కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 11/8 పేజీలు 26-27
  • అనవసరమైన చింతను గూర్చి జాగ్రత్త వహించండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అనవసరమైన చింతను గూర్చి జాగ్రత్త వహించండి!
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరియైన చింతలు లేదా శ్రద్ధ
  • అనవసరమైన చింతను విడనాడడం
  • కంగారుగా ఉంటే ఏమి చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • మీ ఆందోళనంతా యెహోవా మీద వేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీ చింత యావత్తు యెహోవాపై వేయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • కంగారు
    తేజరిల్లు!—2016
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 11/8 పేజీలు 26-27

అనవసరమైన చింతను గూర్చి జాగ్రత్త వహించండి!

చింతను గురించి మనమెందుకు శ్రద్ధ వహించాలి? మనం చింతల్లో మునిగిపోయిన గడియలు లేవంటారా? అవును, ఉన్నాయి. అయితే అనవసరంగా చింతించడం, మన ఆరోగ్యాన్ని పాడుచేయవచ్చు. అది కృంగుదలకు నడిపించగలదు, బలాన్నీ, చొరవతీసుకునే సామర్థ్యాన్నీ హరించివేయగలదు. ఒక ప్రేరేపిత సామెత ఇలా చెబుతోంది: “ఒకని హృదయములోని విచారము [చింత] దాని క్రుంగజేయును.” (సామెతలు 12:25)

చింతల మూలంగా శరీరం నిర్వర్తించే ధర్మాల్లో తీవ్రమైన మార్పులు రావచ్చని పరిశోధన తెలియజేస్తోంది. హౌ టు మాస్టర్‌ యువర్‌ నెర్వ్స్‌ అనే పుస్తకం ఇలా గుర్తిస్తోంది: “శరీరం పనిచేసే తీరుతెన్నుల్ని చింతలెలా ప్రభావితం చేయగలవో డాక్టర్లకు బాగా తెలుసు. అవి రక్తపోటును పెంచడమో (లేదా తగ్గించడమో) చేయగలవు; రక్తంలో తెల్ల కణాల సంఖ్యను ఉద్ధృతం చేయగలవు; కాలేయంపై అడ్రినలిన్‌ గ్రంథుల చర్య ద్వారా అవి రక్తంలోని గ్లూకోజ్‌పై అకస్మాత్తుగా ప్రభావితం చూపగలవు. మీ గుండె కొట్టుకునే విధానాన్ని కూడా మార్చేయగలవు. డా. చార్లెస్‌ మాయో ఇలా అంటున్నారు: ‘చింతలు రక్త ప్రసరణ వ్యవస్థనూ, గుండెనూ, గ్రంథుల్నీ, మొత్తం నాడీ వ్యవస్థనూ ప్రభావితం చేస్తాయి.’”—డాక్టర్లు పి. స్టీయిన్క్రోన్‌, డి. లాఫియాల రచన, 1970, పే. 14.

అయితే, అంతకన్నా గంభీరమైన విషయమేమిటంటే, అనవసరమైన చింత ఆధ్యాత్మిక హానికి కారణమౌతుందన్నదే. ఆ కారణాన్నిబట్టే, చింతల వల్ల కలిగే పర్యవసానాల్ని గురించి చెప్పడానికి బైబిల్లో ఎంతో ఉంది. చింతించడం లేక బాధపడడం అనే భావాన్ని అనేక హెబ్రీ పదాలు తెలియజేస్తున్నాయి. వాటిలో ఒక పదం (ట్సారర్‌) భౌతిక భావంలో నిర్బంధించబడి ఉండడమని అర్థం, అందుకనే ఆ పదం “మూటకట్టు” “కదలకుండ కట్టు” “ఇరుకుగా ఉండు” అని అనువదించబడింది. (నిర్గమకాండము 12:34; సామెతలు 26:8; యెషయా 49:19) అలంకారిక భావంలో దానికి “కలవరం”; ‘శ్రమలో ఉండడం’ అని అర్థం. (ఆదికాండము 32:7, పరిశుద్ధ బైబిల్‌; 1 సమూయేలు 28:15) మరొక పదం డేయాగ్‌, ‘చింతించడం,’ ‘జడిసిపోవడం’ అని అనువదించబడింది; అది డియాగహ్‌ అనే పదానికి సంబంధిత పదం, దానికి ‘విచారము’ అని అర్థం. (1 సమూయేలు 9:5; యెషయా 57:11; సామెతలు 12:25) గ్రీకు నామవాచకమైన మీరిమ్నావో, “విచారము” అని అనువదించబడింది, దాని సంబంధిత పదమైన మిరిమ్నేయొకు ‘చింతించడం’ అని అర్థం.—మత్తయి 13:22; లూకా 12:22.

