన్ని”
నీళ్లవల్ల, పవిత్రశక్తివల్ల పుట్టడం గురించి యేసు నీకొదేముకు వివరించాడు (gnj 3 00:00-04:43)
ఎడారిలో సర్పాన్ని పైకెత్తినట్టే మానవ కుమారుడు కూడా ఎత్తబడాలి (gnj 3 04:43-05:02)
దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి లోకానికి తీర్పు తీర్చడానికి కాదుగానీ, రక్షించడానికే పంపించాడు (gnj 3 05:02-07:52)
యోహాను యేసు గురించి చివరిగా ఇచ్చిన సాక్ష్యం (gnj 3 08:08-10:19)
పైనుండి వచ్చిన వ్యక్తి మీద, అంటే కుమారుని మీద విశ్వాసం ఉంచడమే శాశ్వత జీవితం (gnj 3 10:19-11:45)
యోహానును చెరసాలలో వేశారు (gnj 3 11:45-13:28)
అలసిన యేసు సమరయలోని సుఖారులో ఉన్న యాకోబు బావి దగ్గరికి వచ్చాడు (gnj 3 13:28-14:35)
యేసు సమరయ స్త్రీతో మాటలు కలిపాడు (gnj 3 14:35-16:52)
యేసు సమరయ స్త్రీకి సత్యారాధన గురించి చెప్పాడు (gnj 3 16:52-18:39)
యేసు సమరయ స్త్రీతో తానే మెస్సీయ అనే నిజాన్ని బయటపెట్టాడు (gnj 3 18:39-19:06)
సమరయ స్త్రీ వేరేవాళ్లకు సాక్ష్యమిచ్చింది (gnj 3 19:06-19:45)
యేసు దేవుని ఇష్టం చేయడాన్ని ఆహారంతో పోల్చాడు; ఆధ్యాత్మిక కోత గురించి మాట్లాడాడు (gnj 3 19:45-21:15)
చాలామంది సమరయులు యేసును “లోక రక్షకుడని” నమ్మారు (gnj 3 21:15-22:07)
యేసు గలిలయలో ప్రకటించడం మొదలుపెట్టాడు (gnj 3 22:07-23:07)
గలిలయలోని కానాలో యేసు ఒక అధికారి కొడుకును బాగుచేశాడు (gnj 3 23:07-26:20)
నజరేతులోని వాళ్లు యేసును తిరస్కరించారు (gnj 3 26:20-30:48)
యేసు కపెర్నహూముకు వెళ్లాడు (gnj 3 30:53-31:56)
అద్భుతరీతిలో చేపలు పడ్డాయి; మొదటి శిష్యుల్ని పిలిచాడు (gnj 3 31:56-39:34)