ప్రస్తుత విధానంలో తరచూ జీవితంలో తరచూ ఓ భాగమై పోయిన సమస్యల్ని గురించి చింతించడం, దేవుని “వాక్యము”పట్ల ఉన్న ప్రశంసను పూర్తిగా అణచివేయవచ్చని యేసుక్రీస్తు సూచించాడు. ముండ్ల తుప్పలు మొక్కల్ని అణచివేసి వాటిని ఎదగనీయకుండా, ఫలాలు ఫలించకుండా ఎలా చేస్తాయో అలాగే, చింతలు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని నిరోధించి, దేవునికి స్తుతుల్ని తెచ్చే ఫలాల్ని ఫలించకుండా చేయగలవు. (మత్తయి 13:22; మార్కు 4:18, 19; లూకా 8:7, 11, 14) ఆధ్యాత్మిక ఆసక్తులను హరించివేసేంత మేరకు తమ జీవితాలను శాసించేలా ఆ బాధల్ని అనుమతించిన వ్యక్తులు, దేవుని కుమారుడు తన మహిమతో తిరిగివచ్చినప్పుడు ఆయన ఎదుట అంగీకరింపబడని పరిస్థితిలో ఉంటారనీ, వారు తమ స్థానాన్ని శాశ్వతంగా కోల్పోతారనీ ‘అంత్య దినాల్ని’ గూర్చిన తన ప్రవచనంలో యేసుక్రీస్తు హెచ్చరించాడు.—లూకా 21:34-36.

సరియైన చింతలు లేదా శ్రద్ధ

అయితే, ఏ విషయాలు చింతించతగినవై ఉన్నాయి? మొట్టమొదటిగా, యెహోవా దేవుని సమర్పిత సేవకులు అనుభవించే ఆశీర్వాదాల్ని కోల్పోకుండా ఉండేలా ఆయన్ని ప్రీతిపర్చే వాటిని చేయడం గురించి చింతించడం సరియైన విషయం. అంతేగాక, “నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను” అని కీర్తనల రచయిత భావించినట్టుగా గంభీరమైన తప్పిదాన్ని చేసిన అపరాధి భావించాలి. (కీర్తన 38:18) చేసిన పాపాన్ని గురించి సరైన విధంగా చింతించడం, ఆ తప్పును ఒప్పుకొని, పశ్చాత్తాపాన్ని కనుపర్చి, దాన్ని విడిచిపెట్టేందుకు నడిపిస్తుంది. సర్వోన్నతునితో సత్సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. కాబట్టి క్రైస్తవులందరూ తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక, భౌతిక, వస్తుదాయక సంక్షేమం విషయంలో చింత కల్గి ఉండాలి, లేదా నిజమైన శ్రద్ధను చూపించాలి. (1 కొరింథీయులు 12:25-27) అపొస్తలుడైన యోహాను గాయునకు రాసిన పత్రికలో ఈ విధమైన శ్రద్ధే కనబడింది: “ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.” (3 యోహాను 2) “సంఘములన్నిటిని గూర్చిన చింత” తనకుందని అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (2 కొరింథీయులు 11:28) అందరూ అంతం వరకూ దేవుని కుమారుని నమ్మకమైన శిష్యులుగా నిలిచివుండాలనే చింత ఆయనకు ఎంతగానో ఉండేది.

“ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించ”డాన్ని అంటే దేవుని కుమారుని ఆసక్తుల్ని పెంపొందించే ప్రతీ విషయంపట్లా శ్రద్ధవహించడాన్ని గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. పెండ్లికాని క్రైస్తవులకు భార్యా (భర్తా) పిల్లలపట్ల చూపించాల్సిన శ్రద్ధా బాధ్యతల వంటివి ఉండవు గనుక వాళ్లు “లోకవిషయమైనవాటిని గూర్చి” పెండ్లైన వ్యక్తులకన్నా తక్కువ చింతే ఉంటుంది కనుక, “ప్రభువు విషయమైన కార్యముల”పై మరింత అవధానాన్ని నిలిపే స్థితిలో ఉంటారు.—1 కొరింథీయులు 7:32-35.

మరో వైపున, క్రైస్తవ భర్తలూ, భార్యలూ ‘లోకవిషయమైనవాటిని గూర్చి చింతిస్తారని’ అపొస్తలుడైన పౌలు రాశాడు, వాళ్లకు పెండ్లికాని క్రైస్తవులకులేని అవరోధాలు ఉంటాయి. కుటుంబానికి కావాల్సిన వ్యక్తగతమైన, గృహపరమైన శ్రద్ధా, అలాగే ఇల్లు, ఆహారం, వస్త్రాలూ వంటి జీవితావసరాలు సమృద్ధికరంగా ఉండకపోవొచ్చు, అదే ఒక అవివాహిత వ్యక్తికైతే లెక్కకుమించినవై ఉండొచ్చు. భార్యా భర్తలమధ్య ఉండే అవినాభావ సంబంధాన్నిబట్టి, వాళ్లు యావత్తు కుటుంబ భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సంక్షేమానికి సహాయపడే వాటిని అందించడంలో ఒకరినొకరు ప్రీతిపర్చుకునే విషయమై సముచితంగానే చింతకలిగివుంటారు లేదా శ్రద్ధ వహిస్తారు. రోగాలు, అత్యవసర పరిస్థితులు, శారీరక సంబంధమైన పరిమితులు, అంగవైకల్యం వంటివాటితో పోరాటంసల్పాల్సిన పనిలేకున్నా, పిల్లలుగల తల్లిదండ్రులు సాధారణంగా అవివాహితులైన క్రైస్తవుల కన్నా ఎక్కువగా “లోకవిషయమైనవాటిని గూర్చి చింతించ”డానికి లేదా అలా చింతించేవారై ఉండడానికి అంటే, మానవ జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మికంకాని కార్యకలాపాలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరముంటుంది.

అయినా, కుటుంబాన్ని చూసుకోవలసిన బాధ్యతగల వివాహిత దంపతులు కూడా మరీ అంత ప్రాముఖ్యతను తీసుకునేలా ఐహిక చింతలను అనుమతించకూడదు. యేసుక్రీస్తు లాజరు సహోదరియైన మార్తకు ఆ విషయాన్ని స్పష్టం చేశాడు. తన అతిథికి ఆతిథ్యమివ్వాలన్న చింత మూలంగా, యేసు చెప్పేవాటిని వినడానికి సమయాన్ని ఆమె తీసుకోలేదు. మరో వైపున, మరియ “ఉత్తమమైనదానిని” అంటే దేవుని కుమారుని దగ్గర నుండి ఆధ్యాత్మిక పోషకాహారాన్ని పొందడాన్ని ఎంపికచేసుకోగల్గింది.—లూకా 10:38-42.

అనవసరమైన చింతను విడనాడడం

అయితే, అనవసరమైన చింతను మనమెలా విడనాడగలం? తన సేవకుల సంక్షేమం విషయంలో యెహోవా దేవునికున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధ ఉందన్న ప్రగాఢమైన నమ్మకం, అనవసరంగా కలతచెందకుండా జాగ్రత్త వహించేలా మనకు సహాయపడగలదు. యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు: “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు . . . చింతనొంద[డు] కాపుమాన[డు].” (యిర్మీయా 17:7, 8) కొండపై తానిచ్చిన ప్రసంగంలో యేసుక్రీస్తు అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆయన చింతించకుండా ఉండడాన్ని గురించి తానిచ్చిన సలహాను “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును” అనే మాటలతో ముగించాడు. (మత్తయి 6:25-34) ఈ రోజున్న సమస్యలకు రేపేం జరుగుతుందోనని చింతించడం ద్వారా వాటికి మరొక సమస్యను జతచేయకున్నా, ప్రతీ రోజూ ఆ రోజుకు సరిపడినన్ని సమస్యలు ఒక క్రైస్తవునికి ఉంటూనే ఉంటాయి. నిజానికి రేపు ఎదుర్కోవాల్సి ఉంటుందనుకున్న సమస్య అస్సలు రాకనే పోవచ్చు.

హింసా కాలంలో ఇంటరాగేషన్‌ చేసే అధికారుల ముందు ఒక క్రైస్తవుడు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లైతే, దేవుని సహాయంపై తనకున్న నమ్మకం, చింతించడం నుండి అతడ్ని విడుదల చేయగలదు. ఆ విపత్కర పరిస్థితిలో తన ఆత్మ ద్వారా తాను అతడ్ని ఆదుకుంటాననీ, శ్రేష్ఠమైన రీతిలో సాక్ష్యాన్నివ్వడం అతనికి సాధ్యమయ్యేలా చేస్తాననీ యెహోవా తన వాక్యమందు తన నమ్మకమైన సేవకులకు అభయాన్ని ఇస్తున్నాడు.—మత్తయి 10:18-20; లూకా 12:11, 12.

కాబట్టి, మనల్ని చింతాక్రాంతుల్ని చేసి, కలతలతోనూ, భయాందోళనలతోనూ మనల్ని నింపివేసేవి ఏవైనా మనల్ని చుట్టు ముడితే, మనం మన పరలోక తండ్రి వైపుకు మరలి ప్రార్థించాలి. ఆ విధంగా, మనం మనపట్ల శ్రద్ధ చూపించేవాడు మనం చెప్పినదాన్ని ఆలకిస్తాడనే నమ్మకంతో ‘మన చింత యావత్తు యెహోవామీద వేయగల్గుతాం.’ (1 పేతురు 5:7) “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన[లో] . . . మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని పౌలు చెబుతున్నాడు. ఫలితంగా హృదయంలో నెమ్మదినీ, దేవుని సమాధానాన్నీ పొందుతాం, అది మన హృదయాల్నీ, తలంపుల్నీ కావలి కాస్తుంది. (ఫిలిప్పీయులు 4:6, 7) కలతల నుండీ, ఏదో జరగనైవుందనే భయం నుండీ, ఆపద రానైవుందని ఎదురు చూడడం నుండీ మన అంతరంతరాల్లో, మన హృదయమందు విడుదల పొందుతాం, అలాగే చింతలు మూలంగా కలిగే అవరోధాలనుండీ, కలవరాన్నుండీ మన మనస్సులు కుదుటపడతాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న జ్ఞానయుక్తమైన సలహాను అనుసరిద్దాం, అనవసరంగా చింతించకుండా జాగ్రత్త వహిద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